నితిన్ – శ్రీలీల కొత్త సినిమా పేరు ఏమిటో తెలుసా?

నితిన్ -వక్కంతం వంశీ కాంబో లో గతంలో “భీష్మ”సినిమా కి కలిసి పని చేశారు, అందులో రష్మిక మందన్న కూడా నటించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించిందని మనకి తెలుసు. మల్లి అదే కంబినేషన్ తో మంచి హైప్ తో ఈ సినిమా మొదలయ్యింది.  హీరోయిన్ శ్రీలీల:  అయితే అనుకోకుండా వక్కంతం వంశీతో నితిన్ కొత్త సినిమాలో రష్మిక మందన్న ప్రాజెక్ట్ నుండి తప్పుకోవటంతో, మొదలైన వివిధ కారణాల వల్ల చర్చనీయాంశమైంది ఈ […]

Share:

నితిన్ -వక్కంతం వంశీ కాంబో లో గతంలో “భీష్మ”సినిమా కి కలిసి పని చేశారు, అందులో రష్మిక మందన్న కూడా నటించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించిందని మనకి తెలుసు. మల్లి అదే కంబినేషన్ తో మంచి హైప్ తో ఈ సినిమా మొదలయ్యింది. 

హీరోయిన్ శ్రీలీల: 

అయితే అనుకోకుండా వక్కంతం వంశీతో నితిన్ కొత్త సినిమాలో రష్మిక మందన్న ప్రాజెక్ట్ నుండి తప్పుకోవటంతో, మొదలైన వివిధ కారణాల వల్ల చర్చనీయాంశమైంది ఈ సినిమా. అయితే ప్రస్తుతం ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది. ఈ అమ్మడుకు టాలీవుడ్ లో ఇప్పుడు క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు వచ్చాయి. ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ చాలా హైప్ తో రివీల్ చేశారు టీమ్. 

ఎక్స్‌ట్రా ఆర్డినరీ ఆలోచన: 

చివరికా వచ్చిన నితిన్ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిందని చెప్పుకోవాలి. అయితే మరోవైపు వక్కంతం వంశీ అఖిల్ కి రాసిన చివరి సినిమా ఏజెంట్ కూడా కొత్తగా ట్రై చేసినా జనాలని ఆకర్షించలేకపోయింది. దానితో నితిన్ ఇంకా వక్కంతం వంశీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ ఎనర్జీ తో “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌” సినిమా చెయ్యటానికి సిద్ధం అయ్యారు. ఈ సినిమా పేరు “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మాన్” గా ఒక ఇంగ్లీష్ పేరుని ఎందుకు ఎంచుకున్నారో తెలియనుంది. టైటిల్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉందనే చెప్పాలి. భీష్మ తర్వాత నితిన్, వక్కంతం వంశీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కాబట్టి, ఈ సినిమా చాలా అంచనాలు ఉన్న ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. భీష్మ సినిమా రష్మికా కెరీర్ కి కూడా గణనీయంగా సహాయపడింది. అయితే ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్ లో ఆమె స్థానంలో శ్రీలీల వచ్చింది. ఈ చిత్రం దాని పేరుకు తగ్గట్టుగానే ఉంటుందని మరియు అసాధారణమైన విజయం సాధిస్తుందేమో చూద్దాం. 

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ కి జోడి: 

మహేష్ బాబు తాజా సినిమా గుంటూరు కారంలో కూడా పూజా హెగ్డే తప్పుగున్నాక శ్రీలీలా ఎంటర్ అయ్యింది. అది త్రివిక్రమ్ – మహేష్ కాంబో లో వచ్చే మరో హైప్ ఉన్న సినిమా. ఈమధ్య బేబీ సినిమా ని మెచ్చుకున్నా అల్లు అర్జున్ “శ్రీలీలా లాంటి తెలుగు హీరోయిన్లు మన ఇండస్ట్రీ లో అవసరం” అని కూడా ఈ అమ్మాయిని మెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ లో కూడా శ్రీలీల నటించడం విశేషం. పైగా నితిన్ పోషిస్తున్న పాత్రకి  రెండు వెర్షన్లు ఉన్నాయి..అంటూ రెండిటీ గ్లింప్సె కూడా రివిల్ చేశారు. నితిన్ తన పాత్ర కోసం బాగా కష్టపడుతున్నాడు అని తెలుస్తోంది. ఈ సినిమా మరో మాస్ ఎంటర్‌టైనర్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. కథ పరంగా ఇంకా ఈ సినిమా ప్రాజెక్ట్ కి సంబంధించి షూట్ ఉందని ఫస్ట్ లుక్ స్పష్టం చేసింది. ఇది నితిన్‌కి 32వ సినిమా, ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ చిత్రాన్ని ప్రకటించారు, నితిన్ – వక్కంతం – రష్మీ ఎక్స్ట్రా ఆర్డినరీ కాంబో అని ప్రకటించినా.. అకస్మాత్తుగా, రష్మిక ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఏది ఏమైనా నితిన్ కి వక్ఖత్తం వంశి కి అలాగే శ్రీలీలా కి మంచి విజయం సాధించి పెట్టాలని ఆశిద్దాం, మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేద్దాం.