నాకెవ్వ‌రూ ప్ర‌పోజ్ చేయ‌లేదు:  శ్రీలీల‌

శ్రీలీల పేరు చెప్పగానే ఇప్పుడు కుర్రకారు మనసులో రైళ్లు పరిగెడుతున్నాయి. టాలీవుడ్ లో అడుగు పెట్టిన వేళ విశేషం శ్రీలీల‌కు వరసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయని చెప్పుకోవాలి. నితిన్, పోతినేని రామ్ నుంచి నందమూరి బాలకృష్ణ సినిమాల వరకు, ప్రతి సినిమాలోని శ్రీలీల తనదైన శైలిలో హీరోయిన్గా నటిస్తోంది. ఆమె ప్రస్తుతం గడియారంతో పోటీపడుతూ షూటింగ్స్ లో బిజీగా ఉంది అని చెప్పుకోవాలి. ఎవరూ ప్రపోజ్ చేయలేదు:  స్కంద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో […]

Share:

శ్రీలీల పేరు చెప్పగానే ఇప్పుడు కుర్రకారు మనసులో రైళ్లు పరిగెడుతున్నాయి. టాలీవుడ్ లో అడుగు పెట్టిన వేళ విశేషం శ్రీలీల‌కు వరసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయని చెప్పుకోవాలి. నితిన్, పోతినేని రామ్ నుంచి నందమూరి బాలకృష్ణ సినిమాల వరకు, ప్రతి సినిమాలోని శ్రీలీల తనదైన శైలిలో హీరోయిన్గా నటిస్తోంది. ఆమె ప్రస్తుతం గడియారంతో పోటీపడుతూ షూటింగ్స్ లో బిజీగా ఉంది అని చెప్పుకోవాలి.

ఎవరూ ప్రపోజ్ చేయలేదు: 

స్కంద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న శ్రీలీల ఎప్పటిలాగే చలాకీగా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. స్కంద సినిమాలో రామ్ పోతినేని పక్కన హీరోయిన్గా నటించిన శ్రీలీల, ఈ సినిమాలో తన ప్రత్యేకమైన క్యారెక్టర్ గురించి చాలా బాగా మాట్లాడింది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ లో చాలా రకాల షేడ్స్ కనిపిస్తాయని, ఇప్పటివరకు తనకి ఎవరు ప్రపోజ్ చేయనప్పటికీ, ఈ సినిమా చూసిన తర్వాత ప్రపోజల్స్ వస్తాయేమో అంటూ తనదైన శైలిలో చిలిపిగా మాట్లాడింది శ్రీలీల. అంతేకాకుండా సినిమాలో హీరోగా నటించిన రామ్ పోతినేని పక్కన హీరోయిన్గా చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పింది. ముఖ్యంగా తనతో డాన్స్ చేయడం తనకి చాలా ఎంకరేజ్మెంట్గా అనిపించిందని, మరింత ఉత్సాహంగా డాన్స్ చేయడానికి తను పక్కన ఉన్న రామ్ పోతినేని కారణమని చెప్పుకొచ్చింది శ్రీలీల.

భారీ అంచనాల సినిమా: 

ఆమె పవన్ కళ్యాణ్‌తో మరో మెగా బక్స్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా చేస్తోంది. వచ్చిన కొద్ది కాలంలోనే తన నటనతో, అందంతో, అభినయంతో పెద్ద పెద్ద హీరోల పక్కన నటించే అవకాశాన్ని కొట్టేసింది శ్రీలీల. కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే భారీ అంచనాల మధ్యలో వస్తున్న పవన్ కళ్యాణ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఛాన్స్ కొట్టేసింది హీరోయిన్ శ్రీలీల.

తెలుగు మాట్లాడే అమ్మాయి కావడం కూడా ఆమె కెరీర్‌కు కొంత ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు రష్మిక, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ మరియు ఇతరుల కంటే ఎక్కువ సినిమాలు, యంగ్ స్టార్ శ్రీలీల చేతిలో ఉన్నాయి. 

అవకాశాన్ని అందుపుచ్చుకున్న  శ్రీలీల: 

అనుకోకుండా వక్కంతం వంశీతో నితిన్ కొత్త సినిమాలో రష్మిక మందన్న ప్రాజెక్ట్ నుండి తప్పుకోవటంతో, మొదలైన వివిధ కారణాల వల్ల చర్చనీయాంశమైంది ఈ సినిమా. అయితే ప్రస్తుతం ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఈ అమ్మడుకు టాలీవుడ్ లో ఇప్పుడు క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు వచ్చాయి. ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ చాలా హైప్ తో రివీల్ చేశారు టీమ్. 

మహేష్ బాబు తాజా సినిమా గుంటూరు కారంలో కూడా పూజా హెగ్డే తప్పుగున్నాక శ్రీలీలా ఎంటర్ అయ్యింది. అది త్రివిక్రమ్ – మహేష్ కాంబో లో వచ్చే మరో హైప్ ఉన్న సినిమా. ఈమధ్య బేబీ సినిమా ని మెచ్చుకున్నా అల్లు అర్జున్ “శ్రీలీలా లాంటి తెలుగు హీరోయిన్లు మన ఇండస్ట్రీ లో అవసరం” అని కూడా ఈ అమ్మాయిని మెచ్చుకున్నాడు. మరోపక్క నితిన్‌కి 32వ సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’, ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ చిత్రాన్ని ప్రకటించారు, నితిన్ – వక్కంతం – రష్మీ ఎక్స్ట్రా ఆర్డినరీ కాంబో అని ప్రకటించినా.. అకస్మాత్తుగా, రష్మిక ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఏది ఏమైనా నితిన్ కి వక్ఖత్తం వంశి కి అలాగే శ్రీలీలా కి మంచి విజయం సాధించి పెట్టాలని ఆశిద్దాం, మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేద్దాం.