Rashmika: రష్మికకు మద్దతుగా నిలుస్తున్న తారలు

Rashmika: పాన్ ఇండియా మూవీ పుష్పతో ఎక్కడ లేని క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ రష్మిక (Rashmika) మందన్నకు సంబంధించిన ఒక మార్ఫ్ డ్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ మార్ఫ్ డ్ వీడియో దేశం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మరీ సినీ  తారల జీవితాలను ఇలా చేస్తారా అని అందరూ ఆలోచించేలా చేసింది. ఎవరో బ్రిటీష్ భామ బాడీకి నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన్న ముఖాన్ని జోడించి మార్ఫ్ […]

Share:

Rashmika: పాన్ ఇండియా మూవీ పుష్పతో ఎక్కడ లేని క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ రష్మిక (Rashmika) మందన్నకు సంబంధించిన ఒక మార్ఫ్ డ్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ మార్ఫ్ డ్ వీడియో దేశం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మరీ సినీ  తారల జీవితాలను ఇలా చేస్తారా అని అందరూ ఆలోచించేలా చేసింది. ఎవరో బ్రిటీష్ భామ బాడీకి నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన్న ముఖాన్ని జోడించి మార్ఫ్ డ్ వీడియోను తయారు చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఈ ఘటన మీద కేంద్ర ఐటీ శాఖ కూడా సీరియస్ అయింది. మరీ ఇలా చేయడంపై అనేక వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై అనేక మంది సినీ ప్రముఖులు రష్మికకు (Rashmika) తమ మద్దతును తెలియజేస్తున్నారు. అంతే కాకుండా ఈ ఘటనను అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. 

పెరుగుతున్న సెలబ్రెటీల లిస్ట్

నేషనల్ క్రష్ రష్మిక (Rashmika)కు మద్దతుగా నిలిచే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుకుంటూ పోతుంది. ఈ వీడియో బయటికొచ్చిన సమయంలో బాలీవుడ్ (Bollywood) సూపర్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మొదట ఈ చర్యను ఖండించారు. తర్వాత అనేక మంది ఈ మార్ఫ్ డ్ వీడియోకు సంబంధించి తమ వైఖరిని బయటపెడుతున్నారు. రష్మికకు (Rashmika) రోజురోజుకూ మద్దతు (Support) పెరుగుతోంది. ఇలా టెక్నాలజీని (Technology) దుర్వినియోగం చేయడం సరికాదని అంటున్నారు. ఈ ఘటనపై సీరియస్ అయిన కేంద్ర ఐటీ శాఖ పలు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. 

Also Read: Rashmika: రష్మిక డీప్ ఫేక్ వీడియోపై జరా పటేల్ స్పందనిదే

ఇది అవమానం

నేషనల్ క్రష్ రష్మికపై ఇలా సైబర్ దాడి జరగడంపై టాలీవుడ్ సీత మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి మృణాల్ ఠాకూర్ తన ఇన్‌ స్టాగ్రామ్ (Instagram) స్టోరీస్‌ లో స్ట్రాంగ్ నోట్ రాసింది. ఇలాంటి వాటిని ఆశ్రయించే వ్యక్తులు సిగ్గుపడాలని ఘాటుగా (Hot Comments) వ్యాఖ్యానించింది.  అలాంటి వారిలో మనస్సాక్షి అస్సలు ఉండదని ఈ ఘటన చూపిస్తుందని తెలిపింది. మనం మౌనంగా ఉండడం సమస్యకు (Problem) పరిష్కారం కాదని తెలిపింది. ప్రతిరోజు స్త్రీ, నటీనటుల యొక్క మార్ఫ్ చేయబడిన, సవరించబడిన వీడియోలు ఇంటర్నెట్‌ (Internet) లో వైరల్ అవుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. బాడీలోని కొన్ని పార్ట్స్ (Parts) ను జూమ్ చేస్తూ సర్క్యులేట్ చేస్తున్న ఈ వీడియోలు చూసినపుడు ఎంతో బాధ కలుగుతోందని తెలిపింది. ఇది కేవలం బయటి వారికి మాత్రమే అవుతుందని అనుకోవద్దని, ఈ సమస్య ఎప్పుడో ఒకప్పుడు మనదాకా వస్తే సమస్య తీవ్రత మనకు అర్థం అవుతుందని వెల్లడించింది. కేవలం మృణాల్ అని మాత్రమే కాకుండా అనేక మంది ప్రముఖులు కూడా రష్మిక(Rashmika)కు తమ సంఘీభావం తెలుపుతున్నారు. 

ఖండించిన చిన్మయి.. 

ఈ ఘటనపై సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi) కూడా స్పందించారు. ఆమె ఇందుకు సంబంధించి ట్విటర్ (ఎక్స్) ఖాతాలో ఒక పోస్ట్ చేసింది. చాలా రోజుల క్రితం ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో (Movie) వచ్చినట్లే ఇప్పుడు రష్మికకు సంబంధించిన వీడియో కూడా  డీప్ ఫేక్ వీడియో (Deep Fake Video) అని చిన్మయి తెలిపింది. ఇప్పుడు టెక్నాలజీ అనేది బ్లాక్‌ మెయిల్ (Block mail) చేయడానికి ఉపయోగించే తదుపరి ఆయుధంగా మారబోతోందని ఆందోళన  వ్యక్తం చేసింది. అమ్మాయిల శరీర భాగాలను హైలెట్ చేస్తూ మార్ఫ్ డ్ వీడియోలు సర్క్యులేట్ (Circulate) చేయడం తగదని ఆమె హితవు పలికారు. 

బాలీవుడ్ లో రష్మిక

రష్మిక (Rashmika) ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) సరసన యానిమల్ (Animal) అనే సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ను మూవీ యూనిట్ స్పీడప్ చేసింది. ఈ మూవీకి ఇప్పటికే ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఇంకా కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుందని  అనుకుంటుండగా.. ఇప్పుడు రష్మిక (Rashmika)కు సంబంధించిన వీడియో ఇలా నెట్టింట్లో దర్శనం ఇవ్వడంతో అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇది మార్ఫ్ డ్ వీడియో  (Morphed Video) అని వెంటనే తెలిసింది కాబట్టి అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అదే విషయం తెలియకపోతే భారీ నష్టం జరిగి ఉండేది. రష్మిక (Rashmika) ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఆమె నటించిన పలు భారీ చిత్రాలు కూడా విడుదలకు సిద్దం అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఇలాంటి వీడియో బయటికి రావడం ఆ సినిమాలతో పాటు రష్మిక (Rashmika)కు కూడా మైనస్ (Minus) అయ్యేది.