Nithya Menen: నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోతుందట..!

నిత్యా మీనన్ (Nithya Menen) ఈ పేరు వినగానే కుర్ర కారు మనసులో వైబ్రేషన్స్ మొదలవుతాయి. గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్ వంటి సినిమాలు వచ్చి పది సంవత్సరాలు కావస్తువున్న, నిత్యమీనన్ జోరు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. తన వైవిద్యమైన నటనతో ప్రత్యేకమైన వైవిద్య పాత్రల సినిమాలు తీస్తూ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతోంది నిత్యామీనన్ (Nithya Menen). ఇటీవల నిత్యమీనన్ గురించి అనేకమైన రూమర్ (rumour)స్ సోషల్ మీడియా (Social Media)లో చక్కర్లు కొడుతున్న వైనం […]

Share:

నిత్యా మీనన్ (Nithya Menen) ఈ పేరు వినగానే కుర్ర కారు మనసులో వైబ్రేషన్స్ మొదలవుతాయి. గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్ వంటి సినిమాలు వచ్చి పది సంవత్సరాలు కావస్తువున్న, నిత్యమీనన్ జోరు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. తన వైవిద్యమైన నటనతో ప్రత్యేకమైన వైవిద్య పాత్రల సినిమాలు తీస్తూ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతోంది నిత్యామీనన్ (Nithya Menen). ఇటీవల నిత్యమీనన్ గురించి అనేకమైన రూమర్ (rumour)స్ సోషల్ మీడియా (Social Media)లో చక్కర్లు కొడుతున్న వైనం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ప్రత్యేకించి నిత్యమీనన్ పెళ్లి (Marriage) చేసుకోబోతోంది అనే రూమర్ (rumour) గురించి, తన అభిప్రాయాన్ని నటి (Actress) తన సోషల్ మీడియా (Social Media)లో షేర్ చేసుకుంది. 

స్పందించిన నటి..: 

నటి (Actress) నిత్యా మీనన్ (Nithya Menen) ఇటీవల ‘కుమారి శ్రీమతి (Kumari Srimathi)’ వెబ్ సిరీస్‌లో కనిపించింది. గత సంవత్సరం, ఆమె ఒక ప్రముఖ మలయాళ నటుడితో వివాహం చేసుకోబోతున్నట్లు పుకార్లు (rumours) షికార్లు చేశాయి. పుకార్లకు స్వస్తి పలికేందుకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన పెళ్లి (Marriage) విషయం గురించి మాట్లాడింది. ఆ తర్వాత ఆమె ఒక వీడియోను షేర్ చేసింది, అందులో తాను పెళ్లి (Marriage) చేసుకోవడం లేదని, పెళ్లి (Marriage) చేసుకోవడం అనేది కేవలం పుకారు మాత్రమే అని కొట్టి పడేసింది నిత్యామీనన్ (Nithya Menen).

నిత్యా మీనన్ (Nithya Menen) పెళ్లి (Marriage) చేసుకోవాలనే విషయంపై, తనపై కుటుంబ ఒత్తిడి లేదని వెల్లడించింది. ఆమె తన స్వతంత్రానికి మాత్రమే ప్రాధాన్యతను ఇస్తానని, సామాజిక అంచనాలకు లొంగిపోకుండా తన నిబంధనల ప్రకారం జీవితాన్ని గడపడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తను ఏం చేయాలో వేరే ఎవరో చెప్తే తెలుసుకోలేనంత స్థాయిలో తను లేనని.. ముఖ్యంగా పెళ్లి (Marriage) విషయంలో తల్లిదండ్రులు చాలా సపోర్ట్ చేశారని.. వారు నాకు స్వేచ్ఛ అనే విలువైన బహుమతిని ఇచ్చారని.. ప్రత్యేకించి స్వేచ్ఛ లేని జీవితం ఎలా ఉంటుందో తమ తల్లిదండ్రులు తెలుసుకొని తనకు ప్రత్యేక బహుమతిగా ఇచ్చారని మరొకసారి గుర్తు చేసుకుంది నిత్యామీనన్ (Nithya Menen). నటి (Actress) తన పెళ్లి (Marriage) విషయంలో తమ కుటుంబ అంచనాల గురించి కూడా స్పష్టం చేసింది, ఆమె ఒక వ్యక్తితో డేటింగ్ చేయడం విని కుటుంబం చాలా సంతోషంగా ఉన్నప్పటికీ.. అతనిని పెళ్లి (Marriage) చేసుకోమని ఎప్పుడూ తమ కుటుంబం బలవంతం చేయదంటూ మరొకసారి చెప్పుకొచ్చింది నిత్యా మీనన్ (Nithya Menen). 

ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుతం సరైన సమయం, సందర్భం ఉన్నప్పుడు తను తప్పకుండా పెళ్లి (Marriage) చేసుకుంటానని, తన అమ్మమ్మ ఎప్పుడూ కూడా చిన్న వయసులోనే పెళ్లి (Marriage) చేసుకుంటే మంచిది అని చెప్తూనే ఉంటుందని, మరొకసారి తన అమ్మమ్మ మాటలు గుర్తు చేసుకుంది. అయితే 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎవరికైనా సరే కొన్ని బాధ్యతలు ఉంటాయని, ప్రత్యేకించి పెళ్లి (Marriage) విషయంలో ఒక అమ్మాయికి ఉండాల్సిన కొన్ని లక్షణాలు కూడా ప్రతి ఒక్కరు చూస్తారని, అదేవిధంగా మన సమాజంలో మెసగాలంటే రూల్స్ కూడా ఉన్నాయని తనదైన శైలిలో పెళ్లి (Marriage) గురించి మాట్లాడింది నిత్యా మీనన్ (Nithya Menen). 

నిత్యా మీనన్ ప్రాజెక్ట్‌లు: 

నిత్యా మీనన్ (Nithya Menen) తదుపరి మలయాళ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ లో కనిపించనుంది. ఈ కార్యక్రమానికి శ్రీజిత్ ఎన్ హెల్మ్ చేసారు. షరాఫ్ యు ధీన్, రెంజి పనికర్, అశోకన్, శాంతి కృష్ణ మరియు మాలా పార్వతి వంటి నటీనటులు ఇందులో కనిపించనున్నారు. ఈ షోను అక్టోబర్ 25న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నటీనటులు రెంజి పనికర్, రోహిణి, సిజోయ్ వర్గీస్ మరియు దిలీష్ పోతన్‌లతో T. K. రాజీవ్ కుమార్ రచన మరియు దర్శకత్వం వహించిన కొలాంబి అనే మలయాళ చిత్రంలోనూ నిత్య నటించబోతున్నారు. నిత్యా మీనన్ (Nithya Menen) అప్ కమింగ్ మూవీ ప్రాజెక్ట్ ‘డి50’ 2024లో విడుదల కానుంది.