నాగచైతన్య పెంపుడు శునకంతో షికారులు 

నాగచైతన్య సమంతలకు ఎంతో ఇష్టమైన పెంపుడు శునకం హాష్, ఇప్పుడు విడిపోయిన జంటను కలపనుందా అంటూ అభిమానులు తమ వైపు నుంచి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. దీనంతటికీ కారణం, నాగచైతన్య పెంపుడు శునకం హాష్ ను తీసుకుని షికారుకు వెళ్లడమే. సమంతకు ఎంతో ఇష్టమైన హాష్ ఇప్పుడు నాగచైతన్య చేతిలో చూసి, అభిమానులు తమ ఆశ్చర్యాన్ని బయటపెడుతున్నారు.  మళ్లీ ఒకటి అవ్వబోతున్నారా అంటూ అభిమానులు:  చైతన్య సమంతాలకు తమ పెంపుడు జంతువు అంటే ఎంతో ఇష్టం. దానిని పెంపుడు […]

Share:

నాగచైతన్య సమంతలకు ఎంతో ఇష్టమైన పెంపుడు శునకం హాష్, ఇప్పుడు విడిపోయిన జంటను కలపనుందా అంటూ అభిమానులు తమ వైపు నుంచి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. దీనంతటికీ కారణం, నాగచైతన్య పెంపుడు శునకం హాష్ ను తీసుకుని షికారుకు వెళ్లడమే. సమంతకు ఎంతో ఇష్టమైన హాష్ ఇప్పుడు నాగచైతన్య చేతిలో చూసి, అభిమానులు తమ ఆశ్చర్యాన్ని బయటపెడుతున్నారు. 

మళ్లీ ఒకటి అవ్వబోతున్నారా అంటూ అభిమానులు: 

చైతన్య సమంతాలకు తమ పెంపుడు జంతువు అంటే ఎంతో ఇష్టం. దానిని పెంపుడు జంతువు కన్నా, తమ కుటుంబంలో ఒక సభ్యురాలుగా చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సమంత అలాగే నాగచైతన్యాల దగ్గర ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. మరో పక్కన నాగచైతన్య సమంతలు విడిపోయినప్పటికీ ఇద్దరికీ శునకం మీద ఉన్న ప్రేమ మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదని, రీసెంట్గా ఇంస్టాగ్రామ్ లో నాగచైతన్య పోస్ట్ చెబుతోంది. సమంత హాలిడేలో ఉండడంతో, నాగచైతన్య తన పెంపుడు జంతువు హాష్ ను తీసుకొని బయటికి వెళ్లినట్లు తెలుస్తోంది.

తనకు ఎంతో చక్కని వైబ్ వస్తోందని అంటూ క్యాప్షన్ పెట్టి ఇంస్టాగ్రామ్ లో నాగచైతన్య తన పెంపుడు శునకం హాష్ తో కలిసి షికారుకు వెళ్లిన ఫొటోస్ షేర్ చేసాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ మల్లి నాగచైతన్య, సమంతలు ఒక్కటవ్వబోతున్నారా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

ఇటీవల పెళ్లి ఫోటోను మళ్ళీ పోస్ట్ చేసిన సమంత: 

2017లో సమంత తన భర్త నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా పెళ్లి ఫోటో షేర్ చేస్తూ, హ్యాపీ బర్త్డే అంటూ, అనుకున్నవన్నీ సాధించాలి అంటూ,తనని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా అంటూ.. #happybirthdaychay అని సమంత రాసుకోవచ్చింది. అయితే ఇటీవల ఈ ఫోటోని మళ్లీ ఇన్స్టాలో పోస్ట్ చేయడం నేటిజెన్లకు అయోమయానికి గురి చేసినట్లు అవుతోంది. సమంత పోస్ట్ చూసిన అనంతరం ప్రతి ఒకరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మళ్లీ కలుసుకుంటున్నారా? మీ జంట అంటే మాకు ఎంతో ఇష్టం.. మీరు మళ్ళీ కలిస్తే చూడాలని ఉంది అంటూ నేటిజన్లు తమకు నచ్చిన కామెంట్స్ పెట్టారు. 

వార్తల్లో నిలిచిన నాగచైతన్య: 

నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే ఊహాగానాల వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ఈ విషయం గురించి చర్చి జరుగుతుంది. వాస్తవానికి, నాగ చైతన్య తండ్రి నాగార్జున అక్కినేని తన కొడుకు మళ్లీ సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారని, మొత్తం ప్లాన్ చేస్తున్నారని కొన్ని నివేదికలు చెప్పడం కూడా జరిగింది. అయితే, ఇందులో వాస్తవం లేదు! నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కేవలం పుకారు మాత్రమేనని అతని సన్నిహిత వర్గాలు కన్ఫామ్ చేశారు. 

నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కేవలం పుకారు మాత్రమేనని ఆయన సన్నిహిత వర్గాలు కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. నిజానికి నాగచైతన్య గురించి వస్తున్న వార్తలు ఎట్టి పరిస్థితుల్లో వాస్తవం కాదు అని, ఆయన రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు అని ఆయన సన్నిహితులు వెల్లడించారు. 

నాగచైతన్య సినిమాలు: 

ఇటీవల నాగచైతన్య సినిమాలు పెద్దగా కనిపించట్లేదని చెప్పుకోవాలి. నాగ చైతన్య నెక్స్ట్ సినిమా, NC23, చందూ మొండేటి రచన మరియు దర్శకత్వం వహించిన ప్రాజెక్ట్. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం శ్రీకాకుళంలో మత్స్యకారులు అనుభవించిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఈ చిత్ర బృందం ఇటీవలే ప్రీ-ప్రొడక్షన్ దశను ప్రారంభించి, స్థానిక గ్రామాల సందర్శనను ప్రారంభించింది.