త‌మిళ సినిమాల్లో తెలుగు న‌టుల‌పై నో బ్యాన్: ఫెఫ్సీ

తెలుగు సినీ నటులను నిషేధించాం అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు : స్వామి నాథన్  గత కొంతకాలం నుండి మీడియా లో తెలుగు నటులు తమిళం లో నటించడానికి వీలు లేదు అని  ‘ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా ‘ ఆదేశాలు ఇచ్చింది అంటూ ఒక ప్రచారం సాగిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై ఆ సంస్థ జనరల్ సెక్రటరీ  స్వామి నాథన్  స్పందిస్తూ ‘మీడియా లో వచ్చిన ఈ వార్తలు […]

Share:

తెలుగు సినీ నటులను నిషేధించాం అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు : స్వామి నాథన్ 

గత కొంతకాలం నుండి మీడియా లో తెలుగు నటులు తమిళం లో నటించడానికి వీలు లేదు అని  ‘ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా ‘ ఆదేశాలు ఇచ్చింది అంటూ ఒక ప్రచారం సాగిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై ఆ సంస్థ జనరల్ సెక్రటరీ  స్వామి నాథన్  స్పందిస్తూ ‘మీడియా లో వచ్చిన ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం, మాకు ఎవరి మీద బ్యాన్ విధించే హక్కు లేదు’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘తమిళ సినిమాల్లో పని చేస్తున్నప్పుడు కార్మికులకు వేతనాలు పంచుకోవడం పై మాకు ముంబై లో ఉన్నటువంటి లైట్ ఎన్ లైట్ కంపెనీ తో కొన్ని సమస్యలు ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.

లైట్ ఎన్ లైట్ కంపెనీ మీద మాత్రమే మా నిషేధం : స్వామి నాథన్  

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఆ సంస్థ కి హైదరాబాద్ లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. తమిళం లో నిర్మితమైన సినిమాలన్నిటికీ సంబంధించి పరికరాలను వాళ్ళ కంపెనీ నుండే మేము తీసుకుంటున్నాము. అందుకే కార్మికులను 40 – 50 శాతం రేషియో లో పంచుకోవాలని కోరాము. అందుకు వాళ్ళు ఒప్పుకోలేదు. అంతే కాకుండా పరికరాలను సురక్షితంగా ఉంచుకునేందుకు వారికి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్స్ ని ఒక సంవత్సరం వరకు సమయం ఇచ్చాము. ఇప్పుడు ఆ సమయం ముగిసింది,2000 మంది బీసీ లైట్ మేన్స్ జీవనోపాధి పరిరక్షణ ని దృషిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాము. అంతే కానీ మేము ఏ నటీనటుల మీద బ్యాన్ విధించలేదు. మీడియా దీనిని వక్రీకరించి ప్రచారం చేసినందుకు చింతిస్తున్నాను’ అంటూ స్వామినాథన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమతో మాకు ఎన్నో ఏళ్ళ నుండి మంచి అనుభందం ఉందని, వాళ్ళ సినిమాలను మేము, మా సినిమాలను వాళ్ళు ఎంతగానో ఆదరించుకుంటామని, తెలుగునాట తమిళ డబ్బింగ్ సినిమాలను అక్కడి ప్రేక్షకులు ఆదరించిన తీరుని ఎన్నటికీ మర్చిపోమని చెప్పుకొచ్చారు. కేవలం నటీనటులు మాత్రమే కాదు , మా ఇండస్ట్రీ కి సంబంధించిన డ్యాన్సర్స్, ఫైటర్స్ అందరూ కూడా తెలుగు లో పని చేస్తున్నారని, 50 శాతం బేసిస్ మీదనే వాళ్ళు నడుచుకుంటున్నారని ఈ సందర్భంగా స్వామి నాథన్ చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే ఈ ఏడాది కూడా మన తెలుగు సినిమాలో తమిళ డబ్బింగ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సంక్రాంతి పండుగ రోజు చిరంజీవి , బాలయ్య లాంటి క్రేజీ స్టార్స్ సినిమాలు విడుదలైనప్పటికీ , తమిళ స్టార్ హీరో విజయ్ సినిమా వారసుడికి థియేటర్స్ ఇచ్చారు. ఆ చిత్రం ఇక్కడ పెద్ద సూపర్ హిట్ అయ్యింది .

అక్కడ ఒక న్యాయం..ఇక్కడ ఒక న్యాయం అని మండిపడుతున్న నెటిజెన్స్ :

కానీ తమిళం లో మాత్రం అలా జరగడం లేదని సోషల్ మీడియాలో నెటిజెన్స్ వాదన. ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం విడుదల సమయం లోనే మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రం విడుదలైంది, కానీ గాడ్ ఫాదర్ చిత్రానికి ఒక్క షో కూడా కేటాయించకపోవడం వల్ల, ఆ సినిమాని తమిళనాడు రెండు వారాల తర్వాత విడుదల చెయ్యాల్సి వచ్చిందని, ఇది కచ్చితంగా అన్యాయమే అని అంటున్నారు. అలాంటి పరిస్థితి టాలీవుడ్ లో ఎప్పుడూ రాలేదని, అక్కడి హీరోల సినిమాలకు ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఏర్పడినా కూడా థియేటర్స్ ఇస్తున్నాము, ఆడియన్స్ కూడా ఆదరిస్తున్నారు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.