రవితేజ సినిమాలో మృనాల్ ఠాకూర్

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఇంతకుముందు డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి సినిమాలు వచ్చాయి. అవన్నీ హిట్ సినిమాలే. ప్రస్తుతం మరో సినిమా రవితేజ, గోపీచంద్ మలినేని కోమ్బోలో వస్తున్నట్లు  తెలిసిన విషయమే. దీని గురించి రవితేజ కూడా తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ సినిమాలో కొంతమంది హీరోయిన్లు పేర్లు వినిపించినప్పటికీ, ప్రస్తుతం మృనాల్ ఠాకూర్ ఈ సినిమాలో భాగం అవుతున్నట్లు తెలుస్తోంది. ఒక మల్టీ షేడ్స్ ఉన్న పాత్రకు, మృణాలు కరెక్ట్ గా […]

Share:

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఇంతకుముందు డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి సినిమాలు వచ్చాయి. అవన్నీ హిట్ సినిమాలే. ప్రస్తుతం మరో సినిమా రవితేజ, గోపీచంద్ మలినేని కోమ్బోలో వస్తున్నట్లు  తెలిసిన విషయమే. దీని గురించి రవితేజ కూడా తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ సినిమాలో కొంతమంది హీరోయిన్లు పేర్లు వినిపించినప్పటికీ, ప్రస్తుతం మృనాల్ ఠాకూర్ ఈ సినిమాలో భాగం అవుతున్నట్లు తెలుస్తోంది. ఒక మల్టీ షేడ్స్ ఉన్న పాత్రకు, మృణాలు కరెక్ట్ గా సరిపోతుందని నిర్మాత పేర్కొన్నారు.

సినిమా గురించి ట్విట్టర్ లో తెలిపిన రవితేజ : 

ఇటీవల రవితేజ కూడా తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. మా కాంబినేషన్లో నాలుగో సినిమా వస్తుంది. గోపీచంద్ తో కలిసి పనిచేయడం నాకు ఆనందంగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో పనిచేయడం ఇంకా ఆనందంగా ఉందని తెలియజేశాడు. ఈ సినిమా మంచి హిట్ సినిమా అవుతుందని రవితేజ పేర్కొన్నాడు. రవితేజ ఇంతకు ముందు గోపీచంద్ మలినేని తో  కలిసి చేసిన సినిమాలన్నీ హిట్లే. ఒక విధంగా చెప్పాలంటే కెరీర్ లో కాస్త వెనకబడ్డ ప్రతిసారి గోపీచంద్ మలినేని, రవితేజకు హిట్ ఇస్తున్నాడు. రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్. ఈ సినిమా కోసం మాస్ మహారాజా తన లుక్ ని కంప్లీట్ గా మార్చుకున్నాడు. ఈ సినిమాకు డైరెక్టర్ వంశీ. టైగర్ నాగేశ్వరరావు రవితేజ నటిస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఈ సినిమా తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లు. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ దీన్ని నిర్మిస్తుంది. 

మృనాల్ ఠాకూర్ గురించి మరింత: 

ప్రస్తుతం మృనాల్ ఠాకూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనంతరం, సీతారామం సినిమాతో హిట్ కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నాని, విజయ్ దేవరకొండ, హీరోల సరసన కూడా తనదైన శైలిలో నటించడానికి, వారితో కొన్ని సినిమాలు సైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రవితేజ గోపీచంద్ సినిమాలో కూడా మృనాల్ ఠాకూర్ నటించబోతోంది. మరో పక్క బాలీవుడ్ లో కూడా మృనాల్ ఠాకూర్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.’ఆంఖ్ మే చోలీ’, ‘పూజ మేరీ జాన్’, ‘పిప్ప’ వంటి సినిమాల్లో నటిస్తోంది మృనాల్ ఠాకూర్.

రవితేజ సినీ కెరీర్:

రవితేజ ఫ్రెండ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ సినిమాలు నటించాడు. ఈ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలే. ఇడియట్ అయితే రవితేజ కెరీర్నే మార్చేసింది. రవితేజ కెరీర్ ఇడియట్ కి ముందు ఇడియట్ తర్వాత అన్న విధంగా మారింది. ఆ తర్వాత కూడా రవితేజతో పూరి జగన్నాథ్ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి అనే సినిమా తీసి మంచి హిట్ ఇచ్చాడు. రవితేజని హీరోగా నిలబెట్టింది పూరి జగన్నాథ్ అంటే అతిశయోక్తి కాదు. రవితేజ పూరి జగన్నాథ్ కాంబినేషన్ మళ్లీ రావాలని కోరుకుందాం. రవితేజ ఇప్పుడు పెద్ద స్టార్. తనకు లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో తను నటించిన ధమాకా బ్లాక్ బస్టర్. ఆ తర్వాత డిఫరెంట్ గా ట్రై చేసిన రావణాసుర ఫ్లాప్ అయింది. కానీ రావణాసుర సినిమా చాలా బాగుంటుంది. ఇప్పుడు తను నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ రెడీగా ఉంది. ఈ సినిమా పాన్ ఇండియన్ లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి రవితేజని మరో పాన్ ఇండియన్ స్టార్ని చేయాలని మనం కోరుకుందాం.