Arjun Rampal: నా అతిపెద్ద భయం అదే అంటున్న అర్జున్ రాంపాల్

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) నటించిన రీసెంట్ మూవీ భగవంత్ కేసరి (Bhagavanth Kesari). ఈ మూవీ త్వరలో రిలీజ్ అవనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 19న థియేటర్లలో ఈ మూవీ సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ (Bhagavanth Kesari pramotions) ను స్టార్ట్ చేసింది. ఈ మూవీలో బాలీవుడ్ విలక్షణ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun Rampal) నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఈ మూవీకి ఎక్కడ లేని హైప్ […]

Share:

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) నటించిన రీసెంట్ మూవీ భగవంత్ కేసరి (Bhagavanth Kesari). ఈ మూవీ త్వరలో రిలీజ్ అవనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 19న థియేటర్లలో ఈ మూవీ సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ (Bhagavanth Kesari pramotions) ను స్టార్ట్ చేసింది. ఈ మూవీలో బాలీవుడ్ విలక్షణ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun Rampal) నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఈ మూవీకి ఎక్కడ లేని హైప్ వచ్చింది. తాజాగా ఈ మూవీ బాలయ్య బాబు (Balakrishna) హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ (Unstoppable) ప్రోగ్రాం కు కూడా వెళ్లింది. ఇది మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో బతుకమ్మ జోరు కొనసాగుతున్న వేళ మూవీ యూనిట్ అందులోని ‘ఉయ్యాలో ఉయ్యాలో’ అంటూ సాగే సాంగ్ (Song) ను రిలీజ్ చేసింది. దీంతో ఈ మూవీకి ఎక్కడ లేని హైప్ వస్తోంది. 

అక్టోబర్ 19నే జాతర… 

బాలయ్య బాబు (Balakrishna) తో పాటు టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) తో పాటుగా కాజల్ అగర్వాల్ నటించిన భగవంత్ కేసరి మూవీ (Bhagavanth Kesari) ఈ నెల 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవనుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మూవీ యూనిట్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించి ఎక్కడ లేని హైప్ ను తీసుకొచ్చింది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ (Arjun Rampal) కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతడు ఇప్పటికే అనేక సార్లు మన తెలుగు రాష్ట్రాల్లో సందడి చేశారు. 

తెలంగాణ యాసలో మాస్ డైలాగ్స్

భగవంత్ కేసరి మూవీ తెలంగాణ  యాసలో ఉండనున్నట్లు మూవీ ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థం అవుతోంది. ఇక ఇక్కడి యాసలో బాలయ్య బాబు (Balakrishna) పలికిన డైలాగ్స్ ఒక రేంజ్ లో పేలాయి. ఈ ట్రైలర్ బాలయ్య (Balakrishna) ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా అందరు కామన్ ఆడియన్స్ కు కూడా పూనకాలు తెప్పించేలా ఉంది. ఈ ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ తో మూవీ యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది. ఇక ఈ మూవీకి ముందు బాలయ్య బాబు (Balakrishna) చేసిన అఖండ, వీర సింహ రెడ్డి (Veera Simha Reddy) మూవీలు పెద్ద హిట్ కావడంతో ఇక ఈ మూవీ మీద పెద్ద అంచనాలు ఏర్పడ్డాయి. అంతే కాకుండా ఈ మూవీ (Bhagavanth Kesari) కి ఆడియన్స్ పల్స్ తెలిసిన అనిల్ రావిపూడి వంటి యంగ్ డైరెక్టర్ డైరెక్షన్ వహించడంతో ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ఎలాగైనా సరే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని మేకర్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా నమ్ముతున్నారు.  

అనేక సార్లు హైదరాబాద్ కు వచ్చిన అర్జున్

ఈ మూవీలో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ (Arjun Rampal) ఇప్పటివరకు అనేక సార్లు వ్యక్తిగత కారణాల వల్ల హైదరాబాద్‌ కు వచ్చారు. అయినా కానీ ఈ యాక్టర్ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క సౌత్ మూవీలో కూడా నటించలేదు. కానీ మొట్టమొదటి సారిగా అతను భగవంత్ కేసరి (Bhagavanth Kesari) చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ షూటింగ్ ను అర్జున్ (Arjun Rampal) ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఈ మూవీలో యాక్ట్ చేయడం తనకు చాలా గొప్పగా అనిపించిందని తెలిపిన అర్జున్.. మన హైదరాబాద్ నగరాన్ని కూడా మెచ్చుకున్నాడు. ఈ సిటీతో తాను ఇట్టే ప్రేమలో పడ్డానని తెలిపాడు. ఇక అర్జున్ కు (Arjun Rampal) హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. దీని గురించి అతడు మాట్లాడుతూ.. నేను ఆహార ప్రియున్ని అని తెలిపారు. తాను తినేటపుడు కేలరీల గురించి అస్సలుకే ఆలోచించనని అతడు తెలిపాడు. ఇంకా అతడు మాట్లాడుతూ… భగవంత్ కేసరి (Bhagavanth Kesari) మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి సంప్రదించాడని తెలిపాడు. అతడు బాలకృష్ణ (Balakrishna) నటించిన భగవంత్ కేసరిలో ఒక పాత్ర కోసం తనను సంప్రదించినపుడు తనకు లాంగ్వేజ్ (Language) గురించే భయం వేసిందన్నాడు. 

డైరెక్టర్ ను అదే కోరా… 

అనిల్ రావిపూడి (Anil Ravipudi) తనను సంప్రదించినపుడు తనకు ముందుగా డైలాగులు ఇవ్వమని డైరెక్టర్ ను అడిగినట్లు తెలిపాడు. బాలకృష్ణతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని అర్జున్ (Arjun Rampal) తెలిపాడు. ఇంకా టీజర్ గురించి అతడు మాట్లాడుతూ.. సినిమా టీజర్ చూడటానికి థియేటర్‌ కి వెళ్లినపుడు.. బాలయ్య (Balakrishna) ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి తాను ఆశ్చర్యపోయాయని అర్జున్ రాంపాల్ (Arjun Rampal) తెలిపాడు.  తెలుగు సినిమాలు హిందీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుండగా దక్షిణాదిలో పలువురు హిందీ నటీనటులు పనిచేస్తున్నారు. ఈ విషయం గురించి అర్జున్ (Arjun Rampal) మాట్లాడుతూ.. ఇది చాలా గొప్ప పనిణామం అని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. ఇక ఈ మూవీలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ… చాలా గొప్పగా వచ్చిందని పేర్కొన్నాడు. ఈ మూవీలో ఫుల్ బిజీ యాక్టర్ శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా కాకుండా బాలయ్య బాబు (Balakrishna) కు కూతురుగా నటిస్తుండడం విశేషం. కాజల్  అగర్వాల్ బాలయ్య పక్కన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీకి థమన్ సంగీతం అందించాడు.