విజ‌య్‌ని స‌మంత గురించి అడిగిన నాగార్జున‌

బిగ్ బాస్ ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎంతలా తిట్టుకుంటైనా చాలా మంది జనాలు బిగ్ బాస్ ను చూస్తుంటారు. అలా బిగ్ బాస్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. అందుకోసమే బిగ్ బాస్ ను స్టార్ మా విడిచి పెట్టడం లేదు. షో మీద ఎంత నెగిటివిటీ వచ్చినా కానీ టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయని ఈ షోను కంటిన్యూ చేస్తుంది. ఇక ఇప్పుడు ఈ షో ఏడో సీజన్ మనల్ని అలరించేందుకు […]

Share:

బిగ్ బాస్ ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎంతలా తిట్టుకుంటైనా చాలా మంది జనాలు బిగ్ బాస్ ను చూస్తుంటారు. అలా బిగ్ బాస్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. అందుకోసమే బిగ్ బాస్ ను స్టార్ మా విడిచి పెట్టడం లేదు. షో మీద ఎంత నెగిటివిటీ వచ్చినా కానీ టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయని ఈ షోను కంటిన్యూ చేస్తుంది. ఇక ఇప్పుడు ఈ షో ఏడో సీజన్ మనల్ని అలరించేందుకు వచ్చింది. ఈ సారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. 

మళ్లీ నాగ్ తోనే

బిగ్ బాస్ అంటే నాగార్జున… నాగార్జున అంటే బిగ్ బాస్ అనేలా పరిస్థితి మారిపోయింది. ఈ షో ఇప్పటి వరకు ఏడు సీజన్లను పూర్తి చేసుకుంటే కేవలం ఇద్దరంటే ఇద్దరు హీరోలు మాత్రమే చేశారు. అది కూడా వారు పరిస్థితిని లాక్కొచ్చారు. ఇక మిగతా అన్ని సీజన్లను మన్మధుడు నాగార్జునే మెయింటేన్ చేసుకుంటూ వస్తున్నాడు. దీంతో చూసిన వారు కూడా బిగ్ బాస్ అంటే నాగ్ నాగ్ అంటే బిగ్ బాస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ షో ఏడో సీజన్ ఈ మధ్యే అట్టహాసంగా ప్రారంభం అయింది. దీంతో అనేక మంది టీవీలకు అతుక్కుపోయారు. ఈ సారి గేమ్ లో అనేక మార్పులు తెస్తున్నట్లు నాగ్ వివరించారు. గేమ్ స్వరూపమే పూర్తిగా మారిపోతుందని తెలిపారు. 

విజయ్ సమంత ఎక్కడ?? 

ఓపెనింగ్ డే సందర్భంగా ఖుషి మూవీ హీరో విజయ్ దేవరకొండ కూడా బిగ్ బాస్ స్టేజిపై మెరిశాడు. ఇలా ఒక్కసారిగా విజయ్ దేవరకొండ రావడంతో నాగ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అంతే కాకుండా వెంటనే విజయ్ సమంత ఎక్కడ అని అడిగేశాడు. విజయ్ దేవరకొండ డ్యాన్స్ పర్ఫామెన్స్ కూడా ఇచ్చాడు. ఈ డ్యాన్స్ అయిపోగానే హోస్ట్ నాగార్జున విజయ్ తో విజయ్ మీ హీరోయిన్ సమంత ఎక్కడ అని ప్రశ్నించాడు. దీనికి విజయ్ సమాధానంగా ఆమె ప్రస్తుతం యూఎస్ లో ఉందని తెలిపాడు. అక్కడే ఖుషి ప్రమోషన్స్ మరియు మయొసైటిస్ కు చికిత్స కూడా తీసుకుంటుందని పేర్కొన్నాడు. ఆమె ఇంకా రెండు రోజులలో తిరిగి వస్తుందని విజయ్ తెలిపాడు. ఇది కేవలం మా టీవీలో మాత్రమే కాకుండా డిస్నీ+ హాట్‌స్టార్‌ లో కూడా ప్రసారం చేయబడింది. ఆమె తిరిగి వచ్చిన తర్వాత ప్రమోషన్ల కోసం ఆమె మాతో చేరుతుందని అనుకుంటున్నా అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. 

కంటెస్టెంట్స్ వీరే…. 

బిగ్ బాస్ ప్రతి సీజన్ లో అన్నీ సేమ్ గా ఉన్నా కానీ (హౌస్, టాస్క్, సీక్రెట్ టాస్క్, వంట చేసుకోవడం, బెడ్స్ మొ..) కంటెస్టెంట్స్ మాత్రం వేర్వేరుగా ఉంటారు. ఈ సారి సీజన్ కోసం కూడా స్టార్ మా కంటెస్టెంట్స్ వడపోసి సెలెక్ట్ చేసింది. ఇక ఈ 14 మంది కంటెస్టెంట్ లను స్టార్ చానల్ హౌస్ లో కి పంపించింది. ఈ సారి సందడి చేయబోయేది వీరే.. 

శివాజీ, షకీల, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, రోజా, ధామిని భట్ట, ప్రియాంక జైన్, డాక్టర్ గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, రాతిక రోజ్, సుభా శ్రీ రాయగురు, సందీప్, తేజా ఉన్నారు. వీరిలో వందరోజుల పాటు హౌస్ లో ఎవరు ఉంటారో ఎవరు ట్రోఫీని గెలుచుకుంటారో తర్వాత తెలియనుంది. 

పెళ్లయింది…. 

ఖుషి హీరోయిన్ సమంత నాగార్జున మాజీ కోడలు. సమంత నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా వీరు పేరుగాంచారు. వీరికి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి వీరు విడాకులు అనౌన్స్ చేశారు. వీరు విడాకులు అనౌన్స్ చేసి సంవత్సరాలు గడుస్తున్నా వీరు ఏ కారణం చేత విడాకులు తీసుకున్నారని ఎవరూ చెప్పడం లేదు.