బాలకృష్ణని పొగడ్తలతో ముంచేత్తిన కాజల్

తెలుగు సినీ ప్రేక్షకులకు కాజల్ అగర్వాల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. ఇటీవల జరిగిన భగవంత్ కేసరి ఈవెంట్ లో పాలుపంచుకున్న కాజల్ అగర్వాల్, బాలకృష్ణ గురించి మాట్లాడుతూ పొగడ్తలతో ముంచెత్తింది.  బాలకృష్ణని పొగడ్తలతో ముంచేత్తిన కాజల్:  పెద్ద సూపర్‌స్టార్ అయినప్పటికీ, బాలయ్య ఎప్పుడూ అందరితో కలుపుగోలుతనంతో స్నేహభావంతో ఉల్లాసంగా ఉంటాడు అని ‘భగవంత్ కేసరి’ కార్యక్రమంలో నటి కాజల్ అగర్వాల్ […]

Share:

తెలుగు సినీ ప్రేక్షకులకు కాజల్ అగర్వాల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. ఇటీవల జరిగిన భగవంత్ కేసరి ఈవెంట్ లో పాలుపంచుకున్న కాజల్ అగర్వాల్, బాలకృష్ణ గురించి మాట్లాడుతూ పొగడ్తలతో ముంచెత్తింది. 

బాలకృష్ణని పొగడ్తలతో ముంచేత్తిన కాజల్: 

పెద్ద సూపర్‌స్టార్ అయినప్పటికీ, బాలయ్య ఎప్పుడూ అందరితో కలుపుగోలుతనంతో స్నేహభావంతో ఉల్లాసంగా ఉంటాడు అని ‘భగవంత్ కేసరి’ కార్యక్రమంలో నటి కాజల్ అగర్వాల్ అన్నారు. అంతేకాకుండా బాలకృష్ణ ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకం అంటూ మాట్లాడింది. నందమూరి వారసత్వం, ఇలాగే విజయాలతో ఆకాశాన్ని తాకాలని ఆమె ఆకాంక్షించారు. ముఖ్యంగా ఇప్పటివరకు ఎన్నో మంచి విజయాలు సాధిస్తూ ఎంతోస్థాయికి చేరిన బాలకృష్ణ మరింత ఎత్తులకు ఎదగాలని ఆశించింది నటి కాజల్ అగర్వాల్. 

నిజానికి పెళ్లి తర్వాత, ఒక బిడ్డ పుట్టిన తర్వాత కాజల్ అగర్వాల్ చేసిన సినిమాలు అన్ని కూడా హీరోయిన్ ఓరియంటెడ్ ఉండడం చూసే ఉంటాం. అయితే ఇప్పుడు కాజల్ అగర్వాల్ మరొకసారి ప్రేక్షకుల ముందు ఒక ప్రత్యేకమైన పాత్రలో పోషించడానికి, ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ హిట్ కొట్టడానికి, బాలకృష్ణ సరసన నటించడానికి కాజల్ అగర్వాల్ మక్కువ చూపించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఆమె ‘ఖైదీ నంబర్ 150’లో మెగాస్టార్ చిరంజీవితో నటించింది. ఇటీవల సత్యభామ సినిమాతో మరొకసారి అందరినీ ఆకర్షించింది కాజల్ అగర్వాల్.

ఇంతకుముందు, కాజల్ మహేష్ బాబు (బిజినెస్‌మెన్), ఎన్టీఆర్ జూనియర్ (టెంపర్), అల్లు అర్జున్ (ఆర్య), రామ్ చరణ్ (మగధీర) వంటి బిగ్గెస్ట్ స్టార్‌లతో కలిసి పని చేసి, 10 సంవత్సరాలలో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి హీరోయిన్‌గా ఎదిగింది. 

భగవంత్ కేసరి ట్రైలర్: 

ట్రైలర్‌లో చూస్తే, ఈ చిత్రం యాక్షన్-ప్యాక్డ్ రైడ్‌గా ఉండబోతోంది, ఎందుకంటే NBK ఈ సినిమాలో ప్రత్యేకమైన ఫైట్ సీన్స్ ఉండేలా చూసినట్లు తెలుస్తోంది. సినిమాలో విలన్ గా ఉన్న అర్జున్ రాంపాల్ నటుడిని ఎదిరిస్తూ కొన్ని వైలెన్స్ డైలాగ్స్ చెప్తున్నా బాలకృష్ణ సన్నివేశాలు ట్రైలర్ లో కనిపించాయి. కాజల్ అగర్వాల్ పాత్ర కేవలం స్టార్‌ని హైప్ చేయడానికి మాత్రమే ప్రోమో వీడియోలో కనిపించినట్లు అనిపిస్తుంది.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ మరియు శ్రీలీల కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో హిందీ సినిమాల్లో ప్రధానంగా కనిపించిన అర్జున్ రాంపాల్ టాలీవుడ్ అరంగేట్రం ఇది. రాహుల్ సంఘ్వీ పాత్రలో అర్జున్ నటించనున్నాడు. ఈ చిత్రానికి సంగీతం S థమన్ అందించారు. ఈ సినిమా అక్టోబర్ 19 న సినిమాల్లో విడుదల అవుతుంది, రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరరావుతో తలపడడానికి వచ్చేస్తుంది, టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న విడుదల అవుతుంది. 

భగవంత్ కేసరిలో ప్రత్యేక ఆకర్షణ శ్రీలీల అని చెప్పుకోవచ్చు. శ్రీలీల పేరు చెప్పగానే ఇప్పుడు కుర్రకారు మనసులో రైళ్లు పరిగెడుతున్నాయి. టాలీవుడ్ లో అడుగు పెట్టిన వేళ విశేషం ఆమెకు వరసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయని చెప్పుకోవాలి. నితిన్, పోతినేని రామ్ నుంచి నందమూరి బాలకృష్ణ సినిమాల వరకు, ప్రతి సినిమాలోని శ్రీలీల తనదైన శైలిలో హీరోయిన్గా నటిస్తోంది. సెప్టెంబర్ 15న విడుదల అయిన రామ్ పోతినేని-బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘స్కంద’లో శ్రీలీల కనిపించి అందర్నీ ఆకర్షించింది. ఆమె నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’లో కీలక పాత్ర పోషిస్తుంది, ఇది అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.