మృణాల్ ఠాకూర్ రెమ్యూనరేషన్ వింటే షాక్ అవుతారు!

సీతారామం సినిమాతో ప్రేక్షకుల ఆధారభిమానాలు దక్కించుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఇప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కులు మృణాల్‌ను సీత అనే పిలుస్తారు. హిందీ సీరియల్స్ అలాగే సినిమాల్లో నటించిన మృణాల్, సీతారామం సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది. అయితే ప్రస్తుతం, మృణాల్ తన రెమ్యూనరేషన్ అమౌంట్ పెంచేసినట్లు తెలుస్తోంది. అమాంతం పెంచేసిన పారితోషకం:  ముఖ్యంగా హిందీ సీరియల్స్ తో అలరించి, తెలుగులో అడుగుపెట్టిన మృనాల్ ఠాకూర్, తన నటనతో సీతారామం సినిమాతో అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా […]

Share:

సీతారామం సినిమాతో ప్రేక్షకుల ఆధారభిమానాలు దక్కించుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఇప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కులు మృణాల్‌ను సీత అనే పిలుస్తారు. హిందీ సీరియల్స్ అలాగే సినిమాల్లో నటించిన మృణాల్, సీతారామం సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది. అయితే ప్రస్తుతం, మృణాల్ తన రెమ్యూనరేషన్ అమౌంట్ పెంచేసినట్లు తెలుస్తోంది.

అమాంతం పెంచేసిన పారితోషకం: 

ముఖ్యంగా హిందీ సీరియల్స్ తో అలరించి, తెలుగులో అడుగుపెట్టిన మృనాల్ ఠాకూర్, తన నటనతో సీతారామం సినిమాతో అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా తన సినీ కెరీర్ ను చాలా చక్కగా మలుచుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ‘హాయ్ నాన్న’ అనే సినిమా లో నటించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో నాని హీరోగా ప్రధాన పాత్రలో నటించారు. మరి ఈ సినిమాకు గాను పారితోషకాన్ని అందుకున్న సీతారామం హీరోయిన్, రెండున్నర కోట్లు వరకు తీసుకున్నట్లు సమాచారం. 

మృనల్ ఠాకూర్ మేనేజర్ ప్రస్తుతం తన రాబోయే సినిమా గురించి 3 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మృనాల్ తెలుగులో చేసినవి ఎక్కువ సినిమాలు కానప్పటికీ పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అనేది డిమాండ్ చేయడం.. ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది..ప్రొడక్షన్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, టాలీవుడ్ కి తెలుగు చక్కగా మాట్లాడే హీరోయిన్స్ కావాలి అని, అయితే నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్స్ కు డిమాండ్ ఈ విధంగానే ఉంటుందని, అందుకే వాళ్ళ మేనేజర్స్ కూడా కమిషన్ పేరుతో ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం అందించారు. అంతేకాకుండా మృనల్ ఠాకూర్ మేనేజర్ మునుపు రష్మిక మందన, ఇప్పుడు శ్రీలీలాకు కూడా మేనేజర్ గా పని చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు మధుసూదన్. 

అంతేకాకుండా రష్మిక మందానకి మేనేజర్ గా పని చేసిన అదే వ్యక్తి, ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం వల్ల రష్మిక కొన్ని సినిమాలకు దూరమైందని కూడా సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు మృనల్ ఠాకూర్ కి కూడా మేనేజర్ గా పని చేస్తున్న అదే వ్యక్తి తమ హీరోయిన్ల వైపు నుంచి ఎక్కువ రెమ్యూనిరేషన్ డిమాండ్ చేస్తున్న వైనం కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో.. మంచి హిట్స్.. సీతారామం హీరోయిన్ అందుకోగలతా లేదా చూడాల్సి ఉంది.

రవితేజ సరసన మృనాల్: 

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఇంతకుముందు డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి సినిమాలు వచ్చాయి. అవన్నీ హిట్ సినిమాలే. ప్రస్తుతం మరో సినిమా రవితేజ, గోపీచంద్ మలినేని కోమ్బోలో వస్తున్నట్లు  తెలిసిన విషయమే. దీని గురించి రవితేజ కూడా తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ సినిమాలో కొంతమంది హీరోయిన్లు పేర్లు వినిపించినప్పటికీ, ప్రస్తుతం మృనాల్ ఠాకూర్ ఈ సినిమాలో భాగం అవుతున్నట్లు తెలుస్తోంది. ఒక మల్టీ షేడ్స్ ఉన్న పాత్రకు, మృణాలు కరెక్ట్ గా సరిపోతుందని నిర్మాత పేర్కొన్నారు.

మృనాల్ ఠాకూర్ గురించి మరింత: 

ప్రస్తుతం మృనాల్ ఠాకూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనంతరం, సీతారామం సినిమాతో హిట్ కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నాని, విజయ్ దేవరకొండ, హీరోల సరసన కూడా తనదైన శైలిలో నటించడానికి, వారితో కొన్ని సినిమాలు సైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రవితేజ గోపీచంద్ సినిమాలో కూడా మృనాల్ ఠాకూర్ నటించబోతోంది. మరో పక్క బాలీవుడ్ లో కూడా మృనాల్ ఠాకూర్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.’ఆంఖ్ మే చోలీ’, ‘పూజ మేరీ జాన్’, ‘పిప్ప’ వంటి సినిమాల్లో నటిస్తోంది మృనాల్ ఠాకూర్.