నితిన్ ‘తమ్ముడు’ షురూ

యంగ్ హీరో నితిన్ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ఓ ఇంటివాడైన ఈ హీరో మరో కొత్త మూవీని అనౌన్స్ చేశాడు. వకీల్ సాబ్ మూవీతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను డైరెక్ట్ చేసిన శ్రీ రామ్ వేణు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ మూవీకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరియర్ లో హిట్ గా నిలిచిన తమ్ముడు అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ […]

Share:

యంగ్ హీరో నితిన్ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ఓ ఇంటివాడైన ఈ హీరో మరో కొత్త మూవీని అనౌన్స్ చేశాడు. వకీల్ సాబ్ మూవీతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను డైరెక్ట్ చేసిన శ్రీ రామ్ వేణు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ మూవీకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరియర్ లో హిట్ గా నిలిచిన తమ్ముడు అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మూవీ ఫంక్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి వంటి స్టార్ డైరెక్టర్లు హాజరయ్యారు. ఇక శ్రీ రామ్ వేణు నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఎంసీఏ మూవీతో మెగా ఫోన్ పట్టుకున్నారు. టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి, సీనియర్ హీరోయిన్ భూమిక  వంటి స్టార్లు నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరవాలేదనిపించింది. 

ఇక ఈ మూవీ తర్వాత శ్రీ రామ్ పవర్ స్టార్ ను డైరెక్ట్ చేసే అవకాశం కొట్టేశాడు. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన పింక్ మూవీని వకీల్ సాబ్ గా ఇక్కడ రిమేక్ చేశారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల వంటి స్టార్లు నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఈ మూవీతో శ్రీ రామ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాడనే చెప్పాలి. వకీల్ సాబ్ మాతృక పింక్ మూవీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించాడు. అతడు ఆ మూవీలో ఒక ముసలి వ్యక్తి. కానీ ఇక్కడ పవర్ స్టార్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని శ్రీ రామ్ కథలో మార్పులు చేశాడు. ఇక్కడ పవర్ స్టార్ ను ఒక డైనమిక్ లాయర్ గా ప్రజెంట్ చేశారు. అంతే కాకుండా కోర్టులోనే కాకుండా మెట్రో రైలులో కూడా ఫైట్స్ ప్లాన్ చేశారు. ఇవి ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించాయి. అటువంటి శ్రీ రామ్ వేణుతో నితిన్ తన తదుపరి సినిమాను ప్రకటించాడని తెలియగానే నితిన్ అభిమానులతో పాటు మామూలు ప్యాన్స్ కూడా తెగ సంబరపడిపోయారు. ఈ మూవీ తప్పకుండా హిట్ అవుతందనే కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. 

ముచ్చటగా మూడో సారి

ఈ మూవీని వెంటేశ్వర క్రియేషన్స్ నిర్మించనుంది. టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని సమర్పించనున్నారు. వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఇది 56 వ సినిమా. ఈ మూవీ హీరో నితిన్ తో పాటు డైరెక్టర్ శ్రీ రామ్ కూడా కూడా వెంకటేశ్వర బ్యానర్ లో ఇది మూడో సినిమా కావడం గమనార్హం. రాజును దిల్ రాజుగా స్టార్ ప్రొడ్యూసర్ ను చేసిన దిల్ మూవీతో పాటు శ్రీనివాస కల్యాణం మూవీని కూడా నితిన్ చేశాడు. ఇక డైరెక్టర్ శ్రీ రామ్ ఈ బ్యానర్ లో ఎంసీఏ, వకీల్ సాబ్ వంటి మూవీలను డైరెక్ట్ చేశాడు. దీంతో మూడో సినిమాతో వీరి కాంబినేషన్ ఇండస్ట్రీ హిట్ సాధిస్తుందని అంతా అంటున్నారు. ఇక ఈ మూవీకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన తమ్ముడు అనే టైటిల్ ను ఖరారు చేశారు. శ్రీ రామ్ లాస్ట్ మూవీ పవర్ స్టార్ తో కావడం, హీరో నితిన్ కూడా పవర్ స్టార్ కు వీరాభిమాని కావడంతో కేవలం నితిన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ మూవీ తప్పకుండా హిట్ సాధించాలని కోరుకుంటున్నారు.