పెళ్ళికి వయసు అడ్డం కాదని నిరూపించిన నరేష్

60 ఏళ్ళకి నాలుగోసారి పెళ్లాడిన నరేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ తెలుగు సినీ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం ఇటీవల ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్‌లో వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధంపై జోరుగా చర్చ సాగుతోంది. వీరి బంధంపై మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. 60 ఏళ్ళ వయసులో పవిత్రా లోకేష్‌ను పెళ్లాడాడు నరేష్. వీరిద్దరూ అనేక చిత్రాలలో కూడా కలిసి నటించారు. నరేష్, పవిత్రా లోకేష్‌ జంట దాదాపు రెండేళ్ల పాటు సహజీవనం […]

Share:

60 ఏళ్ళకి నాలుగోసారి పెళ్లాడిన నరేష్

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ తెలుగు సినీ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం ఇటీవల ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్‌లో వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధంపై జోరుగా చర్చ సాగుతోంది. వీరి బంధంపై మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి.

60 ఏళ్ళ వయసులో పవిత్రా లోకేష్‌ను పెళ్లాడాడు నరేష్. వీరిద్దరూ అనేక చిత్రాలలో కూడా కలిసి నటించారు. నరేష్, పవిత్రా లోకేష్‌ జంట దాదాపు రెండేళ్ల పాటు సహజీవనం చేసిన తర్వాత.. ఈ మధ్యే తమ సంబంధాన్ని అధికారికంగా గుర్తించేలా పెళ్లి చేసుకున్నారు. 

ఈ కొత్త జంట శుక్రవారం నాడు సంప్రదాయ పద్ధతిలో జరిగిన తమ వివాహ వేడుకల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తూ, “మా కొత్త ప్రయాణంలో జీవితాంతం శాంతి, ఆనందం కోసం మీ ఆశీర్వాదాలను కోరుతున్నాను” అని ఈ జంట పేర్కొంది. నరేష్‌కి ఇది నాలుగో పెళ్లి కాగా.. పవిత్రకు మాత్రం మూడో పెళ్లి. పవిత్ర కర్ణాటకకు చెందినది, కన్నడ, తెలుగు సినిమాలలో సహాయ నటిగా ఎంతో పేరు సంపాదించింది. ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలు కూడా చేసి, మన తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది.

అయితే.. గతంలో నరేష్, పవిత్రా లోకేష్ మైసూరులోని ఓ హోటల్ గదిలో ఉండగా నరేష్ మూడో భార్య రమ్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వీరిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది రమ్య. కాగా, ఈ వీడియో అప్పట్లో మీడియాలో వైరల్‌గా మారింది. 

ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చిన నరేష్, పవిత్ర.. ఇద్దరి మధ్య ఉన్న సంబంధాలపై బహిరంగంగానే స్పందించారు. మేమిద్దరం కలిసి జీవిస్తున్నామని.. పెళ్లి చేసుకోలేదని.. చాలా ఏళ్లుగా తెలుగులో నటిస్తూ అందరికీ దగ్గరయ్యానని పవిత్ర చెప్పింది.  ప్రేక్షకులు తనకు మద్దతుగా నిలవాలని పవిత్ర కోరింది. నటుడు నరేష్ గురించి మీకందరికీ తెలిసి ఉండాలి. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నరేష్ భార్యగా చెప్పుకుంటూ.. రమ్య అనే మహిళ బెంగుళూరు వచ్చి, తనపై అసభ్యంగా మాట్లాడిందని వాపోయారు.

అప్పటి నుంచి నరేష్, పవిత్రా లోకేష్ వ్యవహారం ఇంకా చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజులు వారి విషయంపై పెద్ద చర్చే జరిగింది. వీరిద్దరూ ఒక్కటవ్వడంపై షాక్ తిన్న వారు   సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మూడో భార్య రమ్య రఘుపతి విడాకుల కేసు ఇంకా కోర్టులోనే ఉంది. నరేష్ విడిపోయిన తర్వాత, తన మూడవ భార్య రమ్య రఘుపతితో గందరగోళ వివాదంలో చిక్కుకున్నాడు, పవిత్రతో అతని ప్రేమ అందరికీ తెలిసింది. నరేష్‌కి విడాకులు ఇచ్చేందుకు రమ్య రఘుపతి మాత్రం నిరాకరించినట్లు సమాచారం.

నరేష్ తన పలుకుబడి ఉపయోగించి.. పవిత్రకు ఆఫర్లు ఇప్పిస్తున్నాడని కొన్నాళ్ళు, నరేష్, పవిత్ర విడిపోతున్నారని కొన్నాళ్ళు, పెళ్లి చేసేసుకున్నారని కొన్నాళ్ళు.. ఇలా సోషల్ మీడియాలో వీళ్ళిద్దరికి సంబంధించిన రకరకాల పుకార్లు షికారు చేశాయి. ఇప్పుడు పెళ్ళి చేసుకొని ఈ కథకి ఒక శుభం కార్డు వేశారు. అయితే ఇప్పటికి వీళ్ళ కథ ఇలా ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు.