ఓటిటిలో మైఖేల్ మూవీ 

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ మైకేల్. రంజిత్ జయకోడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దివ్యాంక కౌషిక్ హీరోయిన్. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని కరణ్ సి ప్రొడక్షన్, వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.  సందీప్‌ కిష‌న్ కమర్షియల్ సక్సెస్ కోసం పోరాడుతున్నాడు. ఎంతో టాలెంట్, మంచి లుక్స్ ఉన్నప్పటికీ కమర్షియల్ […]

Share:

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ మైకేల్. రంజిత్ జయకోడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దివ్యాంక కౌషిక్ హీరోయిన్. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని కరణ్ సి ప్రొడక్షన్, వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

 సందీప్‌ కిష‌న్ కమర్షియల్ సక్సెస్ కోసం పోరాడుతున్నాడు. ఎంతో టాలెంట్, మంచి లుక్స్ ఉన్నప్పటికీ కమర్షియల్ హీరో స్టేటస్ అందుకోలేకపోతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ సినిమాలు చేస్తున్న సందీప్ కు తగిన గుర్తింపు రావడం లేదు. మాస్ ఇమేజ్ కోసం కమర్షియల్ సినిమాలు చేసినా పనికిరాకుండా పోయాయి. ఈ సారి మంచి కమర్షియల్ హిట్ సాధించాలని రీసెంట్ గా ‘మైఖేల్’ లాంటి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సందీప్‌ కిష‌న్ కెరీర్‌లో ఫ‌స్ట్ పాన్ ఇండియ‌న్ సినిమా ఇదే. ఈ సినిమాను తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో ఒకేరోజు రిలీజ్ చేశారు.

ఈ సినిమా విడుదలకు ముందు మేకర్స్ చేసిన ప్రమోషన్స్, టీజర్స్, ట్రైలర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. ఈ సినిమాపై సందీప్ కిషన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే రిలీజ్ తర్వాత ఈ మూవీ ఆ అంచనాలను అందుకోలేకపోయిందీ మైఖేల్.  దీనిలో యాక్ష‌న్ ఎపిసోడ్స్ బాగున్నా, ఈ సినిమా పూర్తిగా కేజీఎఫ్ స్టైల్‌లో ఉండడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. అసలు పోటీ అనుకోని రైటర్ పద్మభూషణ్ ఈ సినిమాకు గట్టి పోటీ ఇచ్చింది. దాంతో వారం రోజుల్లోనే సగం థియేటర్లు ఖాళీ అయ్యాయి. పెద్ద స్క్రీన్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ పాన్ ఇండియా మూవీని డిజిటల్ స్క్రీన్లలోకి తెచ్చేందుకు సన్నాహకాలు మొదలయ్యాయి. అల్లు అరవింద్ కంపెనీ అయిన ఆహా ఓటీటీ మైఖేల్ స్ట్రీమింగ్ రైట్లను దక్కించుకుంది. థియేటర్లలో ఆడియన్స్​ను మెప్పించలేకపోయిన ఈ మూవీ ఇక డిజిటల్ తెర మీద ఎంత మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. 

అయితే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయని, వారి కోసమే సినిమాను చూడొచ్చని ఓ వర్గం ప్రేక్షకులు అంటున్నారు. ఇదిలావుంటే, ఈ సినిమా అప్పుడే OTT లోకి వచ్చేసింది. ప్రముఖ OTT సంస్థ ఆహా ఈ సినిమా రిలీజ్ డేట్‌‌ని ప్రకటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 24 నుండి స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడైంది. పాన్ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా బడ్జెట్‌లో సగం కూడా రికవర్ చేయలేకపోయింది. పాపం సందీప్ కిషన్ హిట్ కోసం ఎంత ట్రై చేసినా కానీ కొత్తదనం ఉన్న స్టోరీలను ఎంచుకున్నా కానీ ఈ యంగ్ హీరోకు మాత్రం హిట్ పడడం లేదు. ఈ మధ్య సందీప్​ కిషన్​కు చెప్పుకునేందుకు ఏ ఒక్క హిట్టూ సరిగా లేదు. సందీప్​తో ఇండస్ట్రీలోకి వచ్చిన వారు ఎక్కడికో వెళ్లిపోగా.. సందీప్ మాత్రం ఇంకా అక్కడే ఉంటున్నాడు. ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ విజయ్ సేతుపతిని తీసకున్నా కానీ అతడు కూడా సినిమాను డిజాస్టర్ నుంచి సేవ్ చేయలేకపోయాడు.  థియేటర్​లో కోట్లు కొల్లగొట్టలేకపోయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో చూసే ప్రేక్షకులను ఎంత వరకు థ్రిల్ చేస్తుందో వేచి చూడాలి. మజిలీతో మనసులను దోచిన ముద్దుగుమ్మ దివ్యాంశ కౌశిక్ ఈ మూవీలో సందీప్ సరసన లీడ్​ రోల్​లో నటించింది.