నిత్య మీనన్ సినిమా ప్రణాళికలు 

నిత్య మీనన్ ఈ పేరు వినగానే కుర్ర కారు మనసులో వైబ్రేషన్స్ మొదలవుతాయి. గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్ వంటి సినిమాలు వచ్చి పది సంవత్సరాలు కావస్తువున్న, నిత్యమీనన్ జోరు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. తన వైవిద్యమైన నటనతో ప్రత్యేకమైన వైవిద్య పాత్రల సినిమాలు తీస్తూ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతోంది నిత్యామీనన్.  మంచి వైవిద్య పాత్రలకే తన ఓటు:  కుమారి శ్రీమతి సినిమాలో తన క్యారెక్టర్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు […]

Share:

నిత్య మీనన్ ఈ పేరు వినగానే కుర్ర కారు మనసులో వైబ్రేషన్స్ మొదలవుతాయి. గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్ వంటి సినిమాలు వచ్చి పది సంవత్సరాలు కావస్తువున్న, నిత్యమీనన్ జోరు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. తన వైవిద్యమైన నటనతో ప్రత్యేకమైన వైవిద్య పాత్రల సినిమాలు తీస్తూ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతోంది నిత్యామీనన్. 

మంచి వైవిద్య పాత్రలకే తన ఓటు: 

కుమారి శ్రీమతి సినిమాలో తన క్యారెక్టర్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు కనిపిస్తుందని కొంతమంది అడిగిన దానికి నిత్యమీనన్ సమాధానం ఇచ్చింది.. నిజానికి స్టోరీ అనేది ఒక అందమైన లైట్ స్టోరీ అని, అసాధారణమైన ఒక క్యారెక్టర్ పోషించినందుకు తన సంతోషిస్తున్నట్లు చెప్పింది. ఒక ముఖ్యంగా సినిమాలు..చిన్న పట్టణంలో ఉన్న ఒక అమ్మాయిని చూస్తారు, ఆమె చాలా సాంప్రదాయిక విషయాల చుట్టూ తన ఆలోచన ధోరణి ఉంటుంది, కానీ ఆమె అసాధారణమైన పనులను చేయడం వలన కొన్ని సంఘటనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ప్రత్యేకమైన సినిమాలో రెండు వైవిధ్యమైన పాత్రలలో తను పోషించినట్లు అనిపించిందని నిత్యమీనన్ చెప్పుకొచ్చింది.

నిజానికి ఒక పాత్రలో జీవించడం అనేది తను చేయాల్సిన ముఖ్యమైన పని అని, ప్రత్యేకమైన కథలు వచ్చినప్పుడు తను తప్పకుండా మంచి పాత్రలలో నటించడానికి అసలు వెనకాడను అంటూ చెప్పుకొచ్చింది. మనందరిలోనూ మనకి తెలియని టాలెంట్ స్కిల్స్ అనేవి ఉంటాయని, వాటిని మనం గుర్తించి బలపరుచుకుంటే ముందుకు వెళ్ళగలుగుతామని వెల్లడించింది నిత్యమీనన్. అయితే ప్రతి చిత్రంలో కూడా మనం పోషించే పాత్రలు జనానికి కనెక్ట్ అయ్యే విధంగా చేయడం అనేది ఒక సవాలు అని, అయితే తను నటించిన కుమారి శ్రీమతి సినిమాలో తన పాత్ర ప్రతి ఒక్కరిని అలరిస్తుందని, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు తన క్యారెక్టర్ తో చాలా బాగా కనెక్ట్ అవుతారని చెప్పుకొచ్చింది. ప్రతి సినిమాలో కూడా ఎన్నో అంశాలు ఉంటాయని గ్లామర్, కమర్షియల్, ఊహ ఇలా అన్ని అంశాలను చూపిస్తేనే అది ప్రత్యేకమైన సినిమా అవుతుందని మరొకసారి గుర్తు చేసింది నటి నిత్యా మీనన్. 

నిత్యా మీనన్ గురించి మరింత: 

నిత్యా మేనన్‌ ఒక భారతీయ సినీ నటి, గాయని. పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించింది. ఈమె మూడు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, రెండు నంది బహుమతులు అందుకుంది.

8 సంవత్సరాల వయసులో ద మంకీ హు న్యూ టూమచ్ (1998) అనే ఆంగ్ల చిత్రంలో బాలనటిగా నటించడం మొదలుపెట్టింది. 17 సంవత్సరాల వయసులో 2006 లో ఒక కన్నడ సినిమాలో సహాయ పాత్ర పోషించింది. తర్వాత ఆకాశ గోపురం అనే మలయాళ చిత్రంతో ప్రధాన పాత్రల్లో నటించే అవకాశాలు వచ్చాయి. తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించింది.

నిత్యా మీనన్ ప్రాజెక్ట్‌లు: 

నిత్యా మీనన్ తదుపరి మలయాళ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ మాస్టర్‌పీస్‌లో కనిపించనుంది. ఈ కార్యక్రమానికి శ్రీజిత్ ఎన్ హెల్మ్ చేసారు. షరాఫ్ యు ధీన్, రెంజి పనికర్, అశోకన్, శాంతి కృష్ణ మరియు మాలా పార్వతి వంటి నటీనటులు ఇందులో కనిపించనున్నారు. ఈ షోను అక్టోబర్ 25న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అజయ్ దేవలోక హెల్మ్ చేసిన మలయాళ చిత్రం ఆరం తిరుకల్పనలో కూడా నటి నటిస్తుంది. ఈ చిత్రంలో షైన్ టామ్ చాకో, జగదీష్, కేతకి నారాయణ్, రాహుల్ మాధవ్ మరియు తిరుచిత్రంబళంతో పాటు మరికొందరు నటిస్తున్నట్లు సమాచారం.