భారీగా ఖర్చు పెడుతున్న స్టార్ ప్రొడ్యూసర్

అదేదో మూవీలో బావ కళ్లల్లో ఆనందం చూడడం కోసం నేను ఏం చేయడానికైనా రెడీ అని ప్రకాశ్ రాజ్ అంటాడు. బావా అంటే అలా గౌరవం ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయింది. బావ కళ్లల్లో ఆనందం చూడడం పక్కన పెడితే.. ఓ బావ తన బామ్మర్ధి కళ్లల్లో ఆనందం చూడడం కోసం భారీగా ఖర్చు పెడుతున్నాడు. అతడే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి. జయజానకి నాయక, అఖండ వంటి […]

Share:

అదేదో మూవీలో బావ కళ్లల్లో ఆనందం చూడడం కోసం నేను ఏం చేయడానికైనా రెడీ అని ప్రకాశ్ రాజ్ అంటాడు. బావా అంటే అలా గౌరవం ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయింది. బావ కళ్లల్లో ఆనందం చూడడం పక్కన పెడితే.. ఓ బావ తన బామ్మర్ధి కళ్లల్లో ఆనందం చూడడం కోసం భారీగా ఖర్చు పెడుతున్నాడు. అతడే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి. జయజానకి నాయక, అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్లను అందించిన మిర్యాల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలోని ద్వరకా క్రియేషన్స్ తాజాగా పెదకాపు-1 అనే సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ మూవీలో మిర్యాల రవీందర్ రెడ్డి సతీమణి సోదరుడు విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. స్టార్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. విరాట్ కర్ణకు ఇది తొలి మూవీయే అయినా కానీ ఈ మూవీని ఏస్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తుండడడంతో అందరి కళ్లు ఈ సినిమా మీద పడ్డాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ ట్రైలర్ కూడా దుమ్ము రేపుతోంది. యాక్షన్ సీన్స్ తో ఉన్న ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియా వీడియో ప్లాట్ ఫాం యూ ట్యూబ్ లో అదరగొడుతోంది. ఈ ట్రైలర్ ను చూసిన వారంతా అందులో చూపించిన యాక్షన్ సీన్స్ కు ఫిదా అవుతున్నారు. 

కొత్త హీరో అయినా రూ. 10 కోట్లు

కొత్త హీరోలతో మూవీలు తీసేందుకు ప్రొడ్యూసర్లు వెనకా ముందు ఆడుతుంటారు. వారి మూవీలపై బడ్జెట్ ఖర్చు చేసేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. కానీ అటువంటిది మిర్యాల రవీందర్ రెడ్డి మాత్రం విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న పెద కాపు-1 సినిమా కోసం దాదాపు రూ. 10 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. విరాట్ కర్ణ స్వయాన రవీందర్ రెడ్డి సతీమణి సోదరుడు కావడం మరో విశేషం. అందుకోసమే రవీందర్ రెడ్డి ఇంతలా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. రవీందర్ రెడ్డి జయ జానకి నాయక, అఖండ ఇండస్ట్రీ హిట్లను అందించారు. అటువంటిది ఇప్పుడు అనామకుడైన విరాట్ కర్ణ ను యాక్షన్ హీరోగా నిలబెట్టేందుకు కంకణం కట్టుకున్నారు. టాలీవుడ్‌ లో అతడు హీరోగా నిలదొక్కుకునేందుకు పెద కాపు-1 కి భారీగా ఖర్చు పెట్టాడు. ఈ వార్త విన్న సినీ ఇండస్ట్రీ వారు ముక్కున వేలేసుకుంటున్నారు. వామ్మో ఈ ఖర్చు ఏంటని గుసగుసలాడుకుంటున్నారు. 

ఇప్పటికే చాలా కుటుంబాలు

టాలీవుడ్ హీరో అయేందుకు, ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకునేందుకు ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల వారసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఈ పోటీ మరీ తీవ్రతరం అయిపోయింది. ఇటువంటి నేపథ్యంలో మిర్యాల రవీందర్ రెడ్డి తన బామ్మర్ధి కోసం రూ. 10 కోట్లు వెచ్చించి యాక్షన్ సినిమా తీయడం గమనార్హం. తన భార్య సోదరుడిని యాక్షన్ హీరోగా నిలబెట్టడానికి రవీందర్ రెడ్డి ఘోరంగా తాపత్రయ పడుతున్నాడు. ఏకంగా రూ. 10 కోట్లు ఖర్చు చేశాడు. త్వరలో రిలీజ్ కానున్న పెదకాపు-1 మూవీ ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో.. ఈ మూవీని ఏస్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించారు. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇదో న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ లా కనిపిస్తుంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. పెద కాపు-1 అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా అని టీజర్, ట్రైలర్ ల ద్వారానే స్పష్టంగా తెలుస్తోంది. ఈ మూవీకి చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీని అందించారు. కాగా మిక్కీ జె. మేయర్ స్వరాలు సమకూర్చిన ఈ మూవీ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మరి మిర్యాల రవీందర్ రెడ్డి రూ. 10 కోట్లు అనామక హీరోగా మీద ఖర్చు చేసి ఒక సాహసం చేశారనే చెప్పాలి. మరి మిర్యాల చేసిన సాహసం ఫలించి విరాట్ యాక్షన్ హీరోగా సెటిల్ అవుతాడో లేక ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ జనాలు మర్చిపోయిన హీరోల జాబితాలో చేరిపోతాడో సెప్టెంబర్ 29న తేలనుంది.