ఆ విషయంలో నమ్రత సహాయం కోరిన సుధీర్ బాబు

ఈ వారం దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో క్రేజ్ ఉన్న సినిమాలు రెండు, మూడు మాత్రమే ఉన్నాయి. అందులో సుధీర్ బాబు హీరోగా నటించిన ‘మామా మశ్చీంద్ర’ ఒకటి.  ఇందులో సుధీర్ బాబు త్రిపాత్రాభినయం కనబరచడం.. అలాగే ‘మనం’ వంటి చిత్రానికి రైటర్ గా పనిచేసిన హర్షవర్ధన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. మహేష్ బాబు బావమరిది అయిన సుధీర్ బాబు ‘మామ మశ్చీంద్ర’ సినిమాపై చాలా ఆశలు […]

Share:

ఈ వారం దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో క్రేజ్ ఉన్న సినిమాలు రెండు, మూడు మాత్రమే ఉన్నాయి. అందులో సుధీర్ బాబు హీరోగా నటించిన ‘మామా మశ్చీంద్ర’ ఒకటి.  ఇందులో సుధీర్ బాబు త్రిపాత్రాభినయం కనబరచడం.. అలాగే ‘మనం’ వంటి చిత్రానికి రైటర్ గా పనిచేసిన హర్షవర్ధన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

మహేష్ బాబు బావమరిది అయిన సుధీర్ బాబు ‘మామ మశ్చీంద్ర’ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇది రివెంజ్ డ్రామా మరియు ఇందులో అతను అనేక పాత్రలు పోషించాడు. తన గత సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈ సినిమా బాగా వచ్చి తన కెరీర్‌లో మళ్లీ ట్రాక్‌లోకి రావాలని ఆయన నిజంగా కోరుకున్నారు. కాబట్టి సినిమా ప్రేక్షకులకు చేరువయ్యేలా మొదటి రోజు నుంచే వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమా ప్రదర్శించాలని కోరుకున్నాడు. ఇది అతనికి కీలకమైన చిత్రం, అందుకే విడుదలకు ఎక్కువ థియేటర్లు కావాలని కోరుకున్నాడు.

అక్టోబర్ 6న చాలా సినిమాలు విడుదల కావాల్సి ఉండగా, సుధీర్ బాబు సినిమా ‘మామ మశ్చీంద్ర’కి జంటనగరాల్లో మంచి థియేటర్లు దొరకడం కష్టమైంది. కాబట్టి, ప్రముఖ నటుడు మరియు సూపర్ స్టార్ మహేష్ బాబుకు బంధువు అయిన సుధీర్ బాబు, మహేష్ బాబు భార్య నమ్రతను సహాయం కోరాడు. దీంతో నమ్రత తన వ్యాపార భాగస్వామి అయిన సునీల్ నారంగ్ అనే ప్రసిద్ధ థియేటర్ యజమానితో మాట్లాడింది. సుధీర్ బాబు సినిమాకు మరిన్ని థియేటర్లు ఇవ్వాలని ఆమె కోరింది. సుధీర్ బాబు ఇతర చిత్రాల నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ జంట నగరాల్లో కొన్ని ఉత్తమ థియేటర్లను పొందగలిగాడు. ఎక్కువ మందిని థియేటర్లకు రప్పించేందుకు, సినిమాని మరింత ఆదరణ పొందేందుకు, రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో ప్రకటనలు, ప్రమోషన్లు చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్చేసారు. ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమాను థియేటర్లలో చూసేలా చూడాలన్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. పరశురామ్ (వృద్ధ సుధీర్ బాబు) తన చిన్నతనంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల వల్ల కఠినంగా మారిపోతాడు. ఎంతలా అంటే… ఆస్తి కోసం తన సొంత మనుషులనే చెంపేసుకునేంత.! ఈ క్రమంలో తన సొంత చెల్లెలు, ఆమె భర్త, పిల్లల్ని కూడా చంపేయమని తన అనుచరుడు దాసు (హర్షవర్ధన్)ను పంపిస్తాడు. కానీ వాళ్ళు ఎస్కేప్ అవుతారు. అటు తర్వాత పరశురామ్ కూతుర్లు పెద్దవాళ్ళు అవుతారు. ఈ క్రమంలో విశాలాక్షి (ఈషా రెబ్బా), విశాఖలో రౌడీ దుర్గ ( సుధీర్ బాబు(భారీ కాయంతో ఉండే)) సుధీర్ బాబుని ప్రేమిస్తుంది. అలాగే చిన్న కూతురు మీనాక్షి (మృణాళిని రవి) డీజే (సుధీర్ బాబు) ని ప్రేమిస్తుంది. వీరి లవ్ ట్రాక్ సాగుతూ ఉన్న టైంలో పరశురామ్ కి వీళ్ళ గురించి అసలు విషయం తెలుస్తుంది. తన పై పగతోనే తన మేనల్లుళ్లు ప్లాన్ చేసి తన కూతుర్లను ప్రేమలో పడేశారు అని భ్రమిస్తాడు. అదే టైంలో అతని పై హత్యా ప్రయత్నం కూడా జరుగుతుంది. వీటన్నిటికీ లింక్ ఏంటి? అన్నది మిగిలిన కథ.

సుధీర్ బాబు మొదటిసారి ట్రిపుల్ రోల్ ప్లే చేశాడు. తన వరకు మూడు పాత్రలకి న్యాయం చేయడానికి ట్రై చేశాడు. ఈషా రెబ్బా, మృణాళిని రవి… కొంతసేపు గ్లామర్ వలకబోశారు. హర్షవర్ధన్ ఎప్పటిలాగే తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక రాజీవ్ కనకాల, ‘మిర్చి’ కిరణ్, హరితేజ, అజయ్ వంటి వారు కూడా తమ తమ పాత్రలకి న్యాయం చేశారని చెప్పుకోవచ్చు.

రచయితగా హర్షవర్ధన్ ‘మనం”గుండెజారి గల్లంతయ్యిందే’, వంటి క్లాస్ సినిమాలకి పనిచేసి హిట్లు కొట్టాడు. డైరెక్షన్ ఛాన్స్ ఇతనికి ఎందుకు లేట్ అయ్యింది అనే అనుమానం అందరికీ వచ్చింది. ముందుగా ఇతను ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమా చేశాడు. అది రిలీజ్ కాలేదు. ‘మామా మశ్చీంద్ర’ అతని మొదటి సినిమాగా రిలీజ్ అయ్యింది. 

హర్షవర్ధన్ కి ప్లస్ పాయింట్ కామెడీ. దానిని పక్కన పెట్టేసి ఏవేవో అనవసరమైన సన్నివేశాలు తెరపైకి తెచ్చాడు. అవి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాయి అని అతను భావించి ఉండొచ్చు. కానీ కన్ఫ్యూజన్ కి గురి చేసి ఇరిటేట్ చేశాయి. ట్విస్ట్ లు కూడా థ్రిల్ చేయవు. అయితే టెక్నికల్ టీం కి మాత్రం మంచి మార్కులు పడతాయి. పీజీ విందా సినిమాటోగ్రఫీ బాగుంది, చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు. కొన్ని డైలుగులు కూడా బాగున్నాయి. నిర్మాత ఖర్చుకి వెనకాడలేదు అని ప్రతి ఫ్రేమ్ చెబుతుంది. కానీ సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు లు స్క్రిప్ట్ ల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తె బెటర్ అని టాక్. 
 అన్ని విభాగాల్లోను విఫలమైన సినిమాగా కనిపిస్తుంది. వరుస ఫ్లాపులతో కెరీర్ కొనసాగిస్తున్న సుధీర్ బాబు ఖాతాలో మరో సినిమా చేరింది. పేలవమైన కథ, కథనాలు సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లలేకపోయాయి. గెటప్స్ మీద ఉన్న శ్రద్ద ఇతర విషయాలపై చూపించకపోవడం పెద్ద మైనస్.