మరోసారి పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకోబోతున్నాడా?

పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య అన్నా లెజ్నోవా తో కూడా విడిపోయాడనే ప్రచారం జరుగుతోంది. వీరికి పెళ్లయి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. పవన్ కళ్యాణ్, తన మూడవ భార్య అన్నా లెజ్నోవా విడిపోయారని వార్త ఒకటి బయటకు వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , అన్నాకు పెళ్లయి పది సంవత్సరాలు అవుతుంది.పవన్ తో అన్నా విడిపోయి. అన్నా తన పిల్లలను తీసుకొని తిరిగి రష్యా వెళ్లిపోయిందని సమాచారం. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ […]

Share:

పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య అన్నా లెజ్నోవా తో కూడా విడిపోయాడనే ప్రచారం జరుగుతోంది. వీరికి పెళ్లయి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది.

పవన్ కళ్యాణ్, తన మూడవ భార్య అన్నా లెజ్నోవా విడిపోయారని వార్త ఒకటి బయటకు వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , అన్నాకు పెళ్లయి పది సంవత్సరాలు అవుతుంది.పవన్ తో అన్నా విడిపోయి. అన్నా తన పిల్లలను తీసుకొని తిరిగి రష్యా వెళ్లిపోయిందని సమాచారం. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ గానీ, అన్నా గానీ స్పందించలేదు.వాళ్లు విడిపోయారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రీసెంట్ గా జరుగుతున్న విషయాలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రతిసారి పవన్ కళ్యాణ్ తో కలిసి కనిపించే ఆమె ఇప్పుడు కనిపించకపోవడంతో ఆ వార్తలకు ఇంకా బలం పెరిగింది. పవన్ కళ్యాణ్ రెగ్యులర్గా తన పిల్లలతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడని కొందరు అంటున్నారు. 

అన్నా లెజ్నోవా ఎవరు? 

పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నోవా లో తీన్మార్ షూటింగ్ టైంలో కలిశారు. 2013 సెప్టెంబర్ 30న వీళ్ల పెళ్ళి జరిగింది. అన్నాకు పవన్ రెండో భర్త.2017లో వీళ్లకు కొడుకు పుట్టాడు. పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాడు. 

పవన్ కళ్యాణ్ మొదటి, రెండో భార్య ఎవరు? 

పవన్ కళ్యాణ్ 1998లో నందిని అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. 2007వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. బద్రి సమయంలో రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమెతో కూడా విడాకులు తీసుకున్నాడు. వీళ్లకు అఖీరా నందన్ అనే కొడుకు ఉన్నాడు.పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే తను నటించిన ఖుషి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నాడు. తర్వాత వరుస పరాజయాలు తనని పలకరించాయి. దాదాపు చాలాకాలం తనకు సరైన హిట్ లేదు. తన దర్శకత్వంలో వచ్చిన జానీ అట్టర్ ఫ్లాప్ అయింది. తర్వాత తను ఆచితూచి చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. చాలా కాలం తర్వాత తను చేసిన జల్సా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. జల్సా తర్వాత కూడా పవన్ కళ్యాణ్ కి కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. ఇక పవన్ కెరీర్ అయిపోయింది అనుకున్న టైంలో గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి తనకు మంచి బూస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత అత్తారింటికి దారేది అనే చిత్రం తనలో ఎంత పెద్ద నటుడు ఉన్నాడో అందరికీ తెలిసేలా చేసింది. కొన్ని పరాజయాలు చవిచూసినా కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. తన సినిమాలలో డైలాగ్స్ కి సపరేట్ ఫాన్స్ ఉంటారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తనకి బెస్ట్ ఫ్రెండ్.తను రానా తో కలిసి భీమ్లా నాయక్ అనే మల్టీ స్టారర్ కూడా చేశాడు. పవన్ కొత్త చిత్రం పేరు ఓజి. పవన్ కళ్యాణ్ ఒక మంచి నటుడు అది కాదనలేని సత్యం. తన ప్రొఫెషనల్ కెరీర్ లాగానే, పర్సనల్ కెరీర్ కూడా బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.