రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల అసాధారణమైన డ్యాన్స్ స్కిల్స్‌ని ఎస్‌ఎస్ రాజమౌళి ప్రశంసించారు

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లకు డ్యాన్స్ అంటే అమితమైన అభిరుచి ఉందని, ఎంతో ప్రతిభావంతులైన డ్యాన్సర్లని ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వెల్లడించారు. ‘ఆర్ఆర్ఆర్’లోని “నాటు నాటు” పాట యొక్క భావోద్వేగ ప్రాముఖ్యత గురించి ఆయన చర్చించారు. ఈ సెషన్‌లో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ కేవలం విన్యాసాలు లేదా పరిపూర్ణతకు సంబంధించినది కాదని అన్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరి డ్యాన్స్ స్కిల్స్ ని ఆయన మెచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ లోని “నాటు నాటు” పాట […]

Share:

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లకు డ్యాన్స్ అంటే అమితమైన అభిరుచి ఉందని, ఎంతో ప్రతిభావంతులైన డ్యాన్సర్లని ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వెల్లడించారు. ‘ఆర్ఆర్ఆర్’లోని “నాటు నాటు” పాట యొక్క భావోద్వేగ ప్రాముఖ్యత గురించి ఆయన చర్చించారు. ఈ సెషన్‌లో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ కేవలం విన్యాసాలు లేదా పరిపూర్ణతకు సంబంధించినది కాదని అన్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరి డ్యాన్స్ స్కిల్స్ ని ఆయన మెచ్చుకున్నారు.

ఆర్ఆర్ఆర్ లోని “నాటు నాటు” పాట మ్యూజిక్ మాత్రమే కాదు, ఎన్టీఆర్ రామ్ చరణ్ ల డ్యాన్స్ మూవ్స్ కి ప్రపంచమంతా ఫిదా అయ్యింది. అంతే కాకుండా ఈ పాట 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో నాటు నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఇదే పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ బరిలో నిలిచింది.

డ్యాన్స్‌ చేస్తున్న వారు డ్యాన్స్‌ని ఆస్వాదిస్తేనే ప్రేక్షకులు ఆ డ్యాన్స్‌ని ఎంజాయ్ చేయగలరని రాజమౌళి వివరించారు. “నాటు నాటు” లో చూపినట్లుగా, నృత్యంలో ప్రతి క్షణం భావోద్వేగాలను లేదా శక్తిని తెలియజేయడానికి ఒక అవకాశం అని కూడా ఆయన సూచించారు. 

‘నాటు నాటు’ 2023 ఆస్కార్స్‌లో ఒరిజినల్ సాంగ్ కేటగిరీకి నామినేట్ అయినందున భారతదేశానికి గర్వకారణంగా మారింది. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ అందించడంతో పాటు ఆస్కార్ వేదికపై లైవ్ ట్రాక్ ప్రత్యక్షంగా ప్రదర్శించబడుతుందని అకాడమీ ఇటీవల ప్రకటించింది. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, ప్రస్తుతం ప్రత్యక్ష ప్రదర్శన కోసం రిహార్సల్స్ చేస్తున్నారు, లాస్ ఏంజిల్స్ డ్యాన్సర్లు ఈ పాట రిథమ్‌పై డ్యాన్స్ చేస్తున్నారు. 

మన భారతీయ గాయకులు ‘ఆర్ఆర్ఆర్’ పాటను సరిగ్గా రెండున్నర నిమిషాల పాటు వేదికపై ప్రదర్శిస్తారు. 2023 ఆస్కార్ అవార్డుల ‘నాటు నాటు’ విభాగంలో కీరవాణి సంగీత దర్శకుడు రికీ మైనర్‌తో కలిసి పని చేయనున్నారు.

ఈ పాటలో వారు చేసిన డ్యాన్స్ గురించి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సందర్భంగా.. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ తమ తమ ఇంటర్వ్యూలలో నాటు నాటు గురించి మాట్లాడారు, ఈ పాట గురించి మాట్లాడుతుంటే మోకాళ్ళు వణుకుతున్నాయని అన్నారు.

నా మోకాళ్లు వణుకుతున్నాయి: రామ్ చరణ్

ఒక ఇంటర్వ్యూలో ఈ పాట షూటింగ్ సమయంలో ఎవరు ఎక్కువగా గాయపడ్డారు అని రామ్ చరణ్ ని అడిగారు. ఈ ప్రశ్నకు రామ్ చరణ్ సమాధానమిస్తూ.. దాని గురించి మాట్లాడటానికి నా మోకాళ్లు వణుకుతున్నాయి. ఈ పాట మాకు చాలా అందమైన టార్చర్. కానీ, ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ చెప్పే అవకాశం వచ్చిందంటే ఆ పాట వల్లే. ఈ రోజు మేము ఈ పాట కారణంగా ఇక్కడ గ్రే కార్పెట్‌పై నిలబడి మీతో మాట్లాడుతున్నాము అని ఆయన అన్నారు.

షూటింగ్‌లో 65 రాత్రులు

ఈ పాట గురించి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “ఈ పాటను సినిమా చివరి షెడ్యూల్‌లో చిత్రీకరించాము. దీనిని చిత్రీకరించడానికి 65 రాత్రులు పట్టింది. ఆ సమయంలో రామ్ చరణ్, నేను ఒకరినొకరు కొట్టుకున్నాము, తరువాత క్షమాపణలు చెప్పుకున్నాము. ఎస్ఎస్ రాజమౌళి నిజంగా మేము ఒకరినొకరు ద్వేషించుకోవాలని కోరుకున్నారని అనిపించింది. కానీ మేము 21, 22 రోజుల తర్వాత ఒకరికొకరు క్షమాపణలు చెప్పడం కూడా మానేసి పాట చిత్రీకరణను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ పాటకి మా ఇద్దరి మధ్యా ఉండే సమన్వయమే ఊపిరి అని తెలియజేశారు. 

అంత ప్రాణం పెట్టి చిత్రీకరించారు కాబట్టే ఈ పాటకి ఇన్ని విధాలుగా గౌరవం దక్కుతోందని చెప్పాలి. ఈ పాటకి ఆస్కార్ వస్తే ఆ కిక్కే వేరు.