గుంటూరు కారంతో తలబడనున్న నా సామి రంగ

వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారంతో పోటీ పడనున్న నాగార్జున కొత్త చిత్రం నా సామిరంగా. కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా టైటిల్ రివీల్ చేశారు. ఈ సినిమా పేరు నా సామిరంగా అని అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల అవుతుందని అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం సినిమా రెడీగా ఉంది. ఈ సినిమాకు విజయ్ బిన్నీ […]

Share:

వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారంతో పోటీ పడనున్న నాగార్జున కొత్త చిత్రం నా సామిరంగా. కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా టైటిల్ రివీల్ చేశారు. ఈ సినిమా పేరు నా సామిరంగా అని అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల అవుతుందని అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం సినిమా రెడీగా ఉంది. ఈ సినిమాకు విజయ్ బిన్నీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు.

మహేష్ బాబు సినిమాకు పోటీగా సినిమా విడుదల చేస్తున్న నాగార్జున: 

ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమా రిలీజ్ అవుతుండగా, ఇప్పుడు కొత్తగా నాగార్జున సినిమా కూడా దీనికి పోటీగా విడుదలవుతుంది. సంక్రాంతికి రవితేజ ఈగల్ కూడా వస్తుందని అంటున్నారు. అలాగే ప్రభాస్ కల్కి కూడా సంక్రాంతికి రెడీగా ఉందని అంటున్నారు. ఈసారి సంక్రాంతి పోటీ భారీగానే ఉంటుందనిపిస్తుంది. టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం సంక్రాంతి పోటీ భారీగానే ఉంటుంది. ఈసారి అది మరింత పెరిగింది. నాగార్జున, మహేష్ బాబు, రవితేజ, ప్రభాస్ లాంటి స్టార్లు తమ సినిమాలను సంక్రాంతికి రెడీగా ఉంచడంతో సినిమా లవర్స్ చాలా ఎక్సైట్ అవుతున్నారు.

నా సామిరంగా ఫస్ట్ లుక్ రిలీజ్ :

నాగార్జున పుట్టినరోజు సందర్భంగా నా సామిరంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో నాగార్జున గుబురు గడ్డంతో, రగ్గుడ్ హెయిర్ స్టైల్ తో ఉన్నాడు. నాగార్జున గత చిత్రం గోస్ట్ ఆశించినంత విజయం సాధించలేదు. ఇంతకుముందు కింగ్ నాగార్జున సినిమాలు అంటే భారీ హిట్లు సాధించేవి. కానీ ఈ మధ్య నాగార్జున పోటీలో కాస్త వెనుకబడ్డాడు. నా సామిరంగా సినిమాతో నాగార్జున ఆ లోటు తీరుస్తాడేమో చూద్దాం. ఏది ఏమైనా ఈ సంక్రాంతి చాలా రసవత్తరంగా ఉండబోతుంది.

టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల జోరు:

గత సంవత్సరం టాలీవుడ్ లో సంక్రాంతి సందర్భంగా వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి లాంటి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సినిమాలు అయ్యాయి. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి టాలీవుడ్ లో మంచి పోటీ ఉంటుంది. ముఖ్యంగా పెద్ద స్టార్ల సినిమాలన్నీ సంక్రాంతికి రెడీగా ఉంటాయి. ఈసారి రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా ఆ కోవలోకే వస్తాయి. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా అంటే మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి క్రేజ్ ఉన్న సినిమానే గుంటూరు కారం. ఖలేజా సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద మంచి హైప్ ఉంది. ఇక ప్రభాస్ కల్కీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్ ఈ సినిమా మీద అంచనాలు మరింత పెంచేసింది. ఇక రవితేజ నటిస్తున్న ఈగల్ సినిమా కూడా సంక్రాంతికే వస్తుంది అంటున్నారు. ఈ సినిమా టీజర్ ఈ సినిమా మీద అంచనాలు మరింత పెంచేసింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయకగా నటిస్తుండడం వల్ల ఈ సినిమా క్రేజ్ మరింత పెరిగింది. ఇక నాగార్జున నా సామిరంగా కూడా సంక్రాంతి బరిలో చేరింది. 

ఈ సంక్రాంతికి పోటీ అయితే బాగా ఉంటుందని అర్థమవుతుంది. ఈ సినిమాల్లో ఏ సినిమాలు విజేతలు అవుతాయో సంక్రాంతి వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది.