ఓపెన్‌హైమ‌ర్ సినిమాపై మండిపడుతున్న ఇండియ‌న్స్

బ్రిటిష్ అమెరిక‌న్ ఫిలిం మేక‌ర్ క్రిస్టొఫ‌ర్ నోలాన్ తెరకెక్కించిన సినిమా ఓపెన్‌హైమ‌ర్. అటామిక్ బాంబ్‌ను క‌నిపెట్టిన అమెరిక‌న్ థియోరెటిక‌ల్ ఫిజిసిస్ట్, సైంటిస్ట్ రాబ‌ర్ట్ ఓపెన్‌హైమ‌ర్ జీవిత ఆధారంగా ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. ఇందులో ఓపెన్‌హైమ‌ర్ క్యారెక్ట‌ర్‌లో సిలియ‌న్ మ‌ర్ఫీ న‌టించారు.  ఈ సినిమాకు.. మ‌న భ‌గ‌వద్గీత‌కు ఒక సంబంధం ఉంది తెలుసా? అదేంటంటే, రెండవ ప్ర‌పంచ యుద్ధం స‌మ‌యంలో ఓపెన్‌హైమ‌ర్ అమెరికాలోని లోస్ ఆల‌మోస్ ల్యాబొరేట‌రీలో ప‌నిచేస్తుండేవారు. 1942లో మ్యాన్‌హాట్ట‌న్ ప్రాజెక్ట్ ఓ న్యూక్లియ‌ర్ బాంబ్‌ను […]

Share:

బ్రిటిష్ అమెరిక‌న్ ఫిలిం మేక‌ర్ క్రిస్టొఫ‌ర్ నోలాన్ తెరకెక్కించిన సినిమా ఓపెన్‌హైమ‌ర్. అటామిక్ బాంబ్‌ను క‌నిపెట్టిన అమెరిక‌న్ థియోరెటిక‌ల్ ఫిజిసిస్ట్, సైంటిస్ట్ రాబ‌ర్ట్ ఓపెన్‌హైమ‌ర్ జీవిత ఆధారంగా ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. ఇందులో ఓపెన్‌హైమ‌ర్ క్యారెక్ట‌ర్‌లో సిలియ‌న్ మ‌ర్ఫీ న‌టించారు. 

ఈ సినిమాకు.. మ‌న భ‌గ‌వద్గీత‌కు ఒక సంబంధం ఉంది తెలుసా? అదేంటంటే, రెండవ ప్ర‌పంచ యుద్ధం స‌మ‌యంలో ఓపెన్‌హైమ‌ర్ అమెరికాలోని లోస్ ఆల‌మోస్ ల్యాబొరేట‌రీలో ప‌నిచేస్తుండేవారు. 1942లో మ్యాన్‌హాట్ట‌న్ ప్రాజెక్ట్ ఓ న్యూక్లియ‌ర్ బాంబ్‌ను క‌నిపెట్టేందుకు య‌త్నిస్తోంది. ఆ ప్రాజెక్ట్ కోసం ఓపెన్‌హైమ‌ర్ ప‌నిచేసారు. ఎన్నో ఎక్స్‌ప‌రిమెంట్లు చేసాక 1945లో మొద‌టి ఆటామిక్ బాంబ్‌ని త‌యారుచేసారు. దీనిని టెస్ట్ చేయ‌డానికి ట్రినిటీ అనే పేరుతో టెస్టింగ్ చేసారు. న్యూ మెక్సికో ఎడారిలో ఈ ట్రినిటీ టెస్ట్‌ను చేప‌ట్టారు. ఈ టెస్ట్ పూర్త‌య్యాక‌.. ఓపెన్‌హైమ‌ర్‌కు భ‌గ‌వద్గీత‌లోని ఓ శ్లోకం గుర్తొచ్చింద‌ట‌. ఓపెన్‌హైమ‌ర్‌కు ఎక్కువ‌గా ఆధ్యాత్మిక పుస్త‌కాలు చ‌దివే అలవాటు ఉండేది. ఆయ‌న చ‌దివిన వాటిలో మ‌న భ‌గ‌వ‌ద్గీత ఒక‌టి. ట్రినిటీ టెస్ట్‌లో న్యూక్లియ‌ర్ బాంబును స‌క్సెస్‌ఫుల్‌గా టెస్ట్ చేసాక ఓపెన్‌హైమ‌ర్‌కు ఇప్పుడు నేను ప్ర‌పంచాల‌ను నాశ‌నం చేసే చావుని అయ్యాను అని భ‌గవ‌ద్గీత‌లో రాసిన శ్లోకం గుర్తుకొచ్చింద‌ట‌. 

