రికార్డులు బ్రేక్ చేస్తున్న Salaar.. ఐదో రోజు కూడా భారీగా కలెక్షన్లు!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన 'Salaar పార్ట్-1 సీజ్ ఫైర్' మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను గొప్పగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

Courtesy: x

Share:

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన 'Salaar పార్ట్-1 సీజ్ ఫైర్' మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను గొప్పగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ తొలిరోజే రూ.178 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న ఏకైక చిత్రంగా రికార్డు సృష్టించింది. 

Salaar తొలి నాలుగు రోజులతో పోలిస్తే ఐదో రోజు వసూళ్లు తగ్గినప్పటికీ, షారుక్ ఖాన్ డంకీతో పోలిస్తే భారీ వసూళ్లే సాధించింది. ఐదో రోజు ప్రభాస్ మూవీ ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ.25.13 కోట్లు వసూలు చేసినట్లు సాక్ నిల్క్ సైట్ వెల్లడించింది. దీంతో తొలి ఐదు రోజుల్లో ఇండియాలో సలార్ సాధించిన వసూళ్లు రూ.280 కోట్లకు చేరాయి. తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం సలార్ మూవీ రూ.13.19 కోట్లు వసూలు చేసింది. హిందీలో రూ.9.7 కోట్లు, తమిళంలో రూ.1.2 కోట్లు, మలయాళంలో రూ.0.72 కోట్లు, కన్నడలో రూ.0.32 కోట్లు రాబట్టింది.

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.400 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఆరు లేదా ఏడో రోజుకు రూ.500 కోట్ల మార్క్ అందుకునే అవకాశాలు ఉన్నాయి.అతి తక్కువ సమయంలోనే నైజాంలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా నిలిచిన సలార్ మూవీ'అల వైకుంఠపురంలో' కలెక్షన్స్ సైతం వెనక్కి నెట్టి టాప్ 3 ప్లేస్ లో నిలిచింది.

సలార్ మూడు రోజుల్లోనే దాదాపు రూ.44.5 కోట్ల రూపాయల వసూళ్లు నైజాం ఏరియాలో సాధించింది. ఇక నాలుగు రోజులకు గాను రూ.50 కోట్లకు పైగా షేర్ సాధించి నాన్ రాజమౌళి రికార్డుని క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు నైజాం లో 'RRR' రూ.111.85 కోట్ల షేర్ తో మొదటి స్థానంలో ఉండగా 'బాహుబలి 2' రూ.68 కోట్ల షేర్ అందుకొని రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మరే సినిమా నైజాం ఏరియాలో రూ.50 కోట్ల మార్క్ అందుకోలేదు. కానీ సలార్ నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల షేర్ దాటేసి మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ సలార్ తో నాలుగు రోజుల్లోనే తన రికార్డ్ ని తానే బ్రేక్ చేయడం విశేషం. 

సలార్ ఈ రేంజ్ లో కలెక్ట్ చేయడానికి వీకెండ్ తో పాటు క్రిస్మస్ హాలిడే కూడా కలిసి వచ్చింది. సలార్ రిలీజ్ అయిన నాలుగో రోజు క్రిస్మస్ హాలిడే కావడంతో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు చాలా థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. సలార్ ఊపు చూస్తుంటే ఈ సినిమాని నైజాంలో రిలీజ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్స్ గా నటించారు. శ్రీయా, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషించారు.

మరోవైపు, డంకీ మూవీ తొలి రోజులు కలిపి ఇండియాలో కేవలం రూ.140 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సలార్ మాత్రం ఐదు రోజుల్లోనే అంతకు రెట్టింపు అంటే రూ.280 కోట్లు వసూలు చేస్తూ దూసుకెళ్తోంది. హిందీ బెల్ట్ లోనూ చాలా చోట్ల థియేటర్లలో డంకీని తీసేసి సలార్ షోలు వేస్తున్నారు. దీంతో క్రమంగా డంకీ తెరమరుగవుతుండగా.. సలార్ స్పష్టమైన ఆధిపత్యం చెలాయిస్తోంది.