పాప్‌కార్న్ సినిమా డైరెక్ట్ చేసినందుకు సారీ:  నాజ‌ర్

నాజర్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన  అవసరమే లేదు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలో కూడా ఆయన చాలా సినిమాల్లో నటించారు. తనదైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించారు. అనేక చిత్రాల్లో ఆయన తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించారు. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ వెండితెరపై ఎంతగానో అలరిస్తూ వస్తున్నారు. యాక్టర్ గానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, ప్లేబ్యాక్‌ సింగర్‌గా కూడా వర్క్ చేస్తున్నారు నాజర్. అయితే ఇటీవలే ఆయన ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు […]

Share:

నాజర్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన  అవసరమే లేదు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలో కూడా ఆయన చాలా సినిమాల్లో నటించారు. తనదైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించారు. అనేక చిత్రాల్లో ఆయన తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించారు. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ వెండితెరపై ఎంతగానో అలరిస్తూ వస్తున్నారు. యాక్టర్ గానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, ప్లేబ్యాక్‌ సింగర్‌గా కూడా వర్క్ చేస్తున్నారు నాజర్.

అయితే ఇటీవలే ఆయన ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు మరియు తాజాగా ఆయన సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై కూడా  ఆయన స్పందించారు. 

తమిళ చిత్ర పరిశ్రమ ఇతర భాషల వాళ్లను రానివ్వడం లేదని.. తమిళ ఇండస్ట్రీలో తమిళవాళ్లే ఉండాలనే స్వభావం నుంచి వారు బయటికి రావాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన  స్పందించారు.

బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అన్ని భాషల నుంచి నటీనటులు, టెక్నీషియన్లను తెలుగు సినీ పరిశ్రమ తీసుకుంటుంది కాబట్టే RRR, బాహుబలి లాంటి సినిమాలు తీసే స్థాయికి వెళ్లిందని అన్నారు. అయితే, తమిళ చిత్ర పరిశ్రమ మాత్రం తమ ఇండస్ట్రీలో తమిళవాళ్లే ఉండాలని నిబంధన పెట్టుకున్నట్టు తాను విన్నానని.. ఇది కరెక్ట్ కాదని అన్నారు. ఇతర భాషల వాళ్లను తీసుకుంటేనే ఇండస్ట్రీ ఎదుగుతుందని వ్యాఖ్యానించారు. 

అయితే నాజర్ స్పందిస్తూ ఆయనకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు అని సినిమాల్లో ఇప్పుడు ఒక భాష అంటూ ఏం లేదని.. అన్నీ పాన్ ఇండియా సినిమాలే వస్తున్నాయని నాజర్ అభిప్రాయపడ్డారు. ఓటీటీ వినియోగం ఎక్కువైంది. ఇలాంటి టైంలో అలాంటి నిబంధనలు ఎవరు తీసుకొస్తారు. ఇతర భాషల నుంచి వచ్చిన ఎంతో మంది ఆర్టిస్టులను, టెక్నీషియన్లను తమిళ పరిశ్రమ అక్కున చేర్చుకుంది. వారిని ఆదరించింది. ఎస్వీ రంగారావు, సావిత్రి, వాణీ శ్రీ, శారదమ్మ ఇలా చాలా మంది తమిళులే అని అనుకున్నాను. చాలా కాలం తరువాత నాకు వాళ్లది ఆంధ్రా అని తెలిసింది. కాబట్టి ఇప్పుడు వస్తున్న ప్రచారానికి అర్థం లేదు అని అన్నారు 

అయితే ఇప్పుడు ఆయన  ముందుకు వచ్చి అతను చేసిన చిత్రం కోసం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో క్షమాపణలు చెప్పారు . ఒక కళాకారుడు తమ విజయవంతం కాని పనులకు బాధ్యత వహించడం చాలా అరుదు. అయితే మోహన్‌లాల్‌తో తాను తీసిన సినిమా విషయంలో నాజర్  క్షమాపణలు చెప్పారు 

తనకు, మోహన్‌లాల్‌కు మధ్య వృత్తిపరమైన సంబంధం గురించి అడిగినప్పుడు, మోహన్‌లాల్ వ్యక్తి గురించి నాజర్ వివరంగా చెప్పారు .  సూపర్ స్టార్ అనే అహం లేదని ఆయన అన్నారు.

నాసర్ ఇద్దరూ కలిసి నటించిన సినిమా నుండి ఒక ఉదాహరణను పంచుకున్నారు. ప్యాకప్ తర్వాత మోహన్‌లాల్ బయలుదేరడానికి తన కారు ఎక్కినప్పుడు జరిగిన సంఘటనను అతను గుర్తు చేసుకున్నారు . మరుసటి రోజు ఒక క్లిష్టమైన సీన్  చేయవలసి ఉంటుందని  సహాయ దర్శకుడు మోహన్‌లాల్‌తో చెప్పినపుడు వెంటనే ఆయన  కారులోంచి దిగి  మరుసటి రోజు షూట్‌కు సిద్ధం కావడానికి నోట్‌ప్యాడ్‌ను ఏర్పాటు చేసి, తన డైలాగ్‌లను రాసుకున్నారు అని ఆయన తెలిపారు 

 మోహన్‌లాల్‌తో కలిసి పనిచేసేటప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉండదని అన్నారు. మలయాళ చిత్రంలో కలిసి నటిస్తున్నప్పుడు, తనకు భాష అస్సలు తెలియదని, మోహన్‌లాల్ తనకు చాలా సహాయంచేసారని నాజర్ అన్నారు .

 ఈ బంధమే నాజర్ దర్శకత్వంలో  మోహన్‌లాల్, సిమ్రాన్ పాప్ కార్న్ మూవీ లో నటించేలా చేసింది అయితే మోహన్‌లాల్ నటించిన తన చిత్రం పాప్‌కార్న్ ఊహించిన విదంగా తియ్యలేదు అని మీడియా కి తెలిపారు . ఈ విషయానికై మీడియా ముందు మోహన్‌లాల్‌ కి క్షమాపణ చెప్పుకున్నారు .