ఇక్కడే వచ్చింది చిక్కు: 

భారత దేశ పవిత్రమైన భగవద్గీతకు సంబంధించి సినిమాలో సంభాషించడం గురించి మనం ఇప్పుడు వరకు మాట్లాడుకున్నాం. కానీ ఓపెన్‌హైమ‌ర్ సినిమాలో భగవద్గీత చదివిన సందర్భం మాత్రం ఇప్పుడు భారతదేశ సినీ వర్గాలలో చర్చగా మారింది. అయితే ఈ ఓపెన్‌హైమ‌ర్ సినిమాలో, ఒక అమ్మాయి అలాగే అబ్బాయి శరరీకంగా సన్నిహితంగా ఉన్న సందర్భంలో, భగవద్గీత చదివిన సందర్భాన్ని సినిమా సీన్లో చూపించడం జరిగింది. ఎంతో పవిత్రంగా భారతీయులు చూసుకునే భగవద్గీతను ఇటువంటి సీన్లలో చదువుతున్న సందర్భాన్ని ఎలా చూపిస్తారు అంటూ, మండిపడుతున్నాయి భారతీయ సినీ వర్గాలు. 

అసలు ఇటువంటి సీన్లను సినిమాలో ప్రదర్శించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అసలు ఆమోదం ఎలా ఇచ్చింది అనే విషయంపై ఒకరు అయోమయంలో పడ్డారని మహూర్కర్ అన్నారు. అంతేకాకుండా’సేవ్ కల్చర్ సేవ్ ఇండియా ఫౌండేషన్’ అనే నినాదంతో ఒక పోస్ట్ పంచుకుంటూ భారత ప్రభుత్వంతో సమాచార కమిషనర్ ఉదయ్ మహూర్కర్ సినిమాని ఖండించారు. 

మనం చాలా మంచి విలువల ఉన్న ప్రపంచంలో జీవిస్తున్న. కాబట్టి దీనిని I & B మంత్రిత్వ శాఖ సినిమాలో చూపించిన సీన్స్ గురించి ఇన్వెస్టిగేషన్ జరగాలని, ప్రమేయం ఉన్నవారిని కఠినంగా శిక్షించాలని మహూర్కర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. 

4.5 రేటింగ్ ఇచ్చిన క్రిటిక్:

క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో R-రేటింగ్ దక్కించుకున్న మొదటి సినిమా ఓపెన్‌హైమర్. అయితే సెక్స్ సీన్స్ను ప్రస్తుతం సినిమాలో తగ్గించడానికి స్టూడియో కొన్ని షాట్‌లను తీసేసిన తర్వాత భారతదేశ సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A రేటింగ్ ఇచ్చింది. అంతేకాకుండా క్రిటిక్ సైబాల్ చటర్జీ, ఈ సినిమాకి సుమారు 4.5 రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ చర్చనీయాంశమైన సీన్ల గురించి పక్కన పెడితే, సినిమా పరంగా అంత బాగుంది అంటున్నారు సినిమా అభిమానులు. 

ఓపెన్‌హైమర్ సినిమా ఇప్పటికే విజయం సాధించిందని, సినిమాటోగ్రఫీ, సాంకేతిక నైపుణ్యం, ఎమోషనల్ సీన్స్, మానవ ప్రయత్నం, మనిషి ఒక ఆశయంతో ఉంటే ఏదైనా సాధించగలడు అని ఈ సినిమా నీరూపించిందని, విలేకరులతో మాట్లాడిన క్రిటిక్ సైబాల్ చటర్జీ చెప్పుకొచ్చారు.