హిట్ కోసం వెయిట్ చేస్తున్న హనీ

సినీ ఇండస్ట్రీ అనేది హిట్టు, ప్లాపుల మీదే ఆధారపడి నడుస్తుంది. అది టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ ఏదైనా రీజనల్ ఇండస్ట్రీ కానీ ఇక్కడ హిట్టుంటేనే ఎవరికైనా సరే విలువ ఉంటుంది. అందుకోసమే ఇండస్ట్రీలో పని చేసే పెద్ద పెద్ద స్టార్లే కాదు… చిన్న ఆర్టిస్టులు కూడా హిట్ల కోసం ప్రాణాలను పణంగా పెట్టి రిస్క్ చేస్తుంటారు. వారిలో కొంత మందికి మాత్రమే హిట్ అందుతుంది. చాలా మంది హిట్ కోసం ముఖం వాచిపోయేలా […]

Share:

సినీ ఇండస్ట్రీ అనేది హిట్టు, ప్లాపుల మీదే ఆధారపడి నడుస్తుంది. అది టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ ఏదైనా రీజనల్ ఇండస్ట్రీ కానీ ఇక్కడ హిట్టుంటేనే ఎవరికైనా సరే విలువ ఉంటుంది. అందుకోసమే ఇండస్ట్రీలో పని చేసే పెద్ద పెద్ద స్టార్లే కాదు… చిన్న ఆర్టిస్టులు కూడా హిట్ల కోసం ప్రాణాలను పణంగా పెట్టి రిస్క్ చేస్తుంటారు. వారిలో కొంత మందికి మాత్రమే హిట్ అందుతుంది. చాలా మంది హిట్ కోసం ముఖం వాచిపోయేలా ఎదురు చూస్తుంటారు. ఇంకా కొంత మంది మాత్రం ఇండస్ట్రీలో విజయం సాధించాలంటే కేవలం టాలెంట్ ఉంటే సరిపోదని కొంత లక్ కూడా ఉండాలని చెబుతుంటారు. లక్ ఉన్న వారినే ఇండస్ట్రీ పట్టించుకుంటుందని కూడా చెబుతారు. కొంత మంది ఈ వాదన తప్పని కొట్టేసినా కానీ ఇదే వాదన కరెక్టేమో అని చాలా సందర్భాల్లో చాలా మంది నటులకు అనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం గోల్డెన్ లెగ్ లుగా పేరు పొందిన వారు ప్రతి ఒక్కరూ టాలెంటెడ్ జనాలు కాకపోవచ్చు. ఐరన్ లెగ్ లుగా ముద్రపడ్డ వారు ప్రతి ఒక్కరూ టాలెంట్ లేని వారు కాకపోవచ్చు. వారికి టాలెంట్ బోలెడంత ఉన్నా కానీ లక్ కలిసి రాని సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉంటాయి. అలా లక్ కు దూరమైన టాలీవుడ్ హీరోయిన్లలో మెహ్రీన్ పిర్జాదా ఒకరు. చివరికి సీనియర్ హీరో మాస్ మహారాజ రవితేజతో నటించినా కానీ ఆ మూవీ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ అనిల్ రావిపూడికి, హీరో రవితేజకే పోయింది తప్పా అమ్మడి అకౌంట్లోకి ఏ మాత్రం క్రెడిట్ రాలేదు. దీంతో అమ్మడు తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. 

పర్సనల్ లైఫ్ లో కూడా… 

మెహ్రీన్ పిర్జాదాకు ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాకుండా పర్సనల్ లైఫ్ కూడా అంతగా కలిసి రావడం లేదు. అప్పట్లో మాజీ సీఎం మనవడితో ఈ అమ్మడు ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇది చూసిన అమ్మడు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. తమ హీరోయిన్ కు ప్రొఫెషనల్ లైఫ్ అంతగా కలిసిరాకపోయినా కానీ పర్సనల్ లైఫ్ లో బాగానే సెటిల్ అవుతుందని అంతా ఆశపడ్డారు. కానీ ఈ సంబరం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. భవ్య బిష్ణోయ్ అనే వ్యక్తితో అమ్మడు తన ఎంగేజ్ మెంట్ ను క్యాన్సిల్ చేసుకుంది. ఇందుకు గల కారణాలను ఇరు కుటుంబాలు చెప్పకపోయినప్పటికీ ఈ నిర్ణయం మాత్రం మెహ్రీన్ కు పెద్ద నష్టాన్నే మిగిల్చిందని అంతా అనుకుంటున్నారు. ఈ నిర్ణయం వల్ల అమ్మడు రెండు పెద్ద ఆఫర్ లను కోల్పోయిందట. యంగ్ హీరోయిన్ అయినా కానీ ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం రావడం లేదు. అందాల ఆరబోత అనేది ప్రధాన భూమిక పోషిస్తుంటుంది. ఎక్స్ పోజ్ చేసేందుకు మెహ్రీన్ ఎంత ఓకే చెప్పినా కానీ మేకర్స్ ఎవరూ ఈ బ్యూటీని పట్టించుకోవడం లేదు. 

ఎఫ్ 2లో ఇరగదీసిన హనీ

విక్టరీ వెంకటేశ్, యంగ్ హీరో వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ఎఫ్-2 మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ హనీగా మెహ్రీన్ తన మార్క్ కామెడీతో ఆకట్టుకుంది. ‘హనీ ఈజ్ ద బెస్ట్’ అంటూ మెహ్రీన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ మూవీలో ఆమె క్యారెక్టర్ ఓ రేంజ్ లో పేలిపోయింది. ఈ మూవీ చూసిన చాలా మంది మెహ్రీన్ కు ఇక ఆఫర్ల వరద పారుతుందని ఊహించారు. కానీ అలా జరగలేదు. ఈ బ్యూటీకి ఈ మూవీ తర్వాత కూడా అరకొరగానే ఆఫర్లు వచ్చాయి. ఈ బ్యూటీ కేవలం అందంగా ఉండడం మాత్రమే కాదు. తాను చాలా టాలెంటెడ్ అని మెహ్రీన్ ను దగ్గరి నుంచి చూసిన వారు చెబుతుంటారు. మెహ్రీన్ టాలెంట్ గురించి చెప్పుకోవాలంటే ఎఫ్ 2 మూవీలో తన కామెడీ టైమింగ్ చూస్తే తెలిసిపోతుంది. ‘హనీ ఈజ్ ద బెస్ట్’ అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మెహ్రీన్ కు టాలెంట్ కు కొదువ లేదు కానీ లక్ ప్యాక్టరే అమ్మడుకు బాగో లేనట్లుగా ఉంది. ఎఫ్ 2 లో హనీగా అలరించిన మెహ్రీన్ రాజా ది గ్రేట్‌ మూవీలో క్యూట్ లవర్ గర్ల్‌ గా నటించి మెప్పించింది. ఇక శర్వానంద్ హీరోగా నటించిన మహానుభావుడు లో అమ్మడు చేసిన క్యారెక్టర్ విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంది. 

కొత్త మూవీ కలిసొచ్చేనా..

ఆఫర్లు లేని మెహ్రీన్ కొత్త హీరో విక్రాంత్ తో కలిసి స్పార్క్ అనే మూవీలో నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ టీజర్లు ఆకట్టుకునేలానే ఉన్నాయి. ఈ మూవీలో మెహ్రీన్ తో పాటు మరో హీరోయిన్ కూడా నటిస్తోంది. నవంబర్ 17న ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. మరి ఈ మూవీతో అయినా మెహ్రీన్ లక్ మారుతుందో వెయిట్ అండ్ సీ…