థియేట‌ర్ ధ్వంసం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్

సినిమా పరంగా పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. జూలై 28న విడుదలైన పవన్ కళ్యాణ్ చిత్రం బ్రో, మంచి బాక్సాఫీస్ ఓపెనింగ్‌ను తెచ్చిందని చెప్పుకోవాలి. అయితే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వారి అత్యుత్సాహంతో థియేటర్లలో చేసిన హంగామా కారణంగా, థియేటర్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కలగచేసుకుని కొంతమంది ఫ్యాన్స్ ని అరెస్ట్ చేశారు. పవర్‌స్టార్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించిన పవన్ […]

Share:

సినిమా పరంగా పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. జూలై 28న విడుదలైన పవన్ కళ్యాణ్ చిత్రం బ్రో, మంచి బాక్సాఫీస్ ఓపెనింగ్‌ను తెచ్చిందని చెప్పుకోవాలి. అయితే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వారి అత్యుత్సాహంతో థియేటర్లలో చేసిన హంగామా కారణంగా, థియేటర్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కలగచేసుకుని కొంతమంది ఫ్యాన్స్ ని అరెస్ట్ చేశారు.

పవర్‌స్టార్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించిన పవన్ కళ్యాణ్ తాజా చిత్రం బ్రో జూలై 28న విడుదలైంది. ఇందులో వారిద్దరూ నటించిన్నప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్‌ను చూసింది. బాక్సాఫీస్ రిపోర్ట్ ప్రకారం, ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.50 కోట్లు రాబట్టింది. అంతేకాకుండా, గడిచిన ఆదివారం బ్రో సినిమా చూసేందుకు థియేటర్లు నిండిపోయాయని చెప్పుకోవాలి.

పవన్ కళ్యాణ్ అభిమానుల అరెస్టు: 

సినిమా థియేటర్లో ప్లే అవుతున్న సమయంలో, థియేటర్ యాజమాన్యానికి నష్టాన్ని కలిగించినందుకు, కొంతమంది సినీ ప్రేక్షకులను అరెస్టు చేయడంతో అభిమానుల ఉత్సాహం ఊహించని మలుపు తిరిగింది. అందిన సమాచారం ప్రకారం, ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురంలోని సౌందర్య థియేటర్‌లో జరిగింది. అయితే సినిమా ప్లే అవుతున్న సందర్భంలో, కొంతమంది అభిమానులు థియేటర్ స్క్రీన్ పైన పాలాభిషేకం చేయడంతో సంఘటన చోటు చేసుకుంది. అక్కడ వారు పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఆయనకి ఆరాధన మరియు పూజల రూపంలో థియేటర్ స్క్రీన్‌పై పాలు పోశారు. వారి అతి ఉత్సాహమే ప్రస్తుతం వారు అరెస్టు అయ్యేందుకు దారి తీసింది.

పాలు పోయడం వల్ల స్క్రీన్ దెబ్బతింది, అంతేకాకుండా సినిమా అంతరాయానికి దారితీసింది. అయితే థియేటర్ యాజమాన్యం ఇచ్చిన కంప్లీట్ ఆధారంగా, పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ సంఘటన యొక్క వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా థియేటర్ స్క్రీన్ ముందు మంటలు వేసి, తమ అభిమానాన్ని విచిత్రంగా ప్రదర్శించే ప్రయత్నం చేశారు. అందుకే థియేటర్ యాజమాన్యం థియేటర్లో జరుగుతున్న నష్టాన్ని పరిగణలోకి తీసుకుని పోలీసులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం, విధ్వంసానికి కారణమైన అభిమానులను అరెస్టు చేశారు

ఇదేం మొదటిసారి కాదు: 

పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్లలో ఇబ్బంది పెట్టడం ఇదే మొదటిసారి కాదు. 2022లో, అతని 51వ పుట్టినరోజు సందర్భంగా అతని సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా జల్సా రీ రిలీజ్ కూడా, థియేటర్ విధ్వంసం వంటి సంఘటనలు జరిగాయి, కొన్ని ప్రదేశాలలో షో రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జనవరిలో ఖుషి రీ-రిలీజ్ వేడుకల పేరుతో బీభత్సం సృష్టించిన ఎనిమిది మంది పవన్ కళ్యాణ్ అభిమానులను చీరాల శాంతి థియేటర్‌లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

‘BRO’ సినిమా గురించి మరింత: 

‘బ్రో’లో పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌లతో పాటు ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం, సుబ్బరాజు మరియు వెన్నెల కిషోర్‌లతో సహా మరె ఎంతోమందిస్తేనే తారలు ఈ సినిమాలో ముఖ్యపాత్రులుగా పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రానికి సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటర్, పాటలను థమన్ సంగీతాన్ని అందించడం జరిగింది.