50 కోట్లకు ‘ఆపరేషన్ వాలెంటైన్’ డిజిటల్ రైట్స్…

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో  తెలుగుతో పాటు హిందీలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. భారతీయ వాయుసేనలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  భారత వైమానిక దళానికి సంబంధించిన ధైర్య సాహసాలని ఈ చిత్రంలో కళ్లకుకట్టినట్లు చూపించబోతున్నారు. ఈ యాక్షన్ మూవీలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్‌గా కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు మొదలైనట్లు మేకర్స్  వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ […]

Share:

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో  తెలుగుతో పాటు హిందీలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. భారతీయ వాయుసేనలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  భారత వైమానిక దళానికి సంబంధించిన ధైర్య సాహసాలని ఈ చిత్రంలో కళ్లకుకట్టినట్లు చూపించబోతున్నారు. ఈ యాక్షన్ మూవీలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్‌గా కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు మొదలైనట్లు మేకర్స్  వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

‘ఆపరేషన్ వాలెంటైన్’  చిత్రంతో వరుణ్ తేజ్ హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె  రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

వరుణ్ తేజ్ కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’పై యావత్ భారత సినీ ప్రియుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందినందున, ఇది అద్భుతమైన కథాంశంతో కూడిన పెద్ద సినిమా కావడంతో జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో సినిమాని ప్రదర్శించే హక్కులు దాదాపు 45-50 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం. వరుణ్‌ తేజ్‌కి ఇది ఒక రికార్డ్ ఎందుకంటే అతని మరే సినిమా ఇంతకు అమ్ముడుపోలేదు. ఈ చిత్రాన్ని రూపొందించే స్టూడియో నిజంగా దీనికి మద్దతునిస్తోంది, ప్రత్యేకించి వారు ‘మేజర్’ అనే మరో చిత్రంతో విజయం సాధించారు. అందుకే అందరూ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం,  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా వేగంగా కొనసాగుతోంది.  ప్రేక్షకులకు ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన అత్యుత్తమ ఎక్స్‌ పీరియన్స్ అందించేలా గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. భారత్ ఎన్న‌డూ చూడని ప్రత్యర్థుల  భయంకరమైన వైమానిక దాడుల స‌మ‌యంలో, ఎదురు నిలిచి పోరాడిన యుద్ధ వీరుల ధైర్యాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను వెండితెరపై ఆవిష్కృతం చేయబోతున్నారు మేకర్స్.   

ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 8  ‘ఎయిర్ ఫోర్స్ డే’ నాడు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. తమ చిత్రం ఆరోజు విడుదలైతేనే వైమానిక వీరులను తలుచుకున్నట్లుగా ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నారట. భారతీయులు తమ కోసం నిరంతరం కష్టపడుతున్న సైన్యం గొప్పదనం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారట.
ఓవైపు కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్న వ‌రుణ్ తేజ్ త్వ‌ర‌లోనే త‌న ప్రియురాలు లావ‌ణ్య త్రిపాఠిని పెళ్లాడబోతున్నాడు. వరుణ్ తేజ్, లావణ్యల నిశ్చితార్థం జూన్ 9న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థానికి మెగాస్టార్, అల్లు కుంటుంబంతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఎప్పుడు అనేది మాత్రం బయటకు తెలియడం లేదు. డెస్టినేషన్ వెడ్డింగ్ ఇటలీలో జరుపుకోనున్నట్టుగా సమాచారం. ఇక వరుణ్ తేజ్, లావణ్య కలిసి ‘మిస్టర్’ సినిమాలో నటించారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తర్వాత ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి వరకూ వచ్చింది. ఇక లావణ్య త్రిపాఠి నటనకు గుడ్ బై చెప్పారనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ జంట హైదరాబాద్​లోని ప్రముఖ డిజైనర్​ మనీశ్​ మల్హోత్ర షో రూమ్​లో కనిపించి సందడి చేశారు.