అల్లు అర్జున్‌కి అవార్డు.. ఏడుస్తున్న విక్కీ కౌష‌ల్ ఫ్యాన్స్

సినిమా రంగానికి సంబంధించిన జాతీయ అవార్డుల ప్రకటనపై కొంతమంది అభిమానులు నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాని జాతీయస్థాయిలో చూపిస్తూ దానికి ఒక ప్రాముఖ్యత ఉంటే జాతీయ అవార్డు అందించాలి గాని, సినిమా రంగంలో అసలు ఏ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అవార్డులు ప్రధానం జరుగుతోందో అర్థం కావట్లేదు అంటున్నారు అభిమానులు. ముఖ్యంగా పుష్ప సినిమాకు గాను హీరోగా నటించిన అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇచ్చినందుకు బాలీవుడ్ అభిమానులు తమ వైపు నుంచి వ్యతిరేకత వ్యక్తం […]

Share:

సినిమా రంగానికి సంబంధించిన జాతీయ అవార్డుల ప్రకటనపై కొంతమంది అభిమానులు నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాని జాతీయస్థాయిలో చూపిస్తూ దానికి ఒక ప్రాముఖ్యత ఉంటే జాతీయ అవార్డు అందించాలి గాని, సినిమా రంగంలో అసలు ఏ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అవార్డులు ప్రధానం జరుగుతోందో అర్థం కావట్లేదు అంటున్నారు అభిమానులు. ముఖ్యంగా పుష్ప సినిమాకు గాను హీరోగా నటించిన అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇచ్చినందుకు బాలీవుడ్ అభిమానులు తమ వైపు నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. 

పుష్ప సినిమాకి అవార్డు: 

సినిమా రంగంలో జాతీయ అవార్డుల ప్రధానం అనంతరం చాలామంది అభిమానులు తమ భావాలను వ్యక్తం చేసేందుకు సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా పంచుకోవడం జరిగింది. కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, దౌర్జన్యాలు, ముఖ్యంగా స్మగ్లింగ్ వంటి అంశాలను స్పష్టంగా చూపించిన పుష్ప సినిమా లో నటించిన అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ ఇచ్చినందుకు చాలా మంది మండిపడుతున్నారు. పుష్ప సినిమా కన్నా గొప్ప సినిమాలు ఎన్నో ఉన్నాయి అని, ముఖ్యంగా చెప్పాలంటే సర్దార్ ఉద్దం సినిమా నేషనల్ అవార్డుకి అర్హతలు ఉన్న ఏకైక సినిమా అంటూ తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు అభిమానులు. 

అంతేకాకుండా సర్దార్ ఉదం సినిమాలో వికీ కౌశల్ నటనకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాల్సిందే అంటూ అభిప్రాయపడుతున్నారు ఫాన్స్. ఫ్రీడమ్ ఫైటర్ ఉత్తమ్ సింగ్ జీవితం ఆధారంగా తీసిన సినిమాకు అవార్డు ఇవ్వకుండా, పుష్పాలాంటి సినిమాలకి అవార్డులు ఇవ్వడంతో ప్రశ్నిస్తున్నారు అభిమానులు. మరో పక్క తమిళ ప్రేక్షకులను ఎంతో అలరించి తెలుగులో కూడా సూపర్ హిట్ అయిన జై భీమ్ సినిమాకు ఒక్క అవార్డు కూడా రాకపోవడం గమనార్హం అంటూ అభిమానులు తమ నిరాశని వ్యక్తం చేశారు. జీవితానికి సంబంధించి, భారతదేశానికి మంచి పాఠాలు నేర్పించిన సినిమాలను వదిలేసి, హత్యలు కుట్రలు దౌర్జన్యాలతో ఉన్న సినిమాలకు ఎలా ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. 

జాతీయ చలనచిత్ర అవార్డుల చరిత్ర: 

జాతీయ చలనచిత్ర అవార్డులు 1954లో “స్టేట్ అవార్డ్స్” పేరుతో ప్రారంభమయ్యాయి. అప్పట్లో వివిధ ప్రాంతీయ భాషల్లో ఉత్తమ చిత్రాలను మాత్రమే నామినేట్ చేసి అవార్డులు ఇచ్చేవారు. 1967లో, సినిమాలకు పని చేస్తున్న నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు అవార్డులు ఇవ్వడం ప్రారంభించింది. ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న మొదటి నటుడు రాత్ ఔర్ దిన్‌లో ఆమె నటనకు నర్గీస్ కాగా, ఉత్తమ్ కుమార్ ఆంటోనీ ఫిరింగీ మరియు చిరియాఖానా చిత్రాలకు ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. జాతీయ చలనచిత్ర అవార్డులలో RRR తన ఘనతను చాటి చెప్పింది. కేవలం భారత దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో RRR కి ప్రత్యేకమైన అభిమాన చోటు దక్కిందని చెప్పుకోవాలి. ఆస్కార్ గెలుచుకున్న RRR ప్రస్తుతం నేషనల్ అవార్డ్స్ లో తన హవాని చూపించింది. 

అవార్డు గ్రహీతలు: 

బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: రాకెట్రీ

ఉత్తమ దర్శకుడు నిఖిల్ మహాజన్: గోదావరి

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: RRR

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్, పుష్ప

ఉత్తమ నటి: అలియా భట్, గంగూబాయి కతియావాడి మరియు కృతి సనన్, మిమీ

సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్, పుష్ప

ఉత్తమ సంగీత దర్శకత్వం (నేపథ్య సంగీతం): MM కీరవాణి, RRR

ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్: కాల భైరవ, RRR

ఉత్తమ కన్నడ చిత్రం: 777 చార్లీ

ఉత్తమ తెలుగు చిత్రం: ఉప్పెన

ఉత్తమ బాలల చిత్రం: గాంధీ అండ్ కో

ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, RRR

ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస్ మోహన్, RRR

ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ: కింగ్ సోలోమన్, RRR