ఈ వారం బోలెడు ఓటీటీ రిలీజ్‌లు..!

ఇండస్ట్రీలోకి OTT లు ఎంట్రీ ఇచ్చిన తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఎంత థియేటర్ లో చూసినా OTTలో ఫ్యామిలీతో కలిసి చూస్తే వచ్చే మజానే వేరని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. అందుకోసమే ఓటీటీలను సబ్ స్క్రైబ్ చేస్తుంటారు. ఫ్యామిలీతో కలిసి మూవీకి వెళ్లే బదులు అదే మూవీని ఓ OTT సబ్ స్క్రిప్షన్ తీసుకుని చూస్తే సరిపోతుందని అంతా అంటున్నారు. థియేటర్లలో టికెట్ కాస్ట్ పెరగడం కూడా […]

Share:

ఇండస్ట్రీలోకి OTT లు ఎంట్రీ ఇచ్చిన తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఎంత థియేటర్ లో చూసినా OTTలో ఫ్యామిలీతో కలిసి చూస్తే వచ్చే మజానే వేరని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. అందుకోసమే ఓటీటీలను సబ్ స్క్రైబ్ చేస్తుంటారు. ఫ్యామిలీతో కలిసి మూవీకి వెళ్లే బదులు అదే మూవీని ఓ OTT సబ్ స్క్రిప్షన్ తీసుకుని చూస్తే సరిపోతుందని అంతా అంటున్నారు. థియేటర్లలో టికెట్ కాస్ట్ పెరగడం కూడా ప్రజలు OTTల బాట పట్టేందుకు ఒక కారణం అయిందనే చెప్పాలి. కారణాలు ఏవైనా కానీ ప్రజలు మాత్రం OTTకి బాగా అలవాటు పడ్డారు. ఎంతలా అంటే ఇన్నాళ్లూ ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే థియేటర్ కు క్యూ కట్టే జనాలు కాస్త ఇప్పుడు ఏదైనా కొత్త మూవీ రిలీజ్ అవుతుందంటే హే OTTలోకి వస్తుంది కదా… అప్పుడు చూద్దాం అంటూ మారిపోయారు. థియేటర్లలోకి సినిమా వస్తుందంటే చాలు ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. OTTలోకి వచ్చినపుడు చూద్దాంలే అని అంటున్నారు.

బ్రో దర్శనం.. కల్ట్ బేబీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయితేజ్ కలిసి ఏస్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో నటించిన కొత్త మూవీ బ్రో. ఈ మూవీని థియేటర్లలో మిస్ అయిన వారు ప్రస్తుతం ఓటీటీలో చూసేయచ్చు. జూలై 28న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ మూవీ స్ట్రీమింగ్ కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లలో ఈ మూవీని చూడడం మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూసేయొచ్చు. ఇక చిన్న సినిమాగా విడుదలయి సంచలన విజయం సాధించిన బేబీ మూవీ కూడా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. తెలుగు ఓటీటీ ఆహాలో ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ భాషలోనూ అదే ఆహాలో ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది. అప్పడు థియేటర్లలో ఈ మూవీని చూడడం మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆస్కారం ఉంది.   

మరిన్ని కూడా..

OTTలో సినిమాలు మాత్రమే కాకుండా షోస్ కూడా వస్తున్నాయి. దీంతో అనేక మంది OTTల సబ్ స్క్రిప్షన్స్ తీసుకుంటున్నారు. OTTల హవా వల్ల థియేటర్లు కూడా తమ ఆదాయాన్ని కోల్పోతున్నాయి. ఈ OTTల ఎఫెక్ట్ ను తట్టుకోవడానికి మూవీ మేకర్స్ కొత్త కొత్త రూల్స్ ను తీసుకొస్తున్నాయి. ఎన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చినా కానీ OTTల హవా మాత్రం తగ్గడం లేదు. దీంతో పెద్ద పెద్ద హీరోలు కూడా తమ సినిమాల విషయంలో వెనకడుగు వేస్తున్నారు. దీంతో రిలీజ్ లపై తీవ్ర ప్రభావం పడుతోంది. 

