రూమర్లపై స్పందించిన నిత్యామీనన్

నిత్యామీనన్ ఇటీవల ఇంటర్వ్యూలో చాలా చక్కగా మాట్లాడింది. అంతేకాకుండా తన వర్క్ గురించి అలాగే తన రాబోయే సినిమాల గురించి చాలా బాగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ కుమారి శ్రీమతిలో తన పాత్ర గురించి విశేషాలు పంచుకుంది. అయితే ఒక ప్రముఖ తమిళ్ యాక్టర్ కారణంగా తను హరాస్మెంట్ కి గురైనట్లు పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే దీని మీద దీటుగా, సోషల్ మీడియా ద్వారా స్పందించింది నిత్యమీనన్.  […]

Share:

నిత్యామీనన్ ఇటీవల ఇంటర్వ్యూలో చాలా చక్కగా మాట్లాడింది. అంతేకాకుండా తన వర్క్ గురించి అలాగే తన రాబోయే సినిమాల గురించి చాలా బాగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ కుమారి శ్రీమతిలో తన పాత్ర గురించి విశేషాలు పంచుకుంది. అయితే ఒక ప్రముఖ తమిళ్ యాక్టర్ కారణంగా తను హరాస్మెంట్ కి గురైనట్లు పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే దీని మీద దీటుగా, సోషల్ మీడియా ద్వారా స్పందించింది నిత్యమీనన్. 

రూమర్లపై స్పందించిన నిత్యామీనన్: 

ఒక ప్రముఖ తమిళ్ ఆక్టర్ షూటింగ్ సమయంలో తనని హరాస్మెంట్ చేశాడని, అంతేకాకుండా నిత్యమీనన్ స్వయంగా ఈ విషయాల గురించి ఇంటర్వ్యూలో కూడా చెప్పిందని పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే దీని గురించి ఎటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల చాలామంది దీని గురించి అనూహ్యరీతిలో స్పందిస్తూ ఉన్నారు. అయితే దీని గురించే కాకుండా అనేక రూమర్లతో సతమతమవుతున్న నిత్యమీనన్ ప్రస్తుతం నడుస్తున్న పుకార్ల గురించి తనదైన శైలిలో స్పందించారు. 

అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా, తన మీద హరాస్మెంట్ జరిగిందని పుకార్లు ఎలా సృష్టిస్తారు అని, అసలు ఇటువంటి విషయాలు గురించి మాట్లాడే ముందు ఆలోచించాలని, పుకార్లను సృష్టించిన వారి గురించి మాట్లాడింది నిత్య. అంతేకాకుండా పలు స్క్రీన్ షాట్లు షేర్ చేసి ఎవరైతే ఇటువంటి అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారో వాళ్లకి దీటుగా సమాధానం ఇచ్చింది నిత్యమీనన్. ఒకవేళ ఎటువంటి ఆధారాలు అయినా ఉంటే గనుక తన ముందుకు వచ్చి అటువంటి వార్తలు చెప్పాలని, అంతేకాకుండా ఒకరు మీద బురద జల్లెముందు తమ వైపు ఉన్న లోటుపాట్లు గ్రహించుకోవాలని చెప్పుకొచ్చారు. ఒకరి మనశ్శాంతిని చెడగొట్టే హక్కు మరొకరికి ఎవరు ఇచ్చారని, ఒకరి పిచ్చి చేష్టల కారణంగా ఒకరు బాధపడడాన్ని ఖండించింది నిత్యామీనన్. అయితే అనేకసార్లు కూడా ఇటువంటి పుకార్లు వచ్చాయని, అసలు ఎటువంటి ఆధారం లేకుండా ఒక విషయం గురించి మరొకరు ఎలా నమ్ముతారో అర్థం కావట్లేదని, ఈ విషయంలో తనవైపు నుంచి అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి సోషల్ మీడియా ద్వారా స్పందించినట్లు నిత్యమీనన్ ప్రకటించింది. 

కుమారి శ్రీమతి విశేషాలు: 

కుమారి శ్రీమతి సినిమాలో తన క్యారెక్టర్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు కనిపిస్తుందని కొంతమంది అడిగిన దానికి నిత్యమీనన్ సమాధానం ఇచ్చింది.. నిజానికి స్టోరీ అనేది ఒక అందమైన లైట్ స్టోరీ అని, అసాధారణమైన ఒక క్యారెక్టర్ పోషించినందుకు తన సంతోషిస్తున్నట్లు చెప్పింది. ఒక ముఖ్యంగా సినిమాలు..చిన్న పట్టణంలో ఉన్న ఒక అమ్మాయిని చూస్తారు, ఆమె చాలా సాంప్రదాయిక విషయాల చుట్టూ తన ఆలోచన ధోరణి ఉంటుంది, కానీ ఆమె అసాధారణమైన పనులను చేయడం వలన కొన్ని సంఘటనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ప్రత్యేకమైన సినిమాలో రెండు వైవిధ్యమైన పాత్రలలో తను పోషించినట్లు అనిపించిందని నిత్యమీనన్ చెప్పుకొచ్చింది.

నిత్యా మీనన్ ప్రాజెక్ట్‌లు: 

నిత్యా మీనన్ తదుపరి మలయాళ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ లో కనిపించనుంది. ఈ కార్యక్రమానికి శ్రీజిత్ ఎన్ హెల్మ్ చేసారు. షరాఫ్ యు ధీన్, రెంజి పనికర్, అశోకన్, శాంతి కృష్ణ మరియు మాలా పార్వతి వంటి నటీనటులు ఇందులో కనిపించనున్నారు. ఈ షోను అక్టోబర్ 25న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నటీనటులు రెంజి పనికర్, రోహిణి, సిజోయ్ వర్గీస్ మరియు దిలీష్ పోతన్‌లతో T. K. రాజీవ్ కుమార్ రచన మరియు దర్శకత్వం వహించిన కొలాంబి అనే మలయాళ చిత్రంలోనూ నిత్య నటించబోతున్నారు.