టాలీవుడ్ ఎంట్రీకి  సిద్ధమైపోయిన నుపూర్ సనన్..

సినీ ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుండి ఎంతో మంది నటులు పరిచయమవుతూనే ఉన్నారు. ప్రస్తుతం స్టార్ హోదాలు అందుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఒకే కుటుంబానికి చెందిన పలువురు అక్కా చెల్లెలు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హోదాలో ఉన్నారు. తాజాగా కృతి సనన్ చెల్లెలు.. నుపూర్ సనన్.. రవితేజ హీరోగా నటిస్తోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీతో సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగుపెడుతోంది. కృతి సనన్.. బాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఆమె కంటూ ప్రత్యేక […]

Share:

సినీ ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుండి ఎంతో మంది నటులు పరిచయమవుతూనే ఉన్నారు. ప్రస్తుతం స్టార్ హోదాలు అందుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఒకే కుటుంబానికి చెందిన పలువురు అక్కా చెల్లెలు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హోదాలో ఉన్నారు. తాజాగా కృతి సనన్ చెల్లెలు.. నుపూర్ సనన్.. రవితేజ హీరోగా నటిస్తోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీతో సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగుపెడుతోంది. కృతి సనన్.. బాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా కృతి సనన్.. ఆదిపురుష్ మూవీలో జానకిగా కనిపించి కనువిందు చేసింది. ఆమె చెల్లెలుగా ఇపుడు సినీ ఇండస్ట్రీలో లక్ పరీక్షించుకోబోతుంది. ఈమె విషయానికొస్తే.. 

నుపుర్ సనన్.. నటి కాకముందు గాయనిగా శిక్షణ తీసుకుంది. ఆపై నటనపై మక్కువగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈమె ఢిల్లీ యూనివర్సిటీలోని నార్త్ క్యాంపస్‌లోని కిరోరి మాల్ కాలేజ్ నుండి కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత అక్క కృతి సనన్ స్పూర్తితో సినిమాల్లో ప్రవేశించింది. నుపూర్ సనన్ ముందుగా 2019లో అక్షయ్ కుమార్ నటించిన ఫిల్హాల్ అనే ప్రైవేట్ ఆల్బబ్ సాంగ్‌లో ఆయన సరసన నటించింది. ఆ తర్వాత ప్రముఖ టీవీ కామెడీ డ్రామా ‘పాప్ కౌన్’ అనే టీవీ సిరీస్‌లో నటించింది. 2022లో ఇది టెలికాస్ట్ అయింది. ఇందులో కునాల్ ఖేము, సౌరబ్ శుక్లా, జానీ లీవర్, అశ్వినీ కల్సేకర్, చుంకీ పాండే, సతీష్ కౌశిక్, రాజ్‌పల్ యాదవ్ వంటి ఉద్దండ బాలీవుడ్ నటీనటులు నటించారు.

ప్రస్తుతం ఈమె హిందీలో నవాజుద్ధీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘నూరానీ చెహ్రా’ సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు రవితేజ హీరోగా నటిస్తోన్న ‘టైగర్ నాగేశ్వరరావులో ప్రధాన కథానాయికగా చేస్తోంది. ఈ సినిమాలపై నూపుర్ చాలా ఆశలే పెట్టుకుంది. కృతి సనన్ చెల్లెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నూపుర్ సనన్.. 15 డిసెంబర్ 1993లో రాహుల్ సనన్, గీతా సనన్‌లకు న్యూఢిల్లీలో జన్మించింది. ఇంట్లో అందరు ముద్దుగా ‘నూప్స్’ అని పిలుస్తారట.  నూపుర్ సనన్.. 165 సెంటిమీటర్ల పొడువు ఉంది. 5 అడుగుల 5 అంగులాలు. ఈమె బాలీవుడ్‌లో షారుఖ్, హృతిక్, వరుణ్ ధావణ్, అంటే ఇష్టమట. హాలీవుడ్‌లో లియోనార్డో డికాప్రియో అంటే చచ్చేంత ఇష్టమట. నటీమణుల విషయానికొస్తే.. అక్క కృతి సనన్‌తో పాటు దీపికా పదుకొణే, జాక్వెలిన్, ప్రియాంక చోప్రా అంటే ఇష్టమట. సినిమాల్లో ఐశ్వర్యా రాయ్ ‘తాల్’, దిల్ చాహతా హై, 3 ఇడియట్స్ మూవీస్ అంటే ఇష్టం.

స్వతహాగా సింగర్ అయిన నూపుర్ సనన్‌కు గాయకుల్లో మహమ్మద్ రఫీ, సునీధి చౌహాన్, శ్రేయా ఘోషల్, సోను నిగమ్, ఏ.ఆర్,రెహ్మాన్, మోహిత్ చౌహాన్ అంటే ఇష్టమని, తనకు జరిగిన అనుభవాన్ని పంచుకుంది….నేను పాడిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాదాన్ని, ఒక ప్రొడక్షన్ హౌస్ నన్ను పిలిచి ఆడిషన్‌కు రమ్మని అడిగారు. ఇది నా పాటల కోసం అని నేను అనుకోని అంగీకరించాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది అది ఒక కాస్టింగ్ కాల్ గుర్తించి షాక్ అయ్యానని, వెల్లడించింది. నేను నటనలో రాణించదని చెప్పినప్పటికీ, ప్రొడక్షన్ హౌస్ ఆడిషన్ ఇవ్వమని ప్రోత్సహించిందని పేర్కొంది.  

కొన్ని రోజుల తర్వాత, వారు నన్ను బోర్డులోకి తీసుకురావాలనుకుంటున్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయానని తెలిపింది. చిత్ర నిర్మాతలతో నెల రోజుల పాటు నటన వర్క్‌షాప్ కూడా చేశాను. “ఆ చిత్రం ఆగిపోయినప్పటికీ, నేను నటన గురించి చాలా నేర్చుకున్నాను.  నేను నా సోదరి అడుగుజాడలను అనుసరిస్తానని ఎప్పుడూ అనుకోలేదు,” ఆమె చెప్పింది. తాను నటించాలనుకుంటున్నానని కృతికి మొదట చెప్పినప్పుడు, ఆమె తక్షణ స్పందన, ‘ఖచ్చితంగానా?’ అని అడిగిందని, అక్క తనకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటుందని, ఏ విషయమైనా పంచుకొనే స్వేఛ్చ తమ మధ్య ఉందని నూపుర్ పేర్కొంది. సినిమాల్లోకి రావడం నా స్వంత నిర్ణయం అని, అక్క అడుగుజాడలను అనుసరిస్తానని  నుపూర్ తెలిపారు.

 ‘టైగర్‌ నాగేశ్వరరావు’ విడుదలలో ఎలాంటి మార్పు లేదని, ముందుగా ప్రకటించినట్లు దసరాకి అక్టోబర్‌ 20నే విడుదల చేస్తామనీ చిత్రబృందం ఓ ప్రకటన రిలీజ్‌ చేసింది. ‘‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రం అక్టోబర్‌ 20న విడుదల కావడం లేదంటూ కొన్ని శక్తులు వదంతులు వ్యాప్తి చేస్తున్నాయి.  ఆ వదంతులను నమ్మవద్దు. మీకు (ప్రేక్షకులు) అత్యుత్తమ సినిమా అనుభూతిని అందించడానికి మేము కృషి చేస్తున్నాం. అక్టోబరు 20 నుంచి బాక్సాఫీస్‌ వద్ద టైగర్‌ వేట ప్రారంభమవుతుంది’’ అని మేకర్స్‌ తెలియజేశారు.