నాగచైతన్యకు రెండో పెళ్లి..?

సమంత నాగచైతన్యల వివాహ బంధం ముగిసిన అనంతరం, ఇద్దరు కెరీర్ లో చాలా మార్పులు వచ్చాయి అని చెప్పుకోవచ్చు. సమంత గురించి అదే విధంగా నాగచైతన్య గురించి పలు ప్రచారాలు, రూమర్లు సోషల్ మీడియాలో ఇప్పటికి చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. నాగచైతన్య ఇటీవల శోభిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని రూమర్స్ కూడా చక్కర్లు కొట్టాయి. ఇది ఇందులో ఏది వాస్తవం.. చూద్దాం రండి.. వట్టి పుకార్లు మాత్రమే: నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే ఊహాగానాల […]

Share:

సమంత నాగచైతన్యల వివాహ బంధం ముగిసిన అనంతరం, ఇద్దరు కెరీర్ లో చాలా మార్పులు వచ్చాయి అని చెప్పుకోవచ్చు. సమంత గురించి అదే విధంగా నాగచైతన్య గురించి పలు ప్రచారాలు, రూమర్లు సోషల్ మీడియాలో ఇప్పటికి చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. నాగచైతన్య ఇటీవల శోభిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని రూమర్స్ కూడా చక్కర్లు కొట్టాయి. ఇది ఇందులో ఏది వాస్తవం.. చూద్దాం రండి..

వట్టి పుకార్లు మాత్రమే:

నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే ఊహాగానాల వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ఈ విషయం గురించి చర్చి జరుగుతుంది. వాస్తవానికి, నాగ చైతన్య తండ్రి నాగార్జున అక్కినేని తన కొడుకు మళ్లీ సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారని, మొత్తం ప్లాన్ చేస్తున్నారని కొన్ని నివేదికలు చెప్పడం కూడా జరిగింది. అయితే, ఇందులో వాస్తవం లేదు! నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కేవలం పుకారు మాత్రమేనని అతని సన్నిహిత వర్గాలు కన్ఫామ్ చేశారు. 

నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కేవలం పుకారు మాత్రమేనని ఆయన సన్నిహిత వర్గాలు కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. నిజానికి నాగచైతన్య గురించి వస్తున్న వార్తలు ఎట్టి పరిస్థితుల్లో వాస్తవం కాదు అని, ఆయన రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు అని ఆయన సన్నిహితులు వెల్లడించారు.

నాగచైతన్య వివాహ బంధం: 

సమంత రూత్ ప్రభుతో నాగ చైతన్య వివాహం చాలా కాలం పాటు కొనసాగింది. చైతన్య మరియు సమంతా రూత్ ప్రభు తమ విడిపోతున్నట్లు అక్టోబర్ 2, 2021న ప్రకటించారు, నాలుగు సంవత్సరాల వివాహానికి ముగింపు పలికారు. అప్పటి నుండి, చై సమంతతో తన సంబంధాన్ని ముగించడానికి గల కారణాల గురించి ఎక్కువగా పంచుకున్నది కూడా లేదు. అంతేకాకుండా అనంతరం, నాగ చైతన్య శోభితా ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నాడని ఆరోపించారు. వారిద్దరూ ఈ సంబంధాన్ని అధికారికంగా ధృవీకరించనప్పటికీ, పుకార్లు చుట్టుముట్టాయి, అభిమానులను చర్చించుకునేలా చేశాయి రూమర్స్. చైతన్య మరియు శోభిత చాలా ప్రేమలో ఉన్నారని, షూటింగ్ విషయాలలో కలిసి పని చేస్తూ ఎక్కువ సమయం గడుపుతున్నారని పలు వార్తలు కూడా ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. 

నాగచైతన్య సినిమాలు: 

ఇటీవల నాగచైతన్య సినిమాలు పెద్దగా కనిపించట్లేదని చెప్పుకోవాలి. నాగ చైతన్య నెక్స్ట్ సినిమా, NC23, చందూ మొండేటి రచన మరియు దర్శకత్వం వహించిన ప్రాజెక్ట్. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం శ్రీకాకుళంలో మత్స్యకారులు అనుభవించిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఈ చిత్ర బృందం ఇటీవలే ప్రీ-ప్రొడక్షన్ దశను ప్రారంభించి, స్థానిక గ్రామాల సందర్శనను ప్రారంభించింది. 

మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న సమంత: 

సినీ కెరీర్ బాగున్నా వ్యక్తిగతంగా తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. కథానాయకుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కొన్ని రోజులకే విడాకులు ఇచ్చింది. తర్వాత మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. ఈ మధ్యే తను ఈ వ్యాధి నుండి కోలుకుంటుంది. తన ట్రీట్మెంట్ కోసం సమంత మళ్ళీ ఆగస్టులో అమెరికా వెళుతుంది. సమంత త్వరగా కోలుకుంటే వెంటనే మళ్ళీ సినిమాలు ఒప్పుకుంటుంది. కానీ సమంత పూర్తిగా కోలుకోవడానికి ఒక సంవత్సరం అయినా పడుతుందని డాక్టర్లు అంటున్నారు. అందుకే సినిమాలకు ఒక సంవత్సరం బ్రేక్ ఇచ్చింది. సమంత ది చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ సినిమా కూడా నటిస్తుంది. సమంత గత సినిమాలు యశోద, శకుంతలం, ఖుషి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించాయి. అయితే తను సిటాడిల్ సిరీస్ లో కూడా నటించింది.