అభిమానులకు థాంక్స్ చెప్పిన “సీత‌”

సీతారామం సినిమాతో సీత గా ప్రేక్షకుల ఆధారభిమానాలు దక్కించుకున్న హీరోయిన్ మృణాల్ ఠాగూర్. ఇప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కులు మృణాల్‌ను సీత అనే పిలుస్తారు. హిందీ సీరియల్స్ అలాగే సినిమాల్లో నటించిన మృణాల్, సీతారామం సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది. అయితే ప్రస్తుతం, తనని ఎంతగా అభిమానించిన అభిమానుల గురించి ఒక ప్రత్యేకమైన పోస్ట్ చేసింది.  పోస్ట్ లో ఏముంది:  హిందీ సీరియల్స్ అలాగే సినిమాల్లో నటించిన మృణాల్, సీతారామం సినిమాతో తెలుగు సినీ రంగంలోకి […]

Share:

సీతారామం సినిమాతో సీత గా ప్రేక్షకుల ఆధారభిమానాలు దక్కించుకున్న హీరోయిన్ మృణాల్ ఠాగూర్. ఇప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కులు మృణాల్‌ను సీత అనే పిలుస్తారు. హిందీ సీరియల్స్ అలాగే సినిమాల్లో నటించిన మృణాల్, సీతారామం సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది. అయితే ప్రస్తుతం, తనని ఎంతగా అభిమానించిన అభిమానుల గురించి ఒక ప్రత్యేకమైన పోస్ట్ చేసింది. 

పోస్ట్ లో ఏముంది: 

హిందీ సీరియల్స్ అలాగే సినిమాల్లో నటించిన మృణాల్, సీతారామం సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది. అయితే ప్రస్తుతం, తనని ఎంతగా అభిమానించిన అభిమానుల గురించి ఒక ప్రత్యేకమైన పోస్ట్ చేసింది. సీతారామం సినిమా తెలుగులో ఎంత హిట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. అందులో హీరో దిల్కర్ సల్మాన్ నటించగా, హీరోయిన్గా మృనాల్ టాకూర్ మొట్టమొదటిగా నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. తన సినీ రంగా కలను నిజం చేస్తూ, తను తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది. అయితే తన కలలను నిజం చేస్తూ, తన మొదటి సినిమాలోనే తనని అభిమానులు ఎంతగా ఆదరించారో గుర్తు చేసుకుంది. అంతేకాకుండా తనకి ఈ అభిమానులను చూపించిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పింది. 

తనని ఒక తెలుగు అమ్మాయిగా చూడాలనుకున్న ప్రతి ఒకరునీ గుర్తు చేసుకుంటూ, తను తెలుగు సినీ రంగంలో ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా అభిమానులు, వారు చూపించే ఆదరణ ఇదే విధంగా ఉండాలి అంటూ కోరుకుంటూ, తన అభిమానుల అందరికీ తన వైపు నుంచి కృతజ్ఞతలు తెలిపింది. వారు చూపించే ఆదరణతో ఇంకాస్త ఉత్సాహాన్ని నింపుకొని, తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా తాను డిఫరెంట్ క్యారెక్టర్స్ లో, మంచి సినిమాలలో త్వరలోనే తమ ముందుకు వస్తామని మాటిస్తోంది మృనాల్. 

అదేవిధంగా తాను సీతారామం సినిమాలో, అంత బాగా నటించడానికి కారణమైన డైరెక్టర్ హను రాఘవపూడి కి కూడా తన కృతజ్ఞతలు తెలిపింది మృనాల్. తనలో ఉన్న కలను బయటికి తీసి సినిమాకి అనుగుణంగా మార్చి, మొదటి సినిమాలోనే తనని ఒక గొప్ప నాయకిగా మార్చిన డైరెక్టర్ హను రాఘవపూడితో మరెన్నో సినిమాలు తీయాలని కోరుకుంటుంది మృణాల్ ఠాగూర్.

రవితేజ సరసన మృనాల్: 

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఇంతకుముందు డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి సినిమాలు వచ్చాయి. అవన్నీ హిట్ సినిమాలే. ప్రస్తుతం మరో సినిమా రవితేజ, గోపీచంద్ మలినేని కోమ్బోలో వస్తున్నట్లు  తెలిసిన విషయమే. దీని గురించి రవితేజ కూడా తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ సినిమాలో కొంతమంది హీరోయిన్లు పేర్లు వినిపించినప్పటికీ, ప్రస్తుతం మృనాల్ ఠాకూర్ ఈ సినిమాలో భాగం అవుతున్నట్లు తెలుస్తోంది. ఒక మల్టీ షేడ్స్ ఉన్న పాత్రకు, మృణాలు కరెక్ట్ గా సరిపోతుందని నిర్మాత పేర్కొన్నారు.

మ‌న సీత‌ గురించి మరింత: 

ప్రస్తుతం మృనాల్ ఠాకూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనంతరం, సీతారామం సినిమాతో హిట్ కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నాని, విజయ్ దేవరకొండ, హీరోల సరసన కూడా తనదైన శైలిలో నటించడానికి, వారితో కొన్ని సినిమాలు సైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రవితేజ గోపీచంద్ సినిమాలో కూడా మృనాల్ ఠాకూర్ నటించబోతోంది. మరో పక్క బాలీవుడ్ లో కూడా మృనాల్ ఠాకూర్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.’ఆంఖ్ మే చోలీ’, ‘పూజ మేరీ జాన్’, ‘పిప్ప’ వంటి సినిమాల్లో నటిస్తోంది మృనాల్ ఠాకూర్.