నాగబాబు వల్లే నిహారిక – చైతన్య విడాకులు తీసుకున్నారా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా వారసురాలు నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2016లో ఒక మనసు అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ సినిమాతో ప్రేక్షకులను హీరోయిన్గా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించింది కానీ సక్సెస్ కాలేక నిర్మాణరంగం వైపు అడుగులు వేసింది. పింక్ ఎలిఫెంట్ అనే ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి పలు సినిమాలు , వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తోంది ఈ […]

Share:

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా వారసురాలు నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2016లో ఒక మనసు అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ సినిమాతో ప్రేక్షకులను హీరోయిన్గా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించింది కానీ సక్సెస్ కాలేక నిర్మాణరంగం వైపు అడుగులు వేసింది. పింక్ ఎలిఫెంట్ అనే ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి పలు సినిమాలు , వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే సినిమాల కంటే ముందు యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమెకు సినిమా రంగంలో నటన విభాగం పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి.  దాంతో నిర్మాణరంగం వైపు అడుగు పెట్టింది. కానీ ఇటీవల మళ్ళీ రీయంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా నిహారిక 2020 డిసెంబర్లో ఉదయపూర్ లోని ఉదయ ఘడ్ ప్యాలెస్ లో గుంటూరు కి చెందిన రిటైర్డ్ ఐజి ప్రభాకర్ రావు కొడుకు చైతన్య జొన్నలగడ్డ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే వీరిద్దరూ విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ కూడా తమ ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో నిజంగానే వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ కామెంట్లు వినిపించాయి. ఇక అందుకు తగ్గట్టుగానే మెగా ఫ్యామిలీలో జరిగే ఏ ఫంక్షన్ కైనా నిహారిక ఒంటరిగా అటెండ్ అవ్వడం.. చైతన్య ఆమెతో కనిపించకపోయేసరికి అందరూ నిజమనే అనుకున్నారు.

ఈ విషయాలు ఇంతగా వైరల్ అవుతున్నా.. అటు నిహారిక ఇటు మెగా ఫ్యామిలీ అటు చైతన్య కూడా ఎవరు స్పందించలేదు. కానీ జూలై 4వ తేదీన హైదరాబాదులోని కూకట్పల్లి లో ఉన్న ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసినట్లు ఈ విషయాన్ని నిహారిక స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. పరస్పర అంగీకారంతోనే ఇద్దరు విడిపోయినట్లు వెల్లడించారు. అయితే ఇలా వీరిద్దరూ విడిపోవడానికి కారణం నాగబాబు అంటూ కామెంట్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అసలు విషయంలోకి వెళితే నాగబాబు తన కూతురు నిహారికను అతి గారాబంగా పెంచాడు అని.. అత్తవారింట్లో ఎలా ఉండాలో ఆమెకు నేర్పించలేదని .. ఆకారణాలవల్లే అత్తమామలు చెప్పిన మాటలు వినలేక.. భర్తతో సర్దుకుపోలేక విడాకులు తీసుకుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరొకవైపు కూతురు సంసారాన్ని చక్కబెట్టే ప్రయత్నం నాగబాబు చేయలేదని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి వాస్తవానికి నిహారికను సినిమాలలో నటించవద్దని ఆమె అత్తమామలు చెప్పారట. ఇక సోషల్ ప్రపంచానికే అంకితమైన నిహారిక ఇంట్లో కట్టుబాట్లకు తట్టుకోలేక ఒంటరిగా జీవించడానికి ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే తన భర్తతో కలిసి హైదరాబాదులో వేరే కాపురం పెట్టినా సరే ఆమె క్లబ్బులు పబ్బులు అంటూ కుటుంబానికి విలువ ఇవ్వలేకపోయింది. అందుకే విడాకులు జరిగిపోయాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే నాగబాబు అతి గారాబం వల్లే నిహారిక తన భర్తతో ఎక్కువ కాలం ఉండలేకపోయింది అంటూ కామెంట్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం. మరొకవైపు నిహారిక పద్ధతుల గురించి ఆమె మామ చైతన్య తండ్రి ప్రభాకర్ రావు కూడా తన కుటుంబంలో కోడలిగా ఆమె మసులుకోలేక పోయిందని.. ఇక  విడాకుల విషయంలో తన కొడుకుని మాత్రమే నిందిస్తుంటే చాలా బాధగా ఉంది అంటూ కూడా ఆయన వెల్లడించారు. ఏది ఏమైనా నాగబాబు అతిగారాభం ఆమె జీవితాన్ని నాశనం చేసింది అంటూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.