న్యూడ్ సీన్స్ కి నో : మీనాక్షి చౌద‌రి

ఫెమీనా మిస్ ఇండియా హ‌ర్యానా 2018గా ఎంపికైన హ‌ర్యానా బ్యూటీ మీనాక్షి చౌద‌రి తెలుగులో `ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు` సినిమాతో అరంగేట్రం చేసింది. సుశాంత్ హీరోగా న‌టించిన ఈ సినిమా ఫ‌ర‌వాలేదు అనిపించినా మీనాక్షికి మాత్రం తెలుగులో మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది. త‌క్కువ టైంలోనే టాలీవుడ్‌లో పెద్ద ఆఫ‌ర్లు అందుకుంటోంది మీనాక్షి చౌద‌రి ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు` సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ త‌రువాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో `ఖిలాడీ`, అడివి శేష్‌తో `హిట్ 2` […]

Share:

ఫెమీనా మిస్ ఇండియా హ‌ర్యానా 2018గా ఎంపికైన హ‌ర్యానా బ్యూటీ మీనాక్షి చౌద‌రి తెలుగులో `ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు` సినిమాతో అరంగేట్రం చేసింది. సుశాంత్ హీరోగా న‌టించిన ఈ సినిమా ఫ‌ర‌వాలేదు అనిపించినా మీనాక్షికి మాత్రం తెలుగులో మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది.

త‌క్కువ టైంలోనే టాలీవుడ్‌లో పెద్ద ఆఫ‌ర్లు అందుకుంటోంది మీనాక్షి చౌద‌రి ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు` సినిమాతో అరంగేట్రం చేసింది.

ఆ త‌రువాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో `ఖిలాడీ`, అడివి శేష్‌తో `హిట్ 2` వంటి సినిమాల‌లో న‌టించి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షించింది. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న క్రేజీ మూవీ `గుంటూరు కారం`తో పాటు మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్‌తో మ‌రో సినిమా చేస్తోంది.

ఖిలాడి సినిమాతో కాస్త పాపుల‌ర్ అయింది. ఆ త‌ర్వాత హిట్-2తో మంచి పేరు కొట్టేసింది. ఇప్పుడు ఏకంగా గుంటూరు కారం (guntur kaaram) సినిమాలో మ‌హేష్ బాబుతో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసింది. అయితే ఎలాంటి క్యారెక్ట‌ర్స్ ఇచ్చినా చేస్తాను కానీ.. న్యూడ్ సీన్స్ ఉంటే మాత్రం అస్స‌లు ఒప్పుకోను అంటోంది మీనాక్షి చౌద‌రి.

గుంటూరు కారం` ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్డే త‌ప్పుకోవ‌డంతో ఈ బ్యూటీకి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది..  రీసెంట్‌గా మ‌హేష్‌తో క‌లిసి సెట్ లో సంద‌డి చేసిన ఈ హ‌ర్యానా బ్యూటీ ఓ విష‌యం కార‌ణంగా తాను ఎన్నో సినిమాలు వ‌దులుకున్నాన‌ని తెలిపి షాకిచ్చింది. కెరీర్ తొలి నాళ్ల‌లో మంచి అవ‌కాశాల్ని ద‌క్కించుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని తెలిపింది.

గుంటూరు కారంలో మహేష్ బాబుతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని మీనాక్షి తెలిపారు . లో గొప్ప నటులు మరియు సంకేతక నిపుణులు ఉన్నారు అని వాళ తో పని చేయడం ఆనందంగా ఉంది అని ఆమె అన్నారు అంతే కాకుండా మహేష్ బాబు తో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయ్యింది అని తన సంతోషాన్ని పంచుకున్నారు మీనాక్షి.

 ప్ర‌స్తుతం స్క్రిప్ట్‌లు వింటున్నాన‌ని, క‌థ‌ల ఎంపిక విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాన‌ని పేర్కొంది..వరుణ్ తేజ్ తో సైన్ చేసిన మూవీ వచ్చే సంవత్సరం మొదలకబోతుంది మరియు విశ్వక్ సేన్ మూవీ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. 

న్యూడ్ సీన్స్ అవ‌స‌రమేముంది?

తెలుగు ప్రేక్ష‌కులు న‌న్ను ఎంత‌గానో ఆద‌రిస్తున్నారు…నేను చేయ‌బోయే సినిమా ఏ భాష‌లో అయినా ఫ‌ర్వాలేదు కానీ.. నా ప‌నిత‌నాన్ని అంద‌రూ మెచ్చుకోవాలి అనుకుంటాను. టాలీవుడ్ ఇండ‌స్ట్రీ నాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చింది. ఇక్క‌డే చాలా సినిమాలు చేయాల‌ని ఉంది. అయితే నేను ఇండ‌స్ట్రీలోకి రాక‌ముందే ఒక రూల్ పెట్టుకున్నాను. న్యూడ్ సీన్లు ఉంటే అస్స‌లు చేయకూడ‌దు అని. ఈ ఒక్క పాయింట్ వల్లే చాలా సీన్లు రిజెక్ట్ చేసాను. ఇక కిస్సింగ్ సీన్స్ అంటే స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఓకే కానీ ఆడియ‌న్స్ వ‌స్తారు క‌దా అని ఇలాంటి సీన్స్ పెడితే మాత్రం నేను అస్స‌లు ఒప్పుకోను. చక్క‌గా యాక్ట్ చేస్తే స‌రిపోతుంది కదా.. దానికి న్యూడ్ సీన్లు పెట్టాల్సిన అవ‌స‌రం ఏముంది  అని అంటున్నారు మీనాక్షి.

 బిజీగా ఉండ‌టం కోసం కాకుండా ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోయే పాత్ర‌లే చెయ్యాలి అని అనుకుంటున్నా అని చెప్పారు మీనాక్షి.. అంతే కాకుండా కొత్త త‌ర‌హా పాత్ర‌ల్లో న‌టించ‌డానికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వెన‌క‌డుగు వేయ‌ను. అవ‌కాశం ఉన్న‌ప్పుడే విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించాల‌న్న‌ది నా అభిప్రాయం అని చెప్పారు.