పీఎం బయోపిక్ ఆగిపోనట్లేనా??

ఇండియాలో జనాధరణ ఉన్న నేతల్లో మొదటి వరుసలో మన ప్రధాని మోదీ ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకటి కాదు రెండు కాదు మోదీ చాలా సార్లు ఈ లిస్టులో మొదటి స్థానం దక్కించుకున్నారు. కేవలం మన ఇండియా అనేక కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నా కానీ గత కొద్ది రోజుల నుంచి మోదీ జనాధరణ పెరుగుతూనే ఉంది. అటువంటి మోదీ జీవిత గాధ ఆధారంగా ఓ బాలీవుడ్ సినిమా మొదలైంది. ఎక్కడో గుజరాత్ లో పుట్టిన […]

Share:

ఇండియాలో జనాధరణ ఉన్న నేతల్లో మొదటి వరుసలో మన ప్రధాని మోదీ ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకటి కాదు రెండు కాదు మోదీ చాలా సార్లు ఈ లిస్టులో మొదటి స్థానం దక్కించుకున్నారు. కేవలం మన ఇండియా అనేక కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నా కానీ గత కొద్ది రోజుల నుంచి మోదీ జనాధరణ పెరుగుతూనే ఉంది. అటువంటి మోదీ జీవిత గాధ ఆధారంగా ఓ బాలీవుడ్ సినిమా మొదలైంది. ఎక్కడో గుజరాత్ లో పుట్టిన మోదీ చిన్నపుడు అనేక కష్టాలు పడ్డారని చెబుతారు. అంచెలంచెలుగా ఎదిగిన అతడు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడమే కాకుండా మన దేశానికి కూడా రెండు సార్లు ప్రధాని అయ్యారు. దీంతో మోదీకి ఉన్న క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. 2019 ఎన్నికల్లో రెండోసారి బీజేపీని అధికారంలో నిలపడమే కాదు.. అంతకు ముందు కంటే ఎక్కువ మెజారిటీని సంపాదించారు. అటువంటి మోదీ జీవితం మీద సినిమా వస్తుందంటే చాలా మంది ఆతృతగా ఎదురు చూశారు. 

మోదీగా అతడే.. 

ఇంత పెద్ద బయోపిక్ లో మోదీ పాత్రను ఎవరు చేస్తారని చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ మోదీ పాత్రను చేస్తున్నారని అంతా బాగానే ఉంది అనుకున్నారు. పరేష్ ఇప్పటికే అనేక మూవీల్లో చేసి ఉండడంతో ఆయన ఈ పాత్రను తప్పకుండా రసవత్తంగా పండిస్తారని అంతా అనుకున్నారు. ఎన్నో హిట్ సినిమాల్లో పరేష్ నటించారు. కేవలం బాలీవుడ్ అని మాత్రమే కాకుండా అనేక ఇండస్ట్రీలలో కూడా పరేష్ నటించి మెప్పించారు. దీంతో ఈ మూవీ పక్కాగా హిట్ అవుతుందని అంతా నమ్మారు. కానీ ఈ మూవీ ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల మీద మేకర్స్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ సినిమా ఆగిందంటూ మాత్రం వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ మూవీ మీద పరేష్ రావల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు..

చాలెంజింగ్ రోల్ కు సిద్ధమవుతున్నా… 

తన కెరియర్ లో ఎన్నో రోల్స్ చేసిన పరేష్ రావల్ పీఎం మోదీ జీవితగాధ ఆధారంగా తెరకెక్కించే మూవీ గురించి స్పందిస్తూ ఇది పెద్ద చాలెంజింగ్ రోల్. ఈ చాలెంజ్ కోసం నేను సిద్ధం అవుతున్నా అని తెలిపారు. ఈ మూవీని చేసేందుకు నేను ఆతృతతో ఎదురుచూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ మూవీ అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా ఉంటుందని ఆయన 2019వ సంవత్సరంలో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ ప్రస్తుతం మాత్రం ఈ ప్రాజెక్ట్ ను మేకర్స్ హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి రావల్ మాట్లాడుతూ.. అతడి మీద ఇప్పటికే రెండు మూడు సినిమాలు వచ్చాయని తెలిపారు. అలా కాకుండా ఇది (ఈ మూవీ క్యారెక్టర్) తన మనసుకి ఎంతో నచ్చిందని పేర్కొన్నారు. ఎన్నో మంచి పాత్రలను చేయాలని తనకు ఎంతో కోరికగా ఉందని రావల్ తెలిపారు. 

ఆగినట్లేనా?? 

ఎన్నికల్లో వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న మోదీకి ఇది పెద్ద షాకింగ్ వార్తే అని అంతా అనుకుంటున్నారు. 2024 ఎన్నికల ముందు ఈ మూవీ వస్తే ఈ మూవీ బీజేపీ పార్టీకి పొలిటికల్ గా మంచి మైలేజ్ ఇచ్చేదని ఇప్పుడు ఈ సినిమా ఆగిపోతే బీజేపీకి పెద్ద మైనస్ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. పరేష్ రావల్ ఎంపీగా కూడా పని చేశాడు. అతడు వివిధ పార్టీల నుంచి పోటీకి దిగాడు.