మెట్రో ఇన్ డినో సెట్స్‌లో అనురాగ్ బసు, అనుపమ్ ఖేర్‌ల వీడియో వైరల్

బాలీవుడ్ ప్రముఖ రచయిత, దర్శకుడు అనురాగ్ బసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. విభిన్న సినిమాలకు దర్శకత్వం వహించి మంచి ఫేమ్  సంపాదించుకున్న దర్శకుడు అనురాగ్ బసు.. బర్ఫీ, లూడో, జగ్గా జాసూస్ వంటి చిత్రాలకు ఎన్నో ప్రముఖ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అనురాగ్ బసు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే..  తాజాగా అనుపమ్ ఖేర్ కోసం అనురాగ్ బసు ఎగ్ దోశ వేయడం, అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. […]

Share:

బాలీవుడ్ ప్రముఖ రచయిత, దర్శకుడు అనురాగ్ బసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. విభిన్న సినిమాలకు దర్శకత్వం వహించి మంచి ఫేమ్  సంపాదించుకున్న దర్శకుడు అనురాగ్ బసు.. బర్ఫీ, లూడో, జగ్గా జాసూస్ వంటి చిత్రాలకు ఎన్నో ప్రముఖ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అనురాగ్ బసు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే..  తాజాగా అనుపమ్ ఖేర్ కోసం అనురాగ్ బసు ఎగ్ దోశ వేయడం, అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియో‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

అనురాగ్ బసు అనుపమ్ ఖేర్ ఇద్దరూ మంచి స్నేహితుల అన్న సంగతి మనకి తెలిసిందే.  మెట్రో ఇన్ డినో సెట్స్ లో అనురాగ్ బసు అనుపమ్ ఖేర్ ఎగ్ దోశ వేయడంతో పాటు ఆ టేస్టీ  దోశను అనుపమ్ ఖేర్ లొట్టలేస్తూ లాగించేశాడు.  అందుకు సంబంధించిన ఒక వీడియోను తన అభిమానులతో పంచుకోవడంతో, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్స్ రకరకాల కామెంట్ చేస్తున్నారు. లైక్, లవ్, ఫైర్ సింబల్ ఎమోజీలను షేర్ చేస్తూ ఆ వీడియోను వైరల్ చేసే పనిలో పడ్డారు నెటిజన్స్.

కార్తికేయ 2, ది కాశ్మీరీ ఫైల్స్ తరువాత అనురాగ్ బసు, అనుపమ్ ఖేర్ నటిస్తున్న మరో చిత్రం మెట్రో ఇన్ డినో.. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న లైఫ్ ఇన్ ఏ మెట్రోకి అదనంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం నుంచి అనుపమ్ ఖేర్ అప్డేట్ కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో డిఫరెంట్ రోల్లో కనిపించనున్నారని తాజాగా విడుదల చేసిన క్లిప్‌లో తెలుస్తోంది.  

ఇటీవల మెట్రో ఇన్ డినో సినిమా విడుదల చేశారు. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 డిసెంబర్ 8న థియేటర్లో విడుదల కానుంది. ప్రొడక్షన్ బ్యానర్ టి సిరీస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రీతం ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆంథాలజీ చిత్రంగా రానున్న ఈ సినిమాలో ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీఖాన్, కొంకణాసేన్ శర్మ , పంకజ్ త్రిపాఠి, ఫాతిమా సనా షేక్, అనుపమ్ ఖేర్ , అలీ ఫజల్, నీనా గుప్తా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ చిత్రంపై ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి. 

సమకాలీన జంటల కథలను ఒకచోట చేర్చి నిర్మాత భూషణ్ కుమార్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు ఎట్టకేలకు తమ మోస్ట్ ఎవైటింగ్ ప్రొడక్షన్ వెంచర్ మెట్రో ఇన్ డినో ను ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. ఆధునిక కాలపు దృశ్యంతో , చేదు సంబంధాల కథలను ఈ సినిమా వివరిస్తుంది. ప్రేమ, మనోభావాలకు సంబంధించిన విభిన్నమైన కథలను ఈ సినిమా కళ్ళకు అద్దం పట్టినట్లు చూపిస్తుంది.