సెన్సార్ సమస్య

ఓటీటీలకు మరీ ముఖ్యంగా సెన్సార్ సమస్య వస్తోంది. ఓటీటీలకు సెన్సార్ లేకపోవడం వల్ల అశ్లీల పదజాలం, బూతు సినిమాలు ఎక్కువగా విడుదల చేస్తున్నారంటూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. థియేట్రికల్ మూవీలకు సెన్సార్ పెట్టిన విధంగానే ఓటీటీల్లో రిలీజ్ అయ్యే మూవీలకు కూడా సెన్సార్ ఉండాలని పలువురు కోరుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వాలు కూడా కృషి చేస్తున్నాయి. త్వరలోనే ఓటీటీలకు ప్రత్యేక సెన్సార్ వచ్చే అవకాశం లేకపోలేదు. OTTల హవా ఎంత ఘోరంగా ఉందంటే OTTలు సొంతంగా సినిమాలను కూడా నిర్మిస్తున్నాయి. ఒక్క ప్లాట్ ఫాం అని కాకుండా అన్ని ప్లాట్ ఫాంలు సినిమాలను సొంతంగా నిర్మిస్తున్నాయి. ఈ కారణంతో OTTలకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల OTTలు ఉన్నాయి. ఏ ఒక్క OTT అని కాకుండా అన్ని రకాల OTTలు సత్తా చాటుతున్నాయి. మార్కెట్ ను శాసిస్తున్నాయి. ఈ రంగంలో ఇంకా అనేక రకాల OTTలు వస్తున్నాయి. ఈ OTTల హవా ఎలా ఉందంటే బడా డిస్ట్రిబ్యూటర్లు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత 8 వారాలకే OTTల్లో ప్రదర్శించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో కాస్త ఊరట కలిగినా కానీ కొన్ని మూవీస్ ఈ నిబంధనలు పాటించట్లేదు. ఏవైనా మూవీలు థియేటర్ లో ప్లాప్ అయితే వెంటనే OTTలోకి వచ్చేస్తున్నాయి. 

నిబంధన గాలికి వదిలేస్తున్న టాప్ ప్రొడ్యూసర్లు

ఏదైనా ఒక మూవీ రిలీజ్ అయిన 8 వారాల తర్వాతనే ఓటీటీలోకి రావాలని ఇండస్ట్రీ లోని వారంతా ఓ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ నిర్ణయానికి కొన్ని సినిమాలు మంగళం పాడుతున్నాయి. సపోస్ ఒక పెద్ద హీరో మూవీ రిలీజ్ అయి… అనుకున్న స్థాయిలో ఆడకపోతే ఆ మూవీ వెంటనే ఓటీటీలో దర్శనం ఇస్తోంది. ఇటువంటి టైంలో నిర్మాతలు 8 వారాల నిబంధనను పట్టించుకోవడం లేదు. అంతే కాకుండా వారం వారం కొత్త సినిమాలతో వెబ్ సిరీస్ లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక్క వెబ్ సిరీస్ అని కాకుండా పలు వెబ్ సిరీస్ లు భారీ హిట్లు సాధిస్తున్నాయి. దీంతో OTTల నిర్వాహకులు కొత్త జోష్ తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా కొత్త సినిమాలను కూడా తెరకెక్కిస్తూ కొత్త జోష్ ను నింపుతున్నారు. 

కొత్త సరుకుతో ఫుల్ జోష్

ఓటీటీల్లోకి ప్రతి వారం కొత్త సరకు వచ్చి చేరుతోంది. దీంతో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. అంతే కాకుండా యూజర్స్ ఇంట్రెస్ట్ ని బట్టి అవి పలు రకాల మూవీస్ మరియు సిరీస్ లను సజెస్ట్ చేస్తున్నాయి. విపణిలో ఉన్న అన్ని OTTలు వారం వారం కొత్త షోస్, మూవీలతో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. కేవలం ఏదో కొత్త మూవీస్ వచ్చాయా? అన్నట్లు కాకుండా వాటికి భారీ ప్రచారాలను కల్పిస్తున్నారు. కొన్ని రకాల OTTలు యూజర్ల నుంచి సబ్ స్క్రిప్షన్ చార్జీలను వసూలు చేస్తుండగా.. కొన్ని OTTలు మాత్రం యూజర్లకు ఫ్రీగా మూవీ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తున్నాయి. దీంతో చాలా మంది యూజర్స్ ఈ OTTల పట్ల అట్రాక్ట్ అవుతున్నారు.