సక్సెస్ బాటలో నేహా శెట్టి

మెహబూబా సినిమాతోతో తెలుగు సిని రంగంలోకి అడుగుపెట్టిన నేహా శెట్టి, తరువాత గల్లీ రౌడీ మరియు DJ టిల్లు వంటి ఎంటర్టైనర్లలో నటించి అందర్నీ మెప్పించింది. DJ టిల్లు సక్సెస్ తర్వాత రాధికగా ఒక మంచి గుర్తింపుని తెచ్చుకుంది. డీజే టిల్లు సక్సెస్ తరువాత ఆమెకు వరస సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. తదుపరి బెదురులంక 2012 విడుదలవ్వడమే కాకుండా మంచి సక్సెస్ ని అందుకుంది నేహా శెట్టి.  ఆమె మాటల్లోనే మరిన్ని విశేషాలు:  బెదురులంక సినిమాకి […]

Share:

మెహబూబా సినిమాతోతో తెలుగు సిని రంగంలోకి అడుగుపెట్టిన నేహా శెట్టి, తరువాత గల్లీ రౌడీ మరియు DJ టిల్లు వంటి ఎంటర్టైనర్లలో నటించి అందర్నీ మెప్పించింది. DJ టిల్లు సక్సెస్ తర్వాత రాధికగా ఒక మంచి గుర్తింపుని తెచ్చుకుంది. డీజే టిల్లు సక్సెస్ తరువాత ఆమెకు వరస సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. తదుపరి బెదురులంక 2012 విడుదలవ్వడమే కాకుండా మంచి సక్సెస్ ని అందుకుంది నేహా శెట్టి. 

ఆమె మాటల్లోనే మరిన్ని విశేషాలు: 

బెదురులంక సినిమాకి సంబంధించి ఇంతకుముందు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా నేహా శెట్టి సినిమా అనుభవాలను మరింత పంచుకోవడం జరిగింది. ఆమె మాట్లాడుతూ, “రాధిక నుండి బిగ్ హలో.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పెద్ద సంఖ్యలో హాజరైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు. డీజే టిల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నేను హాజరు కాలేకపోయాను. మీ ప్రేమ వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. మీరు తెలంగాణకు చెందిన రాధికను చూశారు, అదే ఉత్సాహంతో మీరు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన చిత్రాను కలుస్తారని నేను ఆశిస్తున్నాను, ”అని నటి బెదురులంక 2012 గురించి తన ఉత్సాహాన్ని పంచుకుంది.

నేహా మాట్లాడుతూ, అద్భుతంగా తెరకెక్కించిన బెదురులంక సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని, అంతేకాకుండా చిత్ర పాత్రలో తనపై నమ్మకం ఉంచినందుకు చిత్ర నిర్మాతలకు తనదైన శైలిలో థాంక్స్ చెప్పుకుంది. అయితే ఇప్పటివరకు తన పోషించిన సినిమాలలో ఎక్కువగా, తాను సిటీ అమ్మాయి గానే పరిచయమైందని, అయితే ఇప్పుడు చేసిన సినిమాలో మాత్రం పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపించపోతున్నట్లు చెప్పుకొచ్చింది నేహా. బెదురులంక 2012 కోసం తన పేరును సిఫార్సు చేసినందుకు నా నిర్మాత రవీంద్ర బెనర్జీకి కృతజ్ఞతలు తెలుపుకుంది. అయితే ఈ సినిమా ప్రస్తుతం ఒక ప్రత్యేకమైన సక్సెస్ ని అందుకుంది. దీని ద్వారా ఆమెకు మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.  మణిశర్మ పాటలకు పెర్ఫార్మెన్స్ చేయాలనేది ఒక కల అని నేహా పేర్కొంది. అతను సినిమా గురించి, సినిమా టీమ్‌లో అత్యంత నమ్మకంగా ఉన్న వ్యక్తి, ఇదే కాకుండా అతను బెదురులంక సినిమాకు గాను బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని అని చెప్పుకొచ్చింది.

కార్తికేయ గురించి నేహా: 

2018లో ఆర్‌ఎక్స్ 100ని థియేటర్లలో చూసినప్పుడు తనకు మరియు స్నేహితులకు పిచ్చి పట్టిందని, ఆ తర్వాత కార్తికేయతో సినిమా చేస్తానని ఊహించలేదని నేహా చెప్పింది. నిజంగా కార్తికేయ లాంటి మంచి నటుడుతో నటించడం చాలా ఆనందంగా ఉందని, చాలా సపోర్ట్ చేశారని చెప్పుకొచ్చింది. ఆగస్టు 25న బెదురులంక సినిమా రిలీజ్ అవ్వడమే కాకుండా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా బెదురులంక సినిమాలో కార్తికేయ, నేహా శెట్టి పాత్రలు ప్రత్యేకమైన పాత్రను పోషించాయి.

అయితే నేహా తన గురించి మరింత మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఐదేళ్ల ప్రయాణంలో తాను తప్పులు చేశానని ఒప్పుకోవడానికి నేహా ఏమాత్రం సంకోచించలేదు. తన కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాలు చేయడం పట్ల ఆమె పశ్చాత్తాపపడుతుండగా, ప్రతిదీ ఒక కారణంతో జరిగిందని ఆమె భావిస్తుంది. ఆమెలో ఉన్న గ్రిట్ హార్డ్ వర్క్ మరియు నమ్మకం మరిన్ని సినిమా ఆఫర్లు వచ్చేలా చేసాడని చెప్పకు వచ్చింది. తన కెరీర్ ప్రారంభంలో, స్క్రిప్ట్‌ను ఎలా అంచనా వేయాలో మరియు ప్రతి కథనం ఎంత ముఖ్యమైనదిగా మారుతుందో ఆమెకు తెలియనప్పటికీ ఆమె మెల్ల మెల్లగా స్క్రిప్ట్ పరంగా ఎలా ముందుకు వెళ్లాలో, తన సినిమాలో స్క్రిప్ట్ కి ఉన్న విలువ ఆమె తలుచుకున్నట్లు వెల్లడించును.