World Cup 2023: ఒకే ఫ్రేమ్‌‌లో నాని, సల్మాన్ ఖాన్

టాలీవుడ్ టు బాలీవుడ్ సెలబ్రిటీస్ సందడి..

Courtesy: Twitter

Share:

World Cup 2023: దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఒక్క నిమిషం కూడా ఫోన్ లు, టీవీలు పక్కన పెట్టకుండా సామాన్య ప్రజలంతా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్(World Cup Final) వైపే చూస్తున్నారు. ఇండియా కప్పు కొడుతుందా లేదా అని తెగ ఆసక్తిగా చూస్తుండగా.. వేలాది మంది నేరుగా మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో(Narendra Modi Stadium) జరిగిన ఈ మ్యాచ్ ను చూసేందుకు సామాన్య ప్రజలతో పాటు నాని (Nani) సల్మాన్ ఖాన్(Salman khan) ఇలా చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా వెళ్లారు. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా అనేక మంది స్టేడియంలో సందడి చేశారు. కొందరు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి మరీ రచ్చ చేశారు. 

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఫ్యామిలీతో కలిసి వెళ్లగా.. అఖిల్ అక్కినేని(Akhil Akkinen), విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), న్యాచురల్ స్టార్ నానిలు(Nani) కూడా వెళ్లారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్(Sharukh Khan), రణ్ వీర్ సింగ్(Ranveer Singh), దీపికా పదుకొణె(Deepika Padukone), అనుష్క శర్మ(Anushka Sharma), అథియా శెట్టిలు(Athiya Shetty) కూడా స్టేడియంలో దర్శనం ఇచ్చారు. అయితే వీరంతా ఒక్కో చోట కూర్చొని కనిపించగా.. టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని(Nani), బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్(Salman khan) లు మాత్రం ఒకే ఫ్రేములో కనిపించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వీరిద్దరూ కలిసి ఫొటోలు దిగారు.

అంతే కాదండోయ్ వీరిద్దరూ కలిసి కామెంటరీ రూంలో కూర్చొని ఆడియన్స్ ను ఎంటర్ టైన్చేశారు. నాని తెలుగులో(Telgu) కామెంట్రీ చేస్తుంటే సల్మాన్ ఖాన్(Salman Khan) హిందీలో కామెంట్రీ చేశారు. ఈక్రమంలోనే వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు నెట్టింట ఫుల్ వైరల్(Viral) గా మారాయి. ఇద్దరూ సింగిల్ ఫ్రేములో కనిపిస్తుంటే చాలా బాగుందంటూ నెటిజెన్లు కామెంట్లు చేశారు. కేవలం కామెంట్రీ మాత్రమే కాదండోయ్ వీరిద్దరూ సెపరేట్ గా చేసిన తాజా చిత్రాలను కూడా ప్రమోట్(Promote) చేసుకుంటున్నారు.

న్యాచురల్ స్టార్ నాని(Nani) హీరోగా రాబోతున్న చిత్రానికి వినూత్నంగా ప్రమోషన్లు చేస్తున్నారు.  నాని, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrinal Thakur) జంటగా నటించిన తాజా చిత్రం 'హాయ్ నాన్న' (Hai Nanna). తండ్రీ కూతుళ్ళ సెంటిమెంట్‌ ప్రధానంగా సాగే ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ శౌర్యువ్ దర్శకత్వంలో వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తన సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి నాని జోరుగా ప్రమోషన్స్(Promotions) చేస్తున్నారు. ఎన్నికల ఫీవర్ ను క్యాష్ చేసుకోడానికి వినూత్నమైన ఆలోచనతో వచ్చాడు. ఇందులో భాగంగానే రాజకీయ నాయకుడి గెటప్‌లోకి మారిపోయి ప్రచారం మొదలుపెట్టాడు. థియేటర్లలో మీ ఓటు మాకే వేయాలి అంటూ ట్వీట్లు పెడుతున్నాడు.  తాజాగా వరల్డ్ కప్ మ్యాచ్ లో కామెంట్రీ చేస్తూ సినిమాను ప్రమోట్ చేసుకోవడం గమనార్హం. 

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) నటించిన తాజా యాక్షన్ మూవీనే 'టైగర్ 3'(Tiger 3). సూపర్ హిట్ ఫ్రాంచైజీ మూవీలకు సీక్వెల్‌గా(Sequel) వచ్చిన ఈ చిత్రాన్ని మనీష్ శర్మ(Manish Sharma) రూపొందించాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌(Yash Raj Films banner)పై ఆదిత్య చోప్రా(Aditya chopra) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్‌కు ప్రీతమ్, తనూజ్ మ్యూజిక్ అందించారు. ఇందులో కత్రినా కైఫ్(Katrina Kaif) హీరోయిన్‌గా, ఇమ్రాన్ హస్మీ(Imran Hashmi) విలన్‌గా చేశారు.. నవంబర్ 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్సు వసూలు చేస్తున్న ఈ సినిమాను సల్మాన్ ఖాన్ ఇప్పటికీ ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం వరల్డ్ కప్ మ్యాచ్(World Cup) కోసం అహ్మదాబాద్ వెళ్లిన ఈయన.. స్టేడియంలో కామెంట్రీతో పాటు తన సినిమాను కూడా ప్రమోట్చేసుకున్నారు. ఓవైపు క్రికెట్ గురించి చెబుతూ.. మరోవైపు తన సినిమా గురించి కూడా ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.