Pawan Kalyan: భార్యతో ఇటలీ బయలుదేరిన పవన్ కళ్యాణ్..

వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరి వివాహం ఇటలీలో జరగనుంది. ఇప్పటికే వరుణ్ తేజ్, లావణ్య ఇటలీ వెళ్లిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన భార్య అన్నా లెజ్నేవా (Anna Lezhneva) హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇటలీ వెళ్లారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన భార్య అన్నా లెజ్నేవాతో (Anna Lezhneva) కలిసి ఇటలీ బయలుదేరి వెళ్లారు. తన్న […]

Share:

వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరి వివాహం ఇటలీలో జరగనుంది. ఇప్పటికే వరుణ్ తేజ్, లావణ్య ఇటలీ వెళ్లిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన భార్య అన్నా లెజ్నేవా (Anna Lezhneva) హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇటలీ వెళ్లారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన భార్య అన్నా లెజ్నేవాతో (Anna Lezhneva) కలిసి ఇటలీ బయలుదేరి వెళ్లారు. తన్న అన్నయ్య నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలో పాల్గొనడానికి భార్యతో కలిసి జనసేనాని ఇటలీ(Italy) వెళ్లారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు(Airport)లో అన్నా లెజ్నేవాతో కలిసి పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వెళ్తున్న వీడియో, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి. ఈ వీడియో, ఫొటోలను పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెక్ షర్ట్, కార్గో ప్యాంట్ వేసుకోగా.. ఆయన భార్య తెలుపు రంగు చొక్కా, నీలం వర్ణం ప్యాంట్ ధరించారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి భార్యాభర్తలు కాబోతున్న విషయం తెలిసిందే. వీరి వివాహం నవంబర్ 1న ఇటలీలోని టస్కనీలో ఉన్న బార్గో సాన్ ఫెలిసే రిసార్ట్‌లో జరగనుంది. ఈ పెళ్లి కోసం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి శుక్రవారం ఇటలీ బయలుదేరి వెళ్లారు. వరుణ్, లావణ్య హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించిన దృశ్యాలు నిన్న సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నేవా కలిసి ఇటలీ వెళ్తున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి. వరుణ్ తేజ్ పెళ్లిలో పాల్గొనడం కోసం కొన్నిరోజుల పాటు సినిమా షూటింగ్‌లు, రాజకీయ కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ విరామం ఇచ్చారు. ఈ వివాహ వేడుకకు వెళ్లడానికి ముందు ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustad Bhagat Singh) సినిమా కోసం నిర్విరామంగా పవన్ కళ్యాణ్ పనిచేశారు.

ఇదిలా ఉంటే, కొణిదెల ఫ్యామిలీ(Konidela family)తో పాటు అల్లువారు కూడా ఇప్పటికే ఇటలీ వెళ్లినట్టు సమాచారం. ఈనెల 27న వారంతా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇటలీ వెళ్లారని అంటున్నారు. అయితే, ఈ విషయంలో అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. కాగా, ఈనెల 30 నుంచి వరుణ్ తేజ్, లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్(Pre wedding celebrations) ప్రారంభమవుతాయని సమాచారం. నవంబర్ 1న అంగరంగ వైభవంగా పెళ్లి జరగనుంది. ఆ తర్వాత మళ్లీ మెగా, అల్లు ఫ్యామిలీలు ఇండియాకు తిరిగి వస్తాయి. నవంబర్ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే రిసెప్షన్ కి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్(Invitation card)ని అతిధులందరికీ పంచుతున్నారు. తాజాగా ఇన్విటేషన్ కార్డుకు సంబంధించి ఓ వీడియోని వరుణ్ తేజ్ తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. చూడడానికి చాలా రిచ్ గా ఆకర్షణీయంగా ఉన్న ఈ రిసెప్షన్ ఇన్విటేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శుభలేఖ ముందు భాగంలో వరుణ్, లావణ్య పేర్లలోని విఎల్ అక్షరాలతో లోగోని డిజైన్ చేశారు.

లోపల పై భాగంలో వరుణ్ తేజ్ నానమ్మ అంజనాదేవి, తాతయ్య కొణిదెల వెంకటరావు ఆశీస్సులతో.. అని ముద్రించి ఉంది. ఆ తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్.. అంటూ, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పేర్లను హైలైట్ చేయడం విశేషం. కాగా రిసెప్షన్ ఇన్విటేషన్ లో గెస్ట్ లకు అవసరమైన కార్ పాస్ లను కూడా పొందుపరిచారు. వరుణ్, లావణ్య పెళ్లి దగ్గర పడడంతో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వరుణ్ లవ్ అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తొలిసారి ‘మిస్టర్’ సినిమా కోసం కలుసుకున్నారు. ఈ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. ఆ తర్వాత ‘అంతరిక్షం’ సినిమాలో మళ్లీ జతకట్టారు. తొలి సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్టు సమాచారం. సుమారు ఐదేళ్లపాటు ప్రేమించుకున్న వరుణ్, త్రిపాఠి.. పెద్దల అంగీకారంతో ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. వీరి నిశ్చితార్థ వేడుక జూన్ 9న జరిగిన విషయం తెలిసిందే.