నయనతారను చూస్తుంటే గర్వంగా ఉంది : విఘ్నేష్ శివన్

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా కలిసి జంటగా నటిస్తున్న చిత్రం జవాన్. ప్రముఖ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దక్షిణాది సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా సత్తా చాటేందుకు సిద్ధం అయ్యింది.  ఈ క్రమంలోనే తన అభిమాన హీరో షారుక్ జవాన్ చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా […]

Share:

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా కలిసి జంటగా నటిస్తున్న చిత్రం జవాన్. ప్రముఖ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దక్షిణాది సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా సత్తా చాటేందుకు సిద్ధం అయ్యింది.  ఈ క్రమంలోనే తన అభిమాన హీరో షారుక్ జవాన్ చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ పై నయనతార భర్త విఘ్నేష్ శివన్ స్పందిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.

అసలు విషయంలోకి వెళ్తే తాజాగా షారుక్ ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన విగ్నేష్ నయనతారపై ప్రశంసల వర్షం కురిపించారు. నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా గర్వంగా ఉంది.. ముఖ్యంగా అభిమానిగా ఆయన నటించిన సినిమాలన్నీ చూసిన నువ్వు ఈరోజు ఆయన సినిమాలోనే ప్రధాన పాత్రలో నటిస్తున్నావు. ఇంకా మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిస్తున్నాను.. ముఖ్యంగా నువ్వు ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నావు.. ఇక నిన్ను చూసి నేను మాత్రమే కాదు మన కుటుంబ సభ్యులు అంతా కూడా చాలా గర్విస్తున్నారు అంటూ జవాన్ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూనే తన భార్యపై ప్రశంసల వర్షం కురిపించారు విఘ్నేష్ శివన్.

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్,  నయనతార , విజయసేతుపతి కీలక పాత్రలు పోషిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచీ ట్రైలర్ ను విడుదల చేయగా ఈ ట్రైలర్ కి భారీ ప్రేక్షకాదరణ లభించిన విషయం తెలిసిందే. కేవలం 24 గంటలలోనే 100 మిలియన్లకు పైగా సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది ఈ సినిమా.. ఇకపోతే ఇటీవల నయనతార గురించి కూడా షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. ఆమె చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న నటీమణి .. అందరితో చాలా గౌరవంగా ప్రేమగా ఉంటారు. ఇక ఈ సినిమాలో నయనతార పోలీస్ ఆఫీసర్ పాత్రలో చాలా స్టైలిష్ గా కనిపించనుంది అంటూ వెల్లడించారు షారుక్ ఖాన్.

ఈ సినిమా నుంచి విడుదలైన నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఆమె ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోందని మనకు అర్థమవుతుంది. ఇక ఎప్పుడు పాత్రకు తగ్గట్టుగా స్టైలిష్ గా కనిపించే  ఈమె ఈసారి జవాన్ లో అంతకుమించి స్టైలిష్ గా కనిపిస్తోందని చెప్పవచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన తెలుగు, తమిళ్ , హిందీ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇంక నయనతార కెరియర్ విషయానికి వస్తే .. 2003లో మలయాళ కుటుంబ కథ చిత్రం అయినా మనసునక్కరే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసిన ఈమె ఈ ఏడాదితో తన నటన జీవితంలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ప్రముఖ డైరెక్టర్ తన అభిమాని అయిన విగ్నేష్ శివన్  ను వివాహం చేసుకున్న ఈమె గత ఏడాది ఇద్దరూ మగ కవల పిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఒకవైపు పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూనే మరొకవైపు తన కెరియర్ లో మరింత బిజీగా మారిన నయనతార ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచినా ఆమె స్థానం ఎవరు చరపలేనిది.. అందుకోలేనిది అని చెప్పవచ్చు.