కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా నాయకన్ రీ-రిలీజ్ 

36 ఏళ్ల సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన మణిరత్నం కమలహాసన్ కాంబినేషన్లో వచ్చిన నాయకన్ చిత్రం మరిన్ని హంగులతో, రీ-రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. 1987లో భారత దేశ చలన చిత్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కమల్హాసన్ చిత్రం నాయకన్. ముఖ్యంగా క్రైమ్ డ్రామా అంశాన్ని మణిరత్నం తెరకెక్కించి, కమల్ హాసన్ నటించిన ఈ చిత్రంతో మరింతమంది అభిమానాలు దక్కించుకున్నారు.  రీ-రిలీజ్ కు సిద్ధం:  హాలీవుడ్ చిత్రం గాడ్ ఫాదర్ సినిమాను బేస్ చేసుకుని తరాకెక్కించిన […]

Share:

36 ఏళ్ల సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన మణిరత్నం కమలహాసన్ కాంబినేషన్లో వచ్చిన నాయకన్ చిత్రం మరిన్ని హంగులతో, రీ-రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. 1987లో భారత దేశ చలన చిత్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కమల్హాసన్ చిత్రం నాయకన్. ముఖ్యంగా క్రైమ్ డ్రామా అంశాన్ని మణిరత్నం తెరకెక్కించి, కమల్ హాసన్ నటించిన ఈ చిత్రంతో మరింతమంది అభిమానాలు దక్కించుకున్నారు. 

రీ-రిలీజ్ కు సిద్ధం: 

హాలీవుడ్ చిత్రం గాడ్ ఫాదర్ సినిమాను బేస్ చేసుకుని తరాకెక్కించిన నాయకన్ చిత్రం తమిళ ఇండస్ట్రీని మరో కోణంలో చూసేలా చేసింది. నిజంగా నాయకన్ సినిమాలో ప్రత్యేకించి కమల్ హాసన్ నటన అందరి చూపులకు ఆకట్టుకుంది. 36 సంవత్సరాల క్రితం అభిమానులను ఆకట్టుకున్న ఈ నాయకన్ చిత్రం మరిన్ని హంగులతో 4K ఫార్మేట్ లో మరోసారి రీ-రిలీజ్ కు సిద్ధంగా ఉంది. 

కమల్ హాసన్ పుట్టినరోజు ప్రత్యేకత: 

కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 3న, మణిరత్నం తెరకెక్కించిన నాయకన్ చిత్రం ప్రత్యేకించి కమల్ హాసన్ బర్త్ డే వీక్ సందర్భంగా రీ రిలీజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నో సినిమాలలో తన నటనతో ఆకట్టుకున్న కమల్ హాసన్, నవంబర్ 7న 69వ పుట్టినరోజు చేసుకుంటున్న సందర్భంగా ఈ ప్రత్యేకమైన ఆకర్షణ అందరు ముందుకు వచ్చింది. ప్రత్యేకించి తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాలలో నాయకన్ చిత్రం మరోసారి ప్రేక్షకులకు ముందుకు వస్తుందని డిస్ట్రిబ్యూటర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు, నిజానికి కమల్ హాసన్ ఫ్యాన్స్ కి తమల చిత్రంలో అదరగొట్టిన నాయకన్ చిత్రం మరొకసారి అందరి ముందుకి రావడం కన్నుల పండుగగానే ఉంటుంది. నిజంగా మణిరత్నం అదే విధంగా కమల్ హాసన్ ఈ చిత్రం గురించి మరింత ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వైవిధ్యమైన పాత్రలలో నటించి అందరి మన్ననలు పొందిన కమల్ హాసన్ నటించిన సైలెంట్ మూవీ పుష్పక్ 1987లో రిలీజ్ అయ్యి చరిత్ర సృష్టించింది. అయితే మరొకసారి ప్రేక్షకులకు ముందుకు వస్తుంది అంటూ రాబోయే కొద్ది నెలల్లోనే ఈ ప్రకటన జరుగుతుందని అంచనా వేస్తున్నారు. 

నాయకన్ చిత్రం గురించి మరింత: 

1987లో కమల్ హాసన్ మణిరత్నం ఎదుగుతున్న క్రమంలో ఈ సినిమా తెర మీదకి వచ్చింది. అయితే హిందీ సినిమా పగల కహీన్కా అనే చిత్రాన్ని రీమేక్ చేసేందుకు కమల్ హాసన్ ఆసక్తి చూపించారు. కానీ మణిరత్నం ఈ సినిమాని డైరెక్ట్ గా రీమేక్ చేసేందుకు వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. తర్వాత ముక్తా శ్రీనివాస్ అనే ప్రొడ్యూసర్ మణిరత్నాన్ని కన్వెన్షన్ చేసి, హాలీవుడ్ లో పేరు పొందిన గాడ్ ఫాదర్ సినిమాని తెరకెక్కించేందుకు ఒప్పించినట్లు తెలిసింది. 

అయితే ఈ చిత్రంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన కమల్ హాసన్, ఒక అనాధ పిల్లవాడిగా కనిపిస్తాడు. అంతేకాకుండా బొంబాయిలోని ఒక పవర్ఫుల్ డాన్ గా ఎదుగుతాడు. ఈ సినిమా మొత్తం ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమా అనంతరం కమల్ హాసన్ ప్రత్యేకమైన తన రెండో నేషనల్ అవార్డ్ విన్నర్గా నిలిచాడు. మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ప్రత్యేకమైన ఆకర్షణ. 

కమల్ హాసన్‌తో పాటు, నాయకన్‌లో శరణ్య పొన్‌వణ్ణన్, జనకరాజ్, ఢిల్లీ గణేష్, కార్తీక, నిజాల్‌గల్ రవి, నాసర్, టిన్ను ఆనంద్, విజయన్ మరియు ఇతరులు సహాయక పాత్రల్లో నటించారు. ఇళయరాజా నాయకన్ కోసం పాటలు మరియు ఒరిజినల్ స్కోర్‌ను కంపోజ్ చేశారు, ఇది 60వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో, ఈ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.