పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నా నయనతార 

ప్రస్తుతం నయనతార తన పిల్లలతో హ్యాపీగా గడుపుతుంది. తాను మరో పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే, తన ఫ్యామిలీ కోసం చక్కని టైమ్ స్పెండ్ చేస్తుంది నయనతార. నయనతార తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికలలో ఒకరు. తను ఎన్నో సినిమాలలో కథానాయికిగా ప్రతి ఒక్కరి మన్ననలు అందుకుంది. ఆమె గత సంవత్సరం దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకుంది. ఈ జంట అక్టోబర్‌లో తమ పిల్లలను ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే ప్రస్తుతం నయనతార […]

Share:

ప్రస్తుతం నయనతార తన పిల్లలతో హ్యాపీగా గడుపుతుంది. తాను మరో పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే, తన ఫ్యామిలీ కోసం చక్కని టైమ్ స్పెండ్ చేస్తుంది నయనతార. నయనతార తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికలలో ఒకరు. తను ఎన్నో సినిమాలలో కథానాయికిగా ప్రతి ఒక్కరి మన్ననలు అందుకుంది. ఆమె గత సంవత్సరం దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకుంది. ఈ జంట అక్టోబర్‌లో తమ పిల్లలను ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే ప్రస్తుతం నయనతార తన పిల్లలతో హ్యాపీగా గడుపుతున్న క్షణాలను, నయనతార భర్త విగ్నేష్ సోషల్ మీడియాలో హ్యాపీగా షేర్ చేశారు.

వైరల్ గా మారిన ఫోటో: 

విఘ్నేష్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. నిజానికి ఆ ఫోటోలో నయనతార తన బిడ్డని ఒళ్ళో పెట్టుకుని కుర్చీలో కూర్చుని సంతోషంగా ఆడిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సీన్ నిర్మాత విగ్నేష్ ఫోటో తీసి పోస్ట్ చేశారు. అంతేకాకుండా, “నా ఉయిర్స్స్, సండేస్స్స్ బాగా గడిపాను! కొన్ని మధుర క్షణాలు.. కానీ లాట్స్ ఆఫ్ లవ్” అంటూ పోస్టులో రాసాడు నయనతార భర్త విగ్నేష్.

విఘ్నేష్ పోస్ట్ చేసిన వెంటనే ఈ ఫోటో వైరల్ అయ్యింది. చాలా మంది అభిమానులు మరియు సెలబ్రిటీలు పోస్ట్ చూసి తమ అభిమానాన్ని ప్రేమని కామెంట్ల రూపంలో చూపించారు. నటి శ్రుతి హాసన్, ఖతీజా రెహమాన్ మరియు ఇతర ప్రముఖ వ్యక్తులు కూడా, నయనతార కుటుంబం పట్ల తమ ప్రేమను వ్యక్తం చేశారు. నటి నయనతార సోషల్ మీడియాలో లేనప్పటికీ, చిత్రనిర్మాత విఘ్నేష్ శివన్ అప్పుడప్పుడు వారి కుటుంబ ప్రపంచం గురించి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ కొత్త ఫోటో చూసిన తర్వాత, నటి నయనతార తన బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ తన పిల్లల కోసం కేటాయించిన సమయం, ఆమె మాతృత్వానికి ప్రతిబింబం అంటున్నారు. 

గతంలో, దర్శకుడు ఫాదర్స్ డే సందర్భంగా తమ పిల్లలను పట్టుకొని ఉన్న ఒక పిక్చర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కొన్ని నెలల క్రితం, వారు తమ పిల్లల పేర్లను రుద్రోనీల్ ఎన్ శివన్ మరియు ఉలాగ్ దైవిక్ ఎన్ శివన్ అని ప్రకటించడం జరిగింది.

నయనతార నెక్స్ట్ సినిమాలు: 

నయనతార తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు అనే కాకుండా అనేక భాషల్లో ఎన్నో సినిమాలు నటించి తన సినీ కెరీర్ లోనే ఒక పెద్ద కథానాయికిగా ఎదిగింది. నయనతార అంటే భారతదేశంలో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. తనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మతి పోవాల్సిందే. అయితే ప్రస్తుతం నయనతార మళ్ళీ సినిమాలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తుంది. షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో మరియు అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రంతో తన బాలీవుడ్ అరంగేట్రం చేయబోతోంది నటి నయనతార. ఇటీవలే టీజర్‌ను విడుదల చేసిన ఈ సినిమా అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ అదే విధంగా ఉత్కంఠను రేపుతోంది. ఐ అహ్మద్ దర్శకత్వం వహించిన జయం రవితో కలిసి ఆమె ఇరైవన్‌లో కూడా క్యారెక్టర్ లో నటిస్తోంది. ఆమె నెక్స్ట్ లేడి ఓరియంటెడ్ ప్రాజెక్ట్, లేడీ సూపర్ స్టార్ 75, ఇటీవల వార్తల్లో నిలిచింది. మాధవన్ మరియు సిద్ధార్థ్ నటించిన టెస్ట్‌లో కూడా ఆమె నటిస్తున్నట్లు తెలుస్తుంది. కథువాకుల రెండు కాదల్ తర్వాత విఘ్నేష్ శివన్ తదుపరి ప్రాజెక్ట్ గురించి ఇంకా ఏ వార్త అంతలేదు.