రాజమౌళితో కలిసి ఫోటోలకు పోజులిచ్చిన రవీనా టాండన్… అసలు కథ ఏమిటి?

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో బుధవారం జరిగిన పద్మ అవార్డ్స్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నటి రవీనా టాండన్‌కు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందజేశారు.. ఈ విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు రవినా టాండన్.  ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి ఆ ఫోటోలపై మీరు ఓ లుక్ వేయండి. ఈ ఫోటోలలో రవీనా టాండన్‌తో కలిసి లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి కూడా కనిపించడం మరో […]

Share:

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో బుధవారం జరిగిన పద్మ అవార్డ్స్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నటి రవీనా టాండన్‌కు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందజేశారు.. ఈ విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు రవినా టాండన్.  ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి ఆ ఫోటోలపై మీరు ఓ లుక్ వేయండి. ఈ ఫోటోలలో రవీనా టాండన్‌తో కలిసి లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి కూడా కనిపించడం మరో విశేషం..  

ఇంస్టాగ్రామ్‌లో రవీనా చిరస్మరణీయ ఈవెంట్ గురించి పలు ఫోటోలతో పాటు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  రాష్ట్రపతి భవన్‌లో రవీనా టాండన్ తన కుటుంబంతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది. రణబీర్ దడని నిర్మాత అనిల్ దడని బ్లాక్ ఫార్మల్ వేసుకోగా..  రవినాటాండన్ బ్లాక్ బ్లౌజ్‌తో జత చేసిన బంగారు రంగు చీరను కట్టుకుంది. తన కుమార్తె బ్లాక్ అండ్ వైట్ లెహంగా వేసుకుంది.. వీళ్లందరితో కలిసి తన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసుకోగా.. మరొక ఫోటోలో టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజమౌళి‌తో పాటు రవీనా టాండన్ తన కుటుంబంతో కలిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ రవీనా టాండన్ ప్రేమ, వేడుకలతో కూడిన రోజు ఈ రోజు, పద్మశ్రీ 2023 ప్రదానోత్సవం జరిగిన రోజు అని రాసుకొచ్చింది. రవీనా టాండన్‌కి ఈ పద్మశ్రీ అవార్డు రావడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారు. సినీ ప్రేక్షకులతో పాటు మరి కొంతమందిని డిజైన్స్ కూడా ఆమెకు కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారు.

ప్రస్తుతం రవీనా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలకి ఆమె అభిమానులు మరి కొంతమందిని నెటిజన్లు హార్ట్, ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న తరువాత రవీనా తన కూతురితో, కుమారుడితో కలిసి ముంబై ఎయిర్ పోర్ట్‌కి వెళ్తూ కనిపించారు. 

అక్కడ రవీనా టాండన్ మాట్లాడుతూ.. ఈ ప్రత్యేకమైన అవార్డును నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని.. నా రచనలు, నా జీవితం, నా అభిరుచి, నా ఉద్దేశాన్ని గుర్తించినందుకు భారతదేశ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు.. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆఫ్ సినిమా విభాగంలో ఈ ప్రయాణంలో నాకు మార్గ నిర్దేశం చేసిన వారందరికీ నేను ముందుకు వెళ్లడానికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ విషయంలో నేను నా కన్నతండ్రి కి రుణపడి ఉంటాను.. ఆయన వల్లే నాకు ఈ రోజు ఈ అవార్డు లభించింది అని రవీనా అన్నారు. తన తండ్రికి జీవితాంతం ఋణపడి ఉంటానని ఈ సందర్భంగా రవీనా అన్నారు. 

రవినా తండ్రి చివరిసారిగా కేజిఎఫ్ 2 చిత్రంలో నటించారు ముందు ముందు వచ్చే కేజీఎఫ్ ప్రాజెక్టుల్లో ఆమె మళ్లీ కనిపించనున్నారు.  అలాగే మరికొన్ని చిత్రాలలో కూడా ఆమె నటించనున్నారు. 

పద్మశ్రీ అవార్డు రావడానికి కారణం అతనే… నాన్న! – రవీనా టాండన్..