ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాలు..

నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయిన నేపథ్యంలో హైదరాబాద్‌ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు, అక్కినేని కుటుంబ సభ్యులు హాజరయి అక్కినేనితో తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు మహేశ్‌బాబు, నమ్రతా శిరోద్కర్, రామ్‌చరణ్‌, మోహన్ బాబు, ఎస్ఎస్ […]

Share:

నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయిన నేపథ్యంలో హైదరాబాద్‌ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు, అక్కినేని కుటుంబ సభ్యులు హాజరయి అక్కినేనితో తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు మహేశ్‌బాబు, నమ్రతా శిరోద్కర్, రామ్‌చరణ్‌, మోహన్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి, ఎం.ఎం. కీరవాణీ , నాని, మంచు విష్ణు, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్‌, జయసుధ, బ్రహ్మానందం, అల్లు అరవింద్‌, అశ్వినీదత్, దిల్‌ రాజు, మురళీమోహన్‌, సుబ్బరామిరెడ్డి, సి కళ్యాణ్, చినబాబు, నాగవంశీ, ఎస్ గోపాల్ రెడ్డి, వైవిఎస్ చౌదరి, జెమిని కిరణ్, గుణ్ణం గంగరాజు, అనుపమ్ ఖేర్, నాజర్ తదితరులు పాల్గొని అక్కినేని నాగేశ్వరరావుకి ఘన నివాళులు అర్పించారు.

నాగేశ్వరరావు గారి 100వ జయంతి

శత జయంతి సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ‘’శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు మహా నటుడు. మహా మనిషి. ఆయన అంటే నాకు చాలా అభిమానం. ఈ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది. ఆయనే నిల్చున్నారా అనేలా ఉంది. నాకు నాగేశ్వరరావు గారితో వ్యక్తిగత పరిచయం ఉంది. మహావ్యక్తి శ్రీ అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించే గౌరవం నాకు కల్పించినందుకు వారి కుటుంబ సభ్యులందరికీ అందరికీ ధన్యవాదాలు’’ అని అన్నారు.

నాగార్జున మాట్లాడుతూ ..నాన్నగారు అద్భుతమైన జీవితాన్ని గడిపారు. మీ అందరికీ నాన్న గారు అద్భుతమైన నటుడు, తరతరాలు గుర్తుపెట్టుకునే పాత్రలు చేసిన నటుడు, కోట్లమంది తెలుగు ప్రజలు ప్రేమించిన వ్యక్తి, మాకు మాత్రం నాన్న గారు మా గుండెల్లో నాన్న ప్రేమతో నింపారు. చిరునవ్వుతో మమ్మల్ని పిలిచే వ్యక్తి. సంతోషాన్ని, బాధను నాన్నతోనే పంచుకునే వాళ్ళం. ఆయనతో కూర్చుంటే అన్ని బాధలు తీరిపోయేవి. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు’’ అని అన్నారు.

ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వరరావు గారిని చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూసి ఆరాధించా, ఒకసారి ఆయనతో కలిసే అవకాశం వచ్చిందని అన్నారు.. అప్పుడు ఆయనతో ‘మిస్సమ్మ’ సినిమా ప్రస్తావన తీసుకొచ్చాను. దేవదాస్ తో పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ ఇందులో కామెడీ వేషం ఎందుకు చేశారని అడిగాను. ‘దేవదాస్ తర్వాత అన్నీ అవే తరహా పాత్రలు వస్తున్నాయి. నా ఇమేజ్ మార్చుకోకపొతే ఇబ్బంది అవుతుంది అందుకే ఆ పాత్ర చేశాను’ అని చెప్పారు. ఆయనపై ఆయనకు వున్న నమ్మకానికి చేతులు జోడించి నమస్కారం చేయాలనిపించింది. ఎన్నో విషయాలలో ఆయన మా అందరికీ ఒక స్ఫూర్తి’’ అని ఆయన అన్నారు

మోహన్ బాబు మాట్లాడుతూ ‘’తిరుపతిలో చదువుకున్న రోజుల్లో నాగేశ్వరరావు గారి వంద రోజుల సినిమా వేడుక జరుగుతుందంటే ఆయన్ని చూడటానికి వెళ్లి చొక్కాలు చించుకున్న వ్యక్తులలో నేనూ ఒకరిని, అలాంటి నాగేశ్వరరావు గారి మరపురాని మనుషులు చిత్రానికి నేను అసోసియేట్ గా పని చేశా తర్వాత అన్నపూర్ణ సంస్థలో ఎన్నో సినిమాలు చేశాను. ఇది భగవంతుని ఆశీర్వచనం, నాగేశ్వరరావు గారు ఒక గ్రంథం. మా మధ్య ఎంతో గొప్ప అనుబంధం వుంది. వారు ఎక్కడున్నా వారి ఆశీస్సులు మనకి ఉంటాయి’’ అన్నారు.

నాగచైతన్య మాట్లాడుతూ.. తాత గారు అంటే తెలుగు చిత్ర పరిశ్రమ పెద్ద, ఓ గొప్ప నటుడు, క్లాసిక్ ఐకాన్ గా పరిచయం. ఆయన చిత్రాలు, ఆయన చేసిన ప్రయోగాలు ఈ రోజుకి కూడా ప్రేరణ కలిగించే కేస్ స్టడీగా చాలా మంది ఫిల్మ్ స్కూల్స్ లో చదువుతుంటారు, అందులో నేనూ ఒకడినని అన్నారు. మనం సినిమా తాతగారితో కలసి చేయడం నా అదృష్టం. అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన ప్రతి సారి కలలు కనడంలో భయపడకూదనిపిస్తుందని, ఆయన ఎప్పుడూ నాలో ఒక దీపంలా వెలుగుతూ ఉంటారు. ఇక్కడ వచ్చిన అతిధులకు, అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు. అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా పుట్టడం నా అదృష్టం’’ అన్నారు.

అక్కినేని నాగేశ్వరరావు గురించి

నాగేశ్వరరావు గారిని, ముద్దుగా ANR అని పిలుస్తారు. అతను ఒక భారతీయ నటుడు మరియు నిర్మాత, అతను తన డెబ్బై-ఐదేళ్ల కెరీర్‌లో అనేక మైలురాయి చిత్రాలలో నటించాడు. మరియు తెలుగు సినిమా యొక్క అత్యంత ప్రముఖ వ్యక్తులలో ఒకడు అయ్యాడు. అతను 255 చిత్రాలలో నటించాడు. మరియు చిత్రాలలో రొమాంటిక్ పాత్రలకు పేరుగాంచాడు. 1970లలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్‌కు మారడంలో కీలక పాత్రధారులలో ఒకరు.

అక్కినేని నాగేశ్వరరావు 1924 సెప్టెంబర్ 20న ఆంధ్ర ప్రదేశ్‌లో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత తెలుగు సినిమాకి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. అతను కడుపు క్యాన్సర్‌తో బాధపడుతున్న తర్వాత జనవరి 22, 2014 న మరణించాడు.