ముంబయిలో హోలీ రోజున నేచురల్ స్టార్ నాని హల్‌‌చల్

నేచురల్ స్టార్ నాని విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. తన కెరీర్ మొదట్లోనే విభిన్నమైన కథలతో సినిమాలు చేసిన నాని.. తన కెరీర్లో గ్యాప్ లేకుండా జాగ్రత్త పడుతూ సరైన ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నాడు. నాని వేగంగా సినిమాలు చేయడానికి మరియు మంచి కథకి రెండింటికీ సరైన ప్రాధాన్యత ఇస్తాడు. ప్రస్తుతం.. నాని, శ్రీకాంత్ ఓదెల దసరా చిత్రానికి పని చేస్తున్నారు. ఇది మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ […]

Share:

నేచురల్ స్టార్ నాని విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. తన కెరీర్ మొదట్లోనే విభిన్నమైన కథలతో సినిమాలు చేసిన నాని.. తన కెరీర్లో గ్యాప్ లేకుండా జాగ్రత్త పడుతూ సరైన ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నాడు. నాని వేగంగా సినిమాలు చేయడానికి మరియు మంచి కథకి రెండింటికీ సరైన ప్రాధాన్యత ఇస్తాడు. ప్రస్తుతం.. నాని, శ్రీకాంత్ ఓదెల దసరా చిత్రానికి పని చేస్తున్నారు. ఇది మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ముంబై, పొరుగు ప్రాంతాల నుండి అభిమానులు తమ అభిమాన తారను చూసేందుకు గుమిగూడారు. నాని రాబోయే తన పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ని ప్రమోట్ చేయడానికి అక్కడకు వచ్చారు. అయితే ప్రేక్షకులు నానిని నిరాశ పరచలేదు.

ఈ ఈవెంట్ సందర్భంగా.. నాని ‘దసరా’ పోస్టర్ ని, దాని టీజర్‌ని రివీల్ చేయడం ద్వారా.. వేదిక వద్ద ఉన్న అభిమానులందరికీ ట్రీట్ అందించాడు. వీరిద్దరికీ ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన ప్రశంసలు లభించాయి.

నాని అక్కడితో ఆగలేదు.. అతను తన రాబోయే చిత్రంలోని ఒక పాటలోని ప్రత్యేకమైన భాగాన్ని ప్రేక్షకులకు కానుకగా ఇచ్చాడు. దీంతో అభిమానులు నానికి బ్రహ్మరథం పట్టారు. తన పట్ల అభిమానులు చూపించిన ప్రేమకు, ఉత్సాహానికి నాని చాలా సంబరపడ్డాడు.

తన ఉత్సాహాన్ని, కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తూ, నటుడు ఇలా అన్నాడు, “ముంబైలో ప్రేక్షకులు నాపై చూపిన అపారమైన ప్రేమకు, నాకిస్తున్న సపోర్ట్ కు నేను నిజంగా కృతజ్ఞుడను. వారితో హోలీ జరుపుకోవడం, వారి ప్రేమ, ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా చూడటం ఆనందంగా ఉంది. ‘మార్చి 30న ‘దసరా’ విడుదల కాబోతోంది. మీరందరూ ఎలా స్పందిస్తారోనని ఎంతో ఉంత్కంఠగా ఉంది. ‘దసరా’ భారతీయ సినిమా అని చెప్పాలనుకుంటున్నాను. ఇది నార్త్ సినిమానో, సౌత్ సినిమానో కాదు. బాహుబలిbలాగా, పఠాన్ లాగా, దసరా కూడా ఒక పాన్ ఇండియా మూవీ. మీరు దీనికి మీ ప్రేమ, సపోర్ట్ అందిస్తారని నేను ఆశిస్తున్నాను. మార్చి 30వ తేదీన ఈ చిత్రానికి మీ స్పందనను చూడాలని ఎంతో ఆశగా ఉంది.”

ఈ ఈవెంట్ ప్రతిభావంతులైన నటుడు, అతని అంకితభావంతో కూడిన అభిమానులు కలిసి సినిమాపై తమ ప్రేమను పంచుకున్నప్పుడు జరిగే మాయాజాలాన్ని గుర్తు చేస్తుంది.

‘దసరా’ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. కథ, దర్శకత్వం శ్రీకాంత్ ఓదెల కాగా.. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు.

ఈ సినిమా తర్వాత నాని తన కెరీర్‌లో 30వ సినిమా చేయబోతున్నాడు, ఈ చిత్రానికి శౌర్యవ్ అనే కొత్త వ్యక్తి దర్శకుడిగా పని చేయనున్నారు. నాని 31వ చిత్రం కోసం దర్శకుడు వివేక్ ఆత్రేయతో చర్చలు జరుగుతున్నారని సినీ వర్గాల సమాచారం.

ఇక త్వరలో నాని, శైలేష్ కొలనులతో హిట్ 3 సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాసరావు, నానితో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.