ఆస్కార్ అవార్డుల్లో దుమ్ము దులిపేసిన రెండు సినిమాలు.. మరి కొన్ని ప్రత్యేకతలు

ఆస్కార్ 2023 వేడుకలు లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో ఘనంగా జరిగాయి.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు అక్కడికి చేరుకొని సందడి చేశారు. ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ అస్కార్ గెలుచుకోగా.. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ అత్యంత కీలకమైన ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్ నామినేషన్‌లో ఉన్న చిత్రాలతో పాటు ఫైనల్ విన్నర్స్ గురించి తెలుసుకుందాం. ఎక్కువ అవార్డులు ఎవ్రీథింగ్ ఎవరీ వేర్ ఆల్ […]

Share:

ఆస్కార్ 2023 వేడుకలు లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో ఘనంగా జరిగాయి.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు అక్కడికి చేరుకొని సందడి చేశారు. ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ అస్కార్ గెలుచుకోగా.. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ అత్యంత కీలకమైన ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్ నామినేషన్‌లో ఉన్న చిత్రాలతో పాటు ఫైనల్ విన్నర్స్ గురించి తెలుసుకుందాం.

ఎక్కువ అవార్డులు

ఎవ్రీథింగ్ ఎవరీ వేర్ ఆల్ యట్ వన్స్ అనే సినిమా ఈసారి ఆస్కార్డ్ అవార్డ్స్ లో దుమ్ము దులిపేసింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ నటి విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టింది. ఇక ఆల్ క్విట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ అనే సినిమాకు నాలుగు అవార్డులు వచ్చాయి. ఉత్తమ సంగీతం, బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, ప్రొడక్షన్ డిజైనర్ కేటగిరిలో అవార్డులను అందుకుంది.  

ఫస్ట్ ఏసియన్ ఉమెన్

ఆస్కార్ అవార్డు అందుకున్న మొట్టమొదటి ఏషియన్ మహిళగా మిచెల్లె యో నిలిచింది. ఎవ్రీథింగ్ ఎవరీ వేర్ ఆల్ ఎర్త్ వన్స్ అనే సినిమాకు గాను ఉత్తమ నటిగా ఈమె అవార్డును అందుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. 

ఉత్తమ నటుడు

ది వేల్ సినిమాకు ఉత్తమ నటుడిగా బ్రెండన్ ఫ్రౌజర్ ను ఆస్కార్  వరించింది. బెస్ట్ సౌండ్ కేటగిరీలో టాప్ మావేరిక్ సినిమాకు అవార్డు వచ్చింది. డేనియల్ బ్రదర్ ఎవ్రీథింగ్ ఎవరీ వేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు వచ్చింది. 

అవతార్ 2

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ కేటగిరీలో అవతార్ ది వే ఆఫ్ వాటర్ కి ఆస్కార్ అవార్డు లభించింది. 12 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ సినిమాకి.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 

బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్

ది బాయ్ ది మోల్ ది ఫాక్స్ అండ్ ది హార్స్ అనే చిత్రానికి ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ అవార్డు దక్కింది. 

రెండుసార్లు ఆస్కార్ గెలుచుకున్న మహిళ

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ కేటగిలో రుత్ ఈ కార్టర్ రెండోసారి ఆస్కార్ అవార్డును గెలిచి చరిత్ర సృష్టించింది. ఇలా రెండుసార్లు ఓ బ్లాక్ మహిళా ఆస్కార్ అవార్డులు గెలవడం హిస్టరీలోనే మొదటిసారి. బ్లాక్ పాంధర్ సినిమాకు గాను ఈ అవార్డు లభించింది. 

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్

ఆస్కార్ వేడుకల్లో మొదటిసారి భారత్ కు తొలి నిరాశ ఎదురయింది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారతదేశానికి చెందిన ఆల్ దట్ బ్రీత్స్ వెనుకబడింది. ఈ విభాగంలో  నవల్ ను ఆస్కార్డ్ అవార్డును అందుకుంది.

బెస్ట్ షార్ట్ ఫిల్మ్

బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో యాన్ ఐరిష్ గుడ్ బై బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ కేటగిరీలో ఐదు సినిమాలు పోటీపడినా.. అన్నింటినీ వెనక్కి నెట్టేసి ఈ చిత్రం అవార్డును గెలుచుకుంది.

బెస్ట్ సినిమాటోగ్రఫీ

ఆల్ క్విట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, భార్డో ఫాల్స్ క్రానికల్ ఆఫ్ ఏ హ్యాండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్, ఈవిల్స్, ఎంపైర్ ఆఫ్ లైట్, తార్ సినిమాలు పోటీ పడగా ఆల్ క్విట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ సినిమాకు బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు దక్కింది.

బెస్ట్ కొరియోగ్రాఫర్

ఆల్ క్విట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జేమ్స్ బాండ్ అవార్డును అందుకున్నారు.

జర్మనీ సినిమా

ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా జర్మనీ దేశానికి చెందిన ఆల్ క్విట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ సినిమాకు  బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం క్యాటగిరీలో అవార్డును అందుకుంది.