దుల్క‌ర్ స‌ల్మాన్ ఏకైక ప్యాన్ ఇండియా స్టార్

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గురించి అందరికీ తెలిసిందే. మనోడి సినిమా వస్తుందని అంటే చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. అటువంటి నాని చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో తరచూ ఫ్యాన్స్ ను కలుస్తూ వారికి ట్రీట్ ఇస్తుంటారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇండియాలో ఎంతో మంది పాన్ ఇండియన్ స్టార్స్ ఉన్నా కానీ నాకు తెలిసిన పాన్ ఇండియన్ యాక్టర్ […]

Share:

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గురించి అందరికీ తెలిసిందే. మనోడి సినిమా వస్తుందని అంటే చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. అటువంటి నాని చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో తరచూ ఫ్యాన్స్ ను కలుస్తూ వారికి ట్రీట్ ఇస్తుంటారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇండియాలో ఎంతో మంది పాన్ ఇండియన్ స్టార్స్ ఉన్నా కానీ నాకు తెలిసిన పాన్ ఇండియన్ యాక్టర్ అతడే అంటూ నాని పేర్కొనడం గమనార్హం. 

ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా…

ఇండియాలో అనేక రకాల ఇండస్ట్రీలు ఉన్నాయి. ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా అనేక మంది పాన్ ఇండియన్ స్టార్లు పుట్టుకొస్తున్నారు. హీరోల రేంజ్ లతో సంబంధం లేకుండా అనేక మూవీలను డైరెక్టర్లు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఒక బాహుబలి,  ఒక కేజీఎఫ్ వంటి మూవీలనే పాన్ ఇండియా మూవీలు ఏ రేంజ్ లో సత్తా చాటుతున్నాయో చెప్పేందుకు నిదర్శనం. ఒకప్పుడు పాన్ ఇండియా రేంజ్ మూవీలు తక్కువగా వచ్చేవి కానీ ఇప్పుడు వాటి హవా పెరిగిందనే చెప్పాలి. చాలా ఇండస్ట్రీలలో పాన్ ఇండియా మూవీలు వస్తున్నాయి. కొత్త హీరోలతో కూడా మన దర్శక నిర్మాతలు పాన్ ఇండియా మూవీలను తెరకెక్కిస్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. వాటి రేంజ్ ఎంతలా మారిపోయిందో.. 

పొగడ్తలతో ముంచెత్తిన నాని

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న రీసెంట్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్ ఆఫ్ కోతా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు ప్రముఖ హీరో టాలీవుడ్ భల్లాలదేవుడు రానా దగ్గుబాటితో కలిసి నేచురల్ స్టార్ నాని కూడా వచ్చాడు. ఈ సందర్భంగా హీరో నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. తనకు తెలిసిన ఏకైక పాన్ ఇండియన్ స్టార్ దుల్కర్ సల్మాన్ మాత్రమే అని తెలిపాడు. ఎంతో మంది పాన్ ఇండియన్ స్టార్స్ ఉన్నా కానీ దుల్కర్ సల్మాన్ ను చూసినపుడు మాత్రమే నాకు పాన్ ఇండియా స్టార్ అతడే అని అనిపిస్తోందని నాని పేర్కొన్నాడు. 

తెలుగులోనూ దుల్కర్ స్టారే…

దుల్కర్ సల్మాన్ మలయాళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా ఈ హీరో కు మంచి మార్కెట్టే ఉంది. మహానటి మూవీతో తన సత్తా ఏంటో చూపిన దుల్కర్ తర్వాత కూడా పలు చిత్రాలతో అలరించాడు. ఆయన నటించిన కనులు కనులు దోచాయంటే మూవీ పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఎన్నో సందేశాత్మక చిత్రాల్లో నటించిన దుల్కర్ కు అనేక మంది అభిమానులు ఉన్నారు. రీసెంట్ మూవీ కింగ్ ఆఫ్ కోతా కూడా పలువురిని అట్రాక్ట్ చేస్తోంది. ఇది మలయాళ మూవీ అయినా కానీ ఇక్కడ ఓ రేంజ్ లో మార్కెట్ నడుస్తోంది. దుల్కర్ సల్మాన్ మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తనయుడు అనే విషయం తెలిసిందే. చిన్నప్పటి నుంచే స్టార్ డమ్ ను అలవాటు చేసుకున్న దుల్కర్ పెద్ద పెరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా స్టార్ గానే కొనసాగుతున్నారు. 

మిస్ ఫైర్ అయిన రానా వ్యాఖ్యలు

హైదరాబాద్ లో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నేచురల్ స్టార్ నానితో పాటు మరో హీరో టాలీవుడ్ భల్లాల దేవుడు రానా కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా రానా చేసిన వ్యాఖ్యలు మిస్ ఫైర్ అయ్యాయి. ఒక హీరోయిన్ గురించి రానా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ వ్యాఖ్యలకు రానా సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కూడా చెప్పారు. దుల్కర్ మాత్రమే తన దృష్టిలో పాన్ ఇండియా స్టార్ అని నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.