డివోషనల్ పాత్రలలో అలరిస్తున్న హీరోలు

మరో వైవిధ్యమైన పాత్రలో నటించి మనల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు మ‌న తెలుగు హీరోలు. అలనాటి నటుడు కృష్ణంరాజు తన నటనతో ఎంతగానో అలరించిన భక్తకన్నప్ప సినిమా, కొత్త వర్షన్ లో మన ముందుకు రాబోతోంది. ఇందులో ప్రభాస్ మరియు మంచు విష్ణు ఆకట్టుకునే పాత్రలలో కనువిందు చేయనున్నారట. శివునిగా కనిపించనున్న ప్రభాస్:  ‘అధిపురుష్’లో రాముడుగా నటించిన తర్వాత, స్టార్ ప్రభాస్ నటించిన భక్తిరస చిత్రం ‘భక్త కన్నప్ప’లో శివుడి పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక […]

Share:

మరో వైవిధ్యమైన పాత్రలో నటించి మనల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు మ‌న తెలుగు హీరోలు. అలనాటి నటుడు కృష్ణంరాజు తన నటనతో ఎంతగానో అలరించిన భక్తకన్నప్ప సినిమా, కొత్త వర్షన్ లో మన ముందుకు రాబోతోంది. ఇందులో ప్రభాస్ మరియు మంచు విష్ణు ఆకట్టుకునే పాత్రలలో కనువిందు చేయనున్నారట.

శివునిగా కనిపించనున్న ప్రభాస్: 

‘అధిపురుష్’లో రాముడుగా నటించిన తర్వాత, స్టార్ ప్రభాస్ నటించిన భక్తిరస చిత్రం ‘భక్త కన్నప్ప’లో శివుడి పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక భక్తునికి శివునికి మధ్య జరిగే వైవిధ్యమైన కాధే ఈ చిత్రం. నిజానికి చెప్పాలంటే, ప్రభాస్‌కు ఇది రోల్ రివర్సల్. అతని మేనమామ మరియు ప్రముఖ నటుడు కృష్ణం రాజు పాత క్లాసిక్ 1976లో వచ్చిన’భక్త కన్నప్ప’లో కన్నప్ప పాత్రను చాలా బాగా పోషించాడు, ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాలయ్య శివుడిగా కనిపించాడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు తర్వాత ఇప్పుడు, ప్రభాస్ నటిస్తున్నాడు. భక్త కన్నప్ప తాజా వెర్షన్‌లో శివునిగా దర్శనం ఇవ్వనన్నాడు ప్రభాస్, ఇక ఈ సినిమాలో మంచు విష్ణు అతని భక్తుడిగా నటిస్తున్నట్లు కొన్ని నివేదికలు చెప్తున్నాయి.

ప్రభాస్ ఇటీవల నటించిన భక్తిరస చిత్రం ‘ఆదిపురుష్’లో రాముడిగా ప్రేక్షకులు ఇప్పటికే అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. నిజానికి యాక్షన్ సినిమాలో నటిస్తున్న హీరోలను డివోషనల్ క్యారెక్టర్స్ లో కనిపించి ప్రేక్షకులను అలరించడం అంటే మామూలు విషయం కాదు. డివోషనల్ క్యారెక్టర్స్ లో కనిపించే కొంతమందిని మాత్రమే ప్రేక్షకులు అభిమానిస్తారు. అభిమానాలు దక్కించుకున్న ప్రభాస్ ఇప్పుడు మరో ముందడుగు వేయబోతున్నాడు. అతని అందం, అదేవిధంగా వ్యక్తిత్వంతో, ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో జీవించాడని చెప్పుకోవాలి. చాలా తక్కువ మంది నటులకు మాత్రమే అలాంటి గౌరవం మరియు ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది.. కాబట్టి ఇది అతనికి ఒక వరం, అని ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. 

ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. ఈ సినిమా మూడు రోజుల్లో దాదాపుగా 340 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ అని మరోసారి ఈ సినిమా నిరూపించింది. ప్రభాస్ ఇంతకుముందు సినిమా రాధే శ్యామ్ ఫ్లాప్ అయినప్పటికీ, ఈ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం ప్రభాస్ క్రేజ్ ఏంటో తెలియజేస్తుంది. ప్రభాస్ తదుపరి సినిమా సలార్ సెప్టెంబర్ 20న రిలీజ్ అవుతుంది అన్నప్పటికీ వాయిదా పడింది. ప్రభాస్ సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటున్నాడు. 

అభిమానాలు అందుకున్న పవన్: 

2015లో తెలుగులో బ్లాక్‌బస్టర్ అయిన ‘గోపాల గోపాల’లో శ్రీకృష్ణుడి పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు టాలీవుడ్ సూపర్‌స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు మాస్ వైపు సినిమాలు తీసేందుకు ఎక్కువ మాకు చూపిస్తూ ఉంటాడు. కానీ అతను కూడా గోపాల గోపాల సినిమా ద్వారా ఒక కృష్ణుడు పాత్రలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరనే చెప్పుకోవాలి.

ప్రతి నటుడూ డివోషనల్ గా కనిపించే కొన్ని పాత్రలలో అడుగుపెట్టడం అంత సులభం కాదు. అలాంటి డివోషనల్ పాత్రలలో ఆకట్టుకోవడానికి ముఖ్యంగా, ఎంతో అనుభవం.. అద్భుతమైన ఇమేజ్ అవసరం. అయితే ప్రేక్షకులను మరింత అలరించేందుకు, కాస్త స్టైల్ జోడించి గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ కు ఒక రైడర్ గా బైక్ కూడా ఇవ్వడం జరిగిందని.. అతని ఆకర్షించే గొప్ప చిరునవ్వు, శ్రీకృష్ణుని యొక్క స్థిరమైన లక్షణం, ప్రేక్షకులను కూడా పెద్ద సంఖ్యలో ఆకర్షించిందని.. అంతేకాకుండా ఇటీవలే తను నటించిన ‘బ్రో’ సినిమాలో కాల దేవుడుగా నటించి మరింత అభిమానాన్ని సంపాదించుకున్నాడని, ఇలాంటి పాత్రలు మరిన్ని చేయొచ్చు అని ‘గోపాల గోపాల’ సినిమా తీసిన దర్శకుడు డాలీ అంటున్నారు.