నవీన్ పోలిశెట్టి మాస్టర్‌ ప్లాన్‌.. !

ఏ హీరో అయినా సక్సెస్ పడ్డ వెంటనే వరుసగా మూడు నాలుగు సినిమాలు కమిట్ అయి స్పీడ్ గా ఆ సినిమాలు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి ఆ హిట్ సినిమాకి సంబంధించిన క్రేజ్ కంటిన్యూ అయ్యేలా. సక్సెస్ పబ్లిసిటీ ఉపయోగ పడేవిధంగా ప్లాన్ చేసుకుంటారు. కానీ హీరో నవీన్ పోలిశెట్టి మాత్రం ఆ విధంగా ప్లాన్ చేసుకోవడంలో విఫలం అయ్యాడు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జాతి రత్నాలు సినిమా రెండు సంవత్సరాలు […]

Share:

ఏ హీరో అయినా సక్సెస్ పడ్డ వెంటనే వరుసగా మూడు నాలుగు సినిమాలు కమిట్ అయి స్పీడ్ గా ఆ సినిమాలు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి ఆ హిట్ సినిమాకి సంబంధించిన క్రేజ్ కంటిన్యూ అయ్యేలా. సక్సెస్ పబ్లిసిటీ ఉపయోగ పడేవిధంగా ప్లాన్ చేసుకుంటారు. కానీ హీరో నవీన్ పోలిశెట్టి మాత్రం ఆ విధంగా ప్లాన్ చేసుకోవడంలో విఫలం అయ్యాడు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జాతి రత్నాలు సినిమా రెండు సంవత్సరాలు అవుతుంది వచ్చి. ఆ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో వెంటనే నవీన్ పోలిశెట్టి నుండి సినిమాలు వచ్చి ఉంటే కచ్చితంగా భారీ విజయాలను సొంతం చేసుకోవడం ఖాయం అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

కానీ రెండు సంవత్సరాల పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు నవీన్ పోలిశెట్టి నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ రెండేళ్ల గ్యాప్ ని వరుసగా మూడు సినిమాలతో ఫీల్ చేసేందుకు నవీన్ పోలిశెట్టి ప్లాన్ చేస్తున్నాడని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.  ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి తన రాబోయే చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ప్రమోషన్ కోసం వివిధ ప్రదేశాలను పర్యటిస్తున్నాడు. ఇప్పుడు స్క్రిప్ట్‌ల కోసం తన అనుమతిని ఇవ్వడానికి మరింత సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.  

నవీన్ పొలిశెట్టి జాతి రత్నాలు కంటే ముందు నవీన్ చేసిన సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించాడు నవీన్ పొలిశెట్టి. అంతేకాదు రాబోయే పలు చిత్రాలకు ఈయన కథ, స్క్రీన్ ప్లే సమకూర్చుకునే పనిలో పడ్డాడు. “అనుష్కతో తన చిత్రం తగినంత సంచలనం కలిగించడంలో విఫలమవడంతో, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చినప్పటికీ, నవీన్ స్క్రిప్ట్‌ల కోసం ఎక్కువ సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను తన ఆమోదం ఇవ్వడానికి కనీసం 10 నెలల నుండి ఒక సంవత్సరం పడుతుందని సమాచారం.

ఇప్పటికే రెండు సినిమాలను చేసిన నవీన్ పోలిశెట్టి ఒక సినిమా తో సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరో సినిమాతో దసరా సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సమయంలోనే మూడవ సినిమా కు నవీన్ పోలిశెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్వాతిముత్యం సినిమా తో బెల్లంకొండ సాయి గణేష్ ని హీరోగా చూపించిన దర్శకుడు తో నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. 

అందుకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని త్వరలోనే షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అవ్వబోతున్నాయని తెలుస్తోంది.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే నవీన్ పోలిశెట్టి యొక్క స్వాతిముత్యం కూడా ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినందుకు ముచ్చటగా మూడు సినిమాలతో నవీన్ పోలిశెట్టి ప్రేక్షకుల ముందుకు రావడం ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయం.

మొదటి సినిమా “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” తోనే మంచి హిట్ ను అందుకున్న యువ హీరో నవీన్ పొలిశెట్టి తాజాగా విడుదలైన “జాతి రత్నాలు” సినిమా తో ఏకంగా బ్లాక్బస్టర్ ను అందుకున్నాడు. నవీన్ పొలిశెట్టి తదుపరి సినిమా ఎలా ఉండబోతోంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ నవీన్ మాత్రం ఇంకా తన నెక్స్ట్ సినిమా గురించి అధికారిక ప్రకటన ను విడుదల చేయాల్సి ఉంది.  అయితే తాజా సమాచారం ప్రకారం నవీన్ పొలిశెట్టి ఈ మధ్యనే స్క్రిప్ట్ బాగా లేదు అని ఒక పెద్ద ప్రొడక్షన్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాకి నో చెప్పాడని తెలుస్తోంది. 

ఈ సినిమా కోసం నవీన్ పొలిశెట్టి కి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ ఈ హీరో మాత్రం ఆ సినిమాకి నో చెప్పటం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే ఈ మధ్యనే ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ నవీన్ పొలిశెట్టి మరియు “రంగ్ దే” ఫేమ్ వెంకీ అట్లూరి కి మధ్య స్క్రిప్ట్ డిస్కషన్ మీటింగ్ ను ఏర్పాటు చేశారట. అక్కడ వెంకీ అట్లూరి నవీన్ పోలిశెట్టి కి ఒక మంచి కథను నేరెట్ చేశారు కానీ ఆ కథకు తను సెట్ కాడు అనుకున్న నవీన్ పొలిశెట్టి సున్నితంగా వారిని తిరస్కరించారట. ఈ సినిమా కోసం మైత్రీ వారు నాలుగు కోట్ల దాకా రెమ్యునిరేషన్ ఇస్తామన్నప్పటికీ నవీన్ పొలిశెట్టి మాత్రం సినిమాకి ఓకే చెప్పలేదట.