రవీనా టాండన్ కి పద్మశ్రీ ఇవ్వడంపై నెటిజెన్ల పెదవి విరుపు

బాలీవుడ్ నటి రవీనా టాండన్ రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. 50 ఏళ్ల ఈ నటి కళల రంగానికి ఆమె చేసిన సేవలకు గాను ఈ అవార్డును ప్రధానం చేశారు. ఈ అవార్డు అందుకున్న నటి రవినాటాండన్ కి కొంతమంది శుభాకాంక్షలు తెలియజేస్తుంటే, మరికొందరు మాత్రం ఆమెను విమర్శిస్తున్నారు. ఆ విమర్శలపై రవినా టాండన్ స్పందించింది.  బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఇటీవల రాష్ట్రపతి […]

Share:

బాలీవుడ్ నటి రవీనా టాండన్ రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. 50 ఏళ్ల ఈ నటి కళల రంగానికి ఆమె చేసిన సేవలకు గాను ఈ అవార్డును ప్రధానం చేశారు. ఈ అవార్డు అందుకున్న నటి రవినాటాండన్ కి కొంతమంది శుభాకాంక్షలు తెలియజేస్తుంటే, మరికొందరు మాత్రం ఆమెను విమర్శిస్తున్నారు. ఆ విమర్శలపై రవినా టాండన్ స్పందించింది. 

బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఇటీవల రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా కొంతమందిని నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆమెకు పద్మశ్రీ ఎందుకు ఇచ్చారని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆమె దేశం కోసం ఏం చేసిందని పద్మశ్రీ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. పద్మశ్రీ అవసరమా అంటూ విమర్శలు చేస్తున్నారు. సినిమాల్లో అందాలు ఆరబోసే హీరోయిన్ కి ప్రతిష్టాత్మక అవార్డును అందుకునే అర్హత ఉందా?  అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రవీనా టాండన్ ఆ వ్యాఖ్యలు చేసిన వారందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 

 తాజాగా ఓ పత్రికకు రవీనా టాండన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.  తనపై వచ్చిన ట్రోల్స్ పై కూడా ఆమె స్పందించారు. తనని ట్రోల్ చేసే వాళ్లు కేవలం తన గ్లామర్ ను మాత్రమే చూస్తున్నారని ఆ గ్లామర్ వెనుక ఉన్న హార్డ్ వర్క్ ను దీర్ఘకాలిక శ్రమను గుర్తించడం లేదని ఆమె అన్నారు. అలాంటి ట్రోల్స్ కు తాను అంతగా విలువ ఇవ్వదలుచుకోలేదని రవీనా టాండన్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాను సినిమాల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాలేదని, పలు సామాజిక స్పృహ ఉన్న సినిమాల్లో కూడా నటించానని తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటనపై వచ్చిన మాత్ర్ సినిమాలో కూడా తాను నటించి, మెప్పించానని రవీనా టాండన్ అన్నారు. నాకు పద్మశ్రీ రావడంపై కొందరు ట్రోల్ చేస్తున్నా, చాలామంది శుభాకాంక్షలు తెలుపుతున్నారని ఆమె గుర్తు చేశారు.

 రవీనా పద్మశ్రీని అందుకున్న ఫోటోలను షేర్ చేయగా, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటోలకి ఆమె అభిమానులు మరి కొంతమందిని నెటిజన్లు హార్ట్, ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న తరువాత రవీనా తన కూతురు, కుమారుడితో కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ కి వెళ్తూ కనిపించారు. అక్కడ రవీనా మాట్లాడుతూ, “ఈ ప్రత్యేకమైన అవార్డును నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, నా రచనలను, నా అభిరుచిని, నా ఉద్దేశాన్ని గుర్తించినందుకు భారతదేశ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆఫ్ సినిమా విభాగంలో ఈ ప్రయాణంలో నాకు మార్గ నిర్దేశం చేసిన వారందరికీ నేను ముందుకు వెళ్లడానికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ విషయంలో నేను నా కన్నతండ్రి కి రుణపడి ఉంటాను ఆయన వల్లే నాకు ఈ రోజు ఈ అవార్డు లభించింది” అని అన్నారు. రవినా టాండన్ పద్మశ్రీ అందుకున్న తరువాత రాజమౌళితